విజయ నగర రాజుల కాలంనాటి ఆర్ధిక పరిస్థితులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విజయనగర రాజుల ఆర్థిక పరిస్థితి పటిష్ఠముగా ఉండేది.

దేశము సుభిక్షముగా ఉండేది, రాజాధాయమున అన్ని వ్యయాలూ పోను సంవత్సరాంతమునకు లక్ష మాడలు విగులు ఉండేవి.

సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితి[మార్చు]

సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితి బాగుగానే ఉండేది, వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం. భూమి సారవంతమైనది, వ్యవసాయదారులు మంచి పంటలు పండించేవారు. రాజులు వ్యవాసాయాభివృద్దికి మంచి చర్యలు తీసుకునేవారు, అనేక చెరువులూ, కాలవలూ తవ్వించి వ్యవసాయాభివృద్దికి దోహదంచేసేవారు.

పండ్లతోటలు అనేకరకాలు పెంచేవారు, కొద్దిగా ధనవంతులే వరి అన్నమును తినేవారు, మిగిలిన రైతులూ, రైతుకూలీలు పేదవారు రాగులూ, జొన్నలు, తినేవారు.

వ్యవసాయాధార పరిశ్రమలు ప్రతిగ్రామములోనూ ఉండేవి, బెల్లము, నేను తయారి, నీలిమందు తయారి, వస్త్ర పరిశ్రమ ముఖ్యమైనవి. తాడిపత్రి, ఆదవాని, వినుకొండ, గుత్తి, రాయదుర్గము పట్టుపరిస్రమకు ప్రసిద్ధిపొందిన కేంద్రాలు. ఒక్క అలవకొందలోనే 411 మగ్గాలు ఉండేవి, ఈ మగ్గాలు పై ఆధారపడి 2000 మంది జీవించేవారు.

వజ్రములు[మార్చు]

కర్నూలు, గుత్తి, అనంతపురంలందు లభించు వజ్రములు చాలా పశస్తమైనవి. ఈ వజ్రములు ప్రపంచ ప్రసిద్ధిగాంచినవి, తళ్ళికోట యుద్ధము లేదా రక్షస తంగిడి యుద్ధం తరువాత జరిగిన దోపిడిలో రాజుగారి ఖజాన యందు ఓ కోడిగుడ్డు అంత పరిమాణము ఉన్న వజ్రం దొరికినది అని చెప్పబడింది.

సైనికులకు కావలసిన కత్తులూ, శిరస్తానములు, మొదలగున్నవి తయారు చేయడం ఓ వృత్తిగా ఉండేది.

సుగంధ ద్రవ్యములు[మార్చు]

కస్తూరి, పన్నీరు, బుక్క, గులాలు వంటి సుగంధ ద్రవ్యాలు ధనవంతులు ఉపయోగించేవారు.

పాడి పరిశ్రమ కూడా మంచి ఉపాధి కలిగించుతుండేది.

నాణెములు[మార్చు]

బంగారు, వెండి నాణెములు తయారు చేయబడుచుండేవి, వరహా లేదా గద్యాణ అను బంగారు నాణెము ఉండేది తార్ అనునది ఓ వెండి నాణెము, జిటలు, కాసు అను రాగి నాణెములు వాడుకలో ఉండేవి।

విజయనగర రాజులు విజయ నగర రాజులు
సంగమ వంశం | సాళువ వంశం | తుళువ వంశం | ఆరవీడు వంశం | వంశ వృక్షం | పరిపాలన కాలం | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధం | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యం