Jump to content

విజయ్ విక్రమ్ సింగ్

వికీపీడియా నుండి
విజయ్ విక్రమ్ సింగ్
జననం (1977-11-26) 1977 November 26 (age 47)
జాతీయత భారతీయుడు
వృత్తి
  • నటుడు
  • వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్
క్రియాశీలక సంవత్సరాలు2006–ప్రస్తుతం
పేరుపడ్డది బిగ్ బాస్

విజయ్ విక్రమ్ సింగ్ (జననం 26 నవంబర్ 1977) భారతీయ వాయిస్ ఓవర్ కళాకారుడు & నటుడు.[1] ఆయన భారతీయ టెలివిజన్ సిరీస్ బిగ్ బాస్ అలాగే అనేక ఇతర రియాలిటీ షోలు, ప్రకటనలకు వ్యాఖ్యాత.[2][3]

సినీ జీవితం

[మార్చు]

విజయ్ విక్రమ్ సింగ్ తన వాయిస్ ఓవర్ కెరీర్‌ను డాన్స్ ఇండియా డ్యాన్స్‌తో ప్రారంభించాడు, మనోజ్ బాజ్‌పేయి నటించిన ది ఫ్యామిలీ మ్యాన్‌తో నటుడిగా అరంగేట్రం చేశాడు.[4]

ఆయన 2019 లో ది ఫ్యామిలీ మ్యాన్ తో తన నటనా రంగ ప్రవేశం చేసాడు, మీర్జాపూర్ 2 & బ్రీత్ 2 లలో నటించాడు. విజయ్ హాట్స్టార్ లో స్పెషల్ ఆప్స్ 1.5 లో కమోడోర్ చింతామణి శర్మ పాత్రను పోషించాడు.

ఆయన " అలెగ్జాండర్ VS చాణక్య " అనే ఆంగ్ల నాటకంలో చాణక్య పాత్ర, ఆర్థర్ మిల్లర్ నాటకం " ఆల్ మై సన్స్ " హిందీ అనుసరణలు అయిన దోరాహా వంటి అనేక నాటకాల్లో నటించాడు.

విజయ్ విక్రమ్ సింగ్ సంజన సంఘీ & శర్వరీ వాఘ్‌లకు వాయిస్ & డిక్షన్‌లో శిక్షణ ఇచ్చాడు.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2006–ప్రస్తుతం బిగ్ బాస్ కథకుడు వాయిస్ ఓవర్
2019 ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 అజిత్ [5]
2020 బ్రీత్: ఇంటూ ది షాడోస్ డాక్టర్ జహంగీర్
మీర్జాపూర్ మిస్టర్ కమానీ
2021 ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 అజిత్
స్పెషల్ ఆప్స్ 1.5: ది హిమ్మత్ స్టోరీ నావల్ కమోడోర్ చింతామణి శర్మ
2022 777 చార్లీ సైనిక అధికారి కన్నడ సినిమా
2023 ఫర్జీ అజిత్
ది ట్రయల్: ప్యార్ కానూన్ ధోఖా తకేష్
2024 యోధ సీనియర్ ఆఫీసర్ ఢిల్లీ కంట్రోల్ రూమ్
ఉందేఖి అడ్వకేట్ సుందర్‌లాల్ బజాజ్
2025 ఛావా పేష్వా నీలోపంత్ [6]
క్రైమ్ బీట్ పోలీస్ కమిషనర్
సేన: గార్డియన్స్ ఆఫ్ ది నేషన్ బ్రిగేడర్ వికె సింగ్
వార్ 2 సైనిక అధికారి

మూలాలు

[మార్చు]
  1. "Meet Vijay Vikram Singh, the man behind Bigg Boss' voice, ahead of Salman Khan's Bigg Boss 19 grand premiere". OTTPlay (in ఇంగ్లీష్). Retrieved 2025-08-28.
  2. "Bigg Boss' voice Vijay Vikram Singh recalls meetings with Salman Khan, says 'We meet him as fans'". Hindustan Times. 24 January 2020.
  3. Hungama, Bollywood (2020-01-24). "Bigg Boss voice artist and The Family Man actor Vijay Vikram Singh talks about his journey and meeting Salman Khan : Bollywood News - Bollywood Hungama" (in ఇంగ్లీష్). Retrieved 2025-08-28.
  4. "Manoj Bajpayee made me comfortable on the sets 'The Family Man', says debutant Vijay Vikram Singh". News Track. 5 November 2019.
  5. Keshri, Shweta (2021-01-08). "Did you know this Family Man actor is also the Bigg Boss 14 narrator's voice?". India Today (in ఇంగ్లీష్). Retrieved 2025-08-28.
  6. Arya, Prachi (2025-02-24). "Vijay Vikram shares Vicky Kaushal cried while filming coronation scene in Chhaava". India Today (in ఇంగ్లీష్). Retrieved 2025-08-28.

బయటి లింకులు

[మార్చు]