విజిల్‌బ్లోయర్
![]() | ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి చర్చా పేజీలో {{వికీప్రాజెక్టు_గూగుల్_అనువాదవ్యాసాలు-మెరుగుపరచిన}} చేర్చండి. |
విజిల్‌బ్లోయర్ అంటే, ఒక సంస్థ లేదా వ్యక్తుల సమూహంలో తప్పిదం జరిగినప్పుడు ఎత్తిచూపే వ్యక్తి. సామాన్యంగా, ఈ వ్యక్తి అదే సంస్థకు చెందినవారై ఉంటారు. సంబంధిత దుష్ప్రవర్తనను ఎన్నో రకాలుగా వర్గీకరించవచ్చు; ఉదాహరణకు, ఒక చట్టం, నియమం, నిబంధన యొక్క ఉల్లంఘన మరియు/లేదా మోసం, ఆరోగ్య/సంక్షేమ ఉల్లంఘన, మరియు అవినీతివంటి ప్రజా ప్రయోజనాలకు ప్రత్యక్ష అపాయం. విజిల్బ్లోయర్లు వారి ఆరోపణలు అంతర్గతంగా (ఉదాహరణకు, నేరారోపణ జరిగిన సంస్థలోని ఇతర వ్యక్తులకు) లేదా బహిర్గతంగా (శాసకులు, చట్టం అమలుచేసే యంత్రాంగాలు, మీడియా లేదా సమస్యలకు సంబంధించిన బృందాలకు) చేయవచ్చు.
విజిల్బ్లోయర్లు కొన్నిసార్లు వారు నేరారోపణ చేసిన సంస్థ లేదా సమూహం నుండి, కొన్నిసార్లు సంబంధిత సంస్థల నుండి, మరియు కొన్నిసార్లు చట్టం పరిధిలో, తరచూ ప్రతీకారానికి గురవుతూ ఉంటారు.
విషయ సూచిక
పర్యావలోకనం[మార్చు]
పదం ఆవిర్భావం[మార్చు]
విజిల్‌బ్లోయర్ అనే ఈ పదం, ఒక నేరం జరగడం గమనించినపుడు విజిల్ వేసే బ్రిటిష్ పోలీసు అధికారుల పద్ధతి నుండి పుట్టింది. ఈ విజిల్ కారణంగా చట్ట పాలన అధికారులు మరియు సాధారణ ప్రజలు, అపాయం పట్ల అప్రమత్తులవుతారు.[1]
నిర్వచనం[మార్చు]
చాలావరకూ విజిల్బ్లోయర్లు అంతర్గత విజిల్బ్లోయర్లు, వీరు తమ కంపెనీలో తోటి ఉద్యోగి లేదా అధికారి దుష్ప్రవర్తనను తెలియజేస్తారు. అంతర్గత విజిల్బ్లోయర్లకు సంబంధించిన అత్యంత ప్రధానమైన ప్రశ్న ఏమిటంటే, చట్టవిరుద్ధమైన మరియు సాధారణంగా సమ్మతం కాని ప్రవర్తనపై, ఎందుకు మరియు ఎలాంటి పరిస్థితులలో వారు అక్కడికక్కడే చర్య తీసుకుంటారు లేదా ఫిర్యాదు చేస్తారు.[2] ఒక సంస్థలో, సంస్థ ప్రణాళిక మరియు నియంత్రణ ద్వారా ఏర్పరచిన నిర్ణయాల్ని సూచించే ఫిర్యాదు వ్యవస్థలు మాత్రమే కాక, వ్యక్తులకు చాలావరకూ కచ్చితమైన గోపనీయత అందించే ఎంపికలు సైతం ఉన్నప్పుడు, అసమ్మతమైన ప్రవర్తన పట్ల, ప్రజలు చర్య తీసుకునే అవకాశం ఉందని నమ్మవచ్చు.[3]
కానీ, బహిర్గత విజిల్బ్లోయర్లు, వెలుపలి వ్యక్తులు లేదా సమూహాల దుష్ప్రవర్తనపై ఫిర్యాదు చేయవచ్చు. ఈ సందర్భాలలో, సమాచారం యొక్క తీవ్రత మరియు స్వభావాన్ని బట్టి, విజిల్బ్లోయర్లు దుష్ప్రవర్తనను న్యాయవాదులు, మీడియా, చట్ట పాలన లేదా పర్యవేక్షణ సంస్థలు, లేదా ఇతర స్థానిక, రాష్ట్ర, లేదా జాతీయ సంస్థలకు ఫిర్యాదు చేయవచ్చు. కొన్ని సందర్భాలలో, బహిర్గత విజిల్-బ్లోయింగ్ ను నగదు బహుమతులు అందించడం ద్వారా ప్రోత్సహిస్తారు.[4]
ఎన్నో U.S. జాతీయ విజిల్‌బ్లోయర్ నిబంధనల ప్రకారం, ఒక విజిల్‌బ్లోయర్ గా పరిగణించబడటానికి, ఒక ఫెడరల్ ఉద్యోగి తన యజమాని ఏదైనా చట్టం, నియమం లేదా నిబంధనను ఉల్లంఘించినట్లూ భావించేందుకు కారణం ఉండాలి; చట్ట పరిరక్షిత విషయాలలో తెలియజేయడం లేదా చట్ట కార్యకలాపాలను ప్రారంభించాలి; లేదా చట్ట ఉల్లంఘనను తిరస్కరించాలి.
ఒక ప్రత్యేక విషయంలో నిబంధనల వలన, విజిల్-బ్లోయింగ్ కుదరని పక్షంలో, U.S. న్యాయస్థానాలు, సాధారణంగా అటువంటి విజిల్బ్లోయర్లు ప్రతీకారం నుండి రక్షింపబడాలని భావిస్తాయి.[5] కానీ, గర్సేట్టి v. సేబల్లోస్ (2006)లో, ఒక అస్పష్టమైన U.S. సుప్రీం కోర్ట్ నిర్ణయం ప్రకారం, ప్రభుత్వోద్యోగులకు మొదటి సవరణ వాక్స్వాతంత్ర్యం కారణంగా ఉద్యోగి కర్తవ్యం పరిధిలోని నివేదనలను రక్షించడం జరగదు.
సామాన్య ప్రతిచర్యలు[మార్చు]
విజిల్-బ్లోయింగ్ గురించిన భావనలు చాలా భేదాలతో ఉంటాయి. విజిల్బ్లోయర్లను సామాన్యంగా ప్రజా ప్రయోజనానికీ మరియు సంస్థ జవాబుదారీ కొరకు పనిచేసే నిస్వార్థ యోధులుగా చూడడం జరుగుతుంది; కొందరు వారిని కేవలం వ్యక్తిగత కీర్తి మరియు ప్రసిద్ధి కొరకు పనిచేసే 'వదరుబోతులు' లేదా 'వేగులు'గా భావిస్తారు. కొందరు విద్యావేత్తల (థామస్ అల్యూర్డ్ ఫాన్స్ వంటి వారు) అభిప్రాయం రకారం, విజిల్బ్లోయర్లు వారు అడ్డంకులను ఎదుర్కొంటూ ధర్మ సూత్రాలను ప్రయోగించే ప్రయత్నాలు చేయడం వలన కనీసం వారి వాదనను వినిపించే అధికారం కలిగి ఉండాలి మరియు దృఢమైన న్యాయ విలువలువంటి విద్యాసంబంధ ఆధారం ఉన్నట్లయితే విజిల్-బ్లోయింగ్ అనేది ప్రభుత్వ వ్యవస్థల్లో మరింత గౌరవింపబడుతుంది.[6][7]
ప్రతీకార భయం మాత్రమే కాక, ఉద్యోగంలోనూ మరియు ఉద్యోగం వెలుపల కూడా సంబంధాలు పోగొట్టుకోవడం అనే భయం వలన, ఎందఱో ప్రజలు కనీసం నేరారోపణ చేయాలని అనుకోకపోవడం సాధ్యమే.[8]
చాలావరకూ సందర్భాలు అతి-తక్కువ స్థాయి మరియు మీడియా దృష్టిని ఆకర్షించడం తక్కువ లేదా అసలు లేకపోవడం వలన మరియు గణనీయమైన దుష్ప్రవర్తనపట్ల ఫిర్యాదు చేసిన విజిల్బ్లోయర్లు సామాన్యంగా ఏదో ఒక రకమైన అపాయం లేదా పీడించడానికి గురికావడం వలన, కీర్తి మరియు ప్రసిద్ధి కావాలనుకోవడం అనే ఆలోచనను నమ్మే అవకాశం తక్కువ.[ఉల్లేఖన అవసరం]
విజిల్బ్లోయర్లను పీడించడం అనేది ప్రపంచంలోని ఎన్నో ప్రదేశాలలో తీవ్ర సమస్యగా మారింది. యజమానుల ప్రతీకారం నుండి తరచూ విజిల్బ్లోయర్లు చట్టపరమైన రక్షణ పొందినప్పటికీ, ఎన్నో సందర్భాలలో విజిల్ బ్లోయింగ్ కారణంగా, పదవీచ్యుతి, తాత్కాలిక తొలగింపు, పదవి తగ్గింపు, వేతనం నిలిపివేత, మరియు/లేదా ఇతర ఉద్యోగుల నుండి తీవ్రమైన అనాదరణ వంటి శిక్షలను ఎదుర్కోవడం జరిగింది. ఉదాహరణకు, సంయుక్త రాష్ట్రాలలో, ఎన్నో విజిల్‌బ్లోయర్ రక్షణ చట్టాలలో విజిల్‌బ్లోయర్ ప్రతీకారం రుజువైనప్పుడు ఉద్యోగ నష్టానికి బదులుగా పరిమితమైన "పూర్తి చేసే" పరిష్కారాలు లేదా నష్టపరిహారం ఉంటుంది. కానీ, ఎందఱో విజిల్బ్లోయర్లు, దుష్ప్రవర్తన నేరారోపణ ఎదుర్కొనే సంస్థలు లేదా ప్రభుత్వ యంత్రాంగాలలో విస్తృతమైన "దూతను కాల్చివేసే" తత్త్వం ఉంటుందనీ మరియు కొన్ని సందర్భాలలో, తప్పిదం జరిగినప్పుడు ఫిర్యాదు చేసినందుకుగాను ప్రతీకారంగా, విజిల్బ్లోయర్లు నేరారోపణను ఎదుర్కోవలసి వచ్చిందని చెబుతారు.
దీనికి ప్రతిచర్యగా, ఎన్నో ప్రైవేటు సంస్థలు విజిల్‌బ్లోయర్ చట్టపరమైన భద్రతా నిధులు లేదా సహకార సమూహాలను విజిల్బ్లోయర్లకు చేయూతను అందించడానికి ఏర్పరచడం జరిగింది; అటువంటి రెండు ఉదాహరణలు, USలో ది నేషనల్ విజిల్బ్లోయర్స్్ సెంటర్, మరియు UKలో పబ్లిక్ కన్సర్న్ అట్ వర్క్ . పరిస్థితులను బట్టి, విజిల్బ్లోయర్లు సహోద్యోగుల ద్వారా వెలివేయబడడం, భవిష్యత్తులో యజమానులయ్యే అవకాశం ఉండే వ్యక్తుల వద్ద భేదభావం ఎదుర్కోవడం లేదా చివరికి వారి సంస్థ నుండి తొలగించబడడం మామూలే. సంస్థ నుండి వారిని తొలగించడానికి విజిల్బ్లోయర్లు లక్ష్యంగా జరిగే ఈ ప్రచారాన్ని మాబింగ్ అంటారు. ఇది, ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఒక సమూహం పనిచేసే, కార్యాలయ బెదిరింపు యొక్క తీవ్ర రూపం.
చట్టపరమైన భద్రత[మార్చు]
సంయుక్త రాష్ట్రాలలో, విజిల్ బ్లోయింగ్ యొక్క విషయాన్ని బట్టి మరియు కొన్నిసార్లు సంఘటన జరిగిన రాష్ట్రాన్ని బట్టి చట్టపరమైన రక్షణ మారుతూ ఉంటుంది.[9] 2002వ సంవత్సరంలో సర్బనేస్-ఆక్స్లే యాక్ట్ అనుమతించడంలో, ది సెనేట్ జ్యుడిషియరీ కమిటీ, విజిల్‌బ్లోయర్ రక్షణలు వివిధ రాష్ట్ర నిబంధనల "భావనలు మరియు మార్పుల"పై ఆధారపడి ఉంటాయని గమనించింది.[10] అయినా, ఉల్లంఘనల గురించి తెలియజేసే, ఆజ్ఞలను అమలుచేయడంలో సాయంచేసే, లేదా చట్టవిరుధ్ద నిర్దేశాలను తిరస్కరించే ఉద్యోగులను రక్షించేందుకు, విస్తృతమైన జాతీయ మరియు రాష్ట్రీయ చట్టాలు ఉన్నాయి.
ప్రత్యేకంగా విజిల్బ్లోయర్లను రక్షించడానికి అవలంబించిన మొట్టమొదటి U.S. చట్టం, 1912లో లాయ్డ్-లా ఫాలేట్ యాక్ట్. ఈ చట్టం జాతీయ ఉద్యోగులకు సంయుక్త రాష్ట్ర కాంగ్రెస్ కు సమాచారం తెలియజేసే హక్కును కల్పించింది. ఉద్యోగి భద్రత కలిగిన మొట్టమొదటి U.S. పర్యావరణ చట్టం, 1972లో జల కాలుష్య నివారణ చట్టం, దీనినే శుద్ధ జల చట్టం అని కూడా అంటారు. ఇటువంటి భద్రతలనే తరువాతి జాతీయ పర్యావరణ చట్టాలైన సురక్షిత త్రాగునీటి చట్టం (1974), వనరుల రక్షణ మరియు పునఃప్రాప్తి చట్టం (దీనినే సాలిడ్ వేస్ట్ డిస్పోసల్ యాక్ట్4} అని కూడా అంటారు) (1976), విషపూరిత పదార్థాల నియంత్రణ చట్టం (1976), శక్తి పునర్వినియోగ చట్టం 1974 (అణుశక్తి విజిల్బ్లోయర్ల రక్షణకు 1978 సవరణ ద్వారా), [[కంప్రెహెన్సివ్ ఎన్విరాన్మెంటల్ రెస్పాన్స్, కంపెన్సేషన్, అండ్ లయబిలిటీ యాక్ట్ (CERCLA, లేదా ది సూపర్ ఫండ్ లా)]] (1980), మరియు శుద్ధ వాయు చట్టం (1990)లలో చేర్చడం జరిగింది. OSHA ద్వారా అమలుపరచబడిన అటువంటి ఉద్యోగుల భద్రతలు, ట్రక్ డ్రైవర్ల భద్రతకు రోడ్డు రవాణా చేయూత చట్టం (1982), 2002లోని పైప్ లైన్ రక్షణ అభివృద్ది చట్టం (PSIA), 21వ శతాబ్దం కొరకు వెండెల్ H. ఫోర్డ్ ఏవియేషన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రిఫార్మ్ యాక్ట్ ("AIR 21"), మరియు 2002 జూలై 30న అమలులోకి వచ్చిన సర్బానేస్-ఆక్స్లే యాక్ట్, (కార్పోరేట్ ఫ్రాడ్ విజిల్బ్లోయర్లకు), లలో కూడా చేర్చబడ్డాయి.
చట్టాల రూపకల్పనకు అర్థం, సవ్యమైన ఫిర్యాదులు చేయడానికి సరైన సమయాలు మరియు మాధ్యమాల గురించి తెలుసుకోవడానికి, సమస్యకు చెందిన చట్టాల గురించి ప్రతీకారానికి గురయిన బాధితులు తెలుసుకుని ఉండాలి. కొన్ని సమయాలు దాదాపు 10 రోజులవంటి తక్కువ వ్యవధి కలిగి ఉంటాయి (అరిజోనా రాష్ట్ర ఉద్యోగులు, అరిజోనా స్టేట్ పర్సనెల్ బోర్డ్ కు "ప్రోహిబిటేడ్ పర్సనెల్ ప్రాక్టీసు" ఫిర్యాదు చేయడానికి; మరియు ఓహియో ప్రభుత్వోద్యోగులు, స్టేట్ పర్సనెల్ బోర్డ్ అఫ్ రివ్యూకు మనవి చేసుకోవడానికి). ఇదే వ్యవధి పర్యావరణ విజిల్బ్లోయర్లు ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ [OSHA]కు వ్రాతపూర్వకమైన ఫిర్యాదు చేయడానికి 30 రోజులు. వివక్ష, ప్రతీకారం లేదా ఇతర పౌర హక్కుల చట్టాల ఉల్లంఘనలపై, వారి సంస్థ యొక్క సమాన ఉపాధి అవకాశాల (EEO) అధికారికి ఫిర్యాదు చేయడానికి జాతీయ ఉద్యోగులకు 45 రోజుల వ్యవధి లభిస్తుంది. వాయుయాన ఉద్యోగులు మరియు కార్పోరేట్ ఫ్రాడ్ విజిల్బ్లోయర్లకు వారి ఫిర్యాదులు OSHAకు అందించడానికి 90 రోజుల వ్యవధి లభిస్తుంది. అణుశక్తి విజిల్బ్లోయర్లు మరియు ట్రక్ డ్రైవర్లకు వారి ఫిర్యాదులు OSHAకు అందించడానికి 180 రోజుల వ్యవధి లభిస్తుంది. నిర్వహణ సంఘంపై ప్రతీకార బాధితులు, మరియు ఉద్యోగ పరిస్థితులను అభివృద్ధి చేయడానికి ఇతర సంఘటిత చర్యలపై నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డ్ (NLRB)కు ఫిర్యాదులు చేయడానికి లభించే వ్యవధి ఆరు నెలలు. ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగులు, జాతీయ సమాన ఉపాధి అవకాశాల సంఘం (EEOC)కు ఫిర్యాదులు చేయడానికి లభించే వ్యవధి 180 లేదా 300 రోజులు (వారి రాష్ట్రంలో "వాయిదా" సంస్థ ఉండడంపై ఆధారపడి), ఇవి జాతి, లింగవివక్ష, వయసు, జాతీయత లేదా మతం ఆధారంగా వివక్షకు సంబంధించి ఉంటాయి. కనీస వేతనాలు కోరినందుకు లేదా ఓవర్-టైం కొరకు భత్యం కోరినందుకు ప్రతిచర్యలకు గురయ్యే వారికి ఒక సివిల్ కేసు దాఖలు చేయడానికి లభించే వ్యవధి, న్యాయస్థానం దృష్టిలో ఆ ఉల్లంఘన "ఉద్దేశపూర్వకం" కావడాన్ని బట్టి రెండు లేదా మూడు సంవత్సరాలు.
జాతీయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు ఫిర్యాదు నమోదు చేసి, మరియు ఫలితంగా ప్రతికూల ఉపాధి చర్యలను ఎదుర్కొనేవారికి, U.S. ఫాల్స్ క్లెయిమ్స్ యాక్ట్ (FCA) క్రింద పరిష్కారం కొరకు ఒక సివిల్ కేసు దాఖలు చేయడానికి (రాష్ట్ర చట్టం ఆధారంగా) లభించే వ్యవధి, దాదాపు ఆరు సంవత్సరాలు.[11] క్వి తాం ప్రకారం, నేరస్తుల నుండి ప్రభుత్వం రాబట్టిన రాశిలో నివేదిక యొక్క "అసలైన మూలం" కూడా కొంత శాతాన్ని పొందవచ్చు. కానీ, ఇందుకొరకు వంచన ద్వారా సంపాదించిన జాతీయ నిధులను రాబట్టేందుకు ఒక ఫెడరల్ సివిల్ ఫిర్యాదు చేసిన మొట్టమొదటిది "అసలైన మూలం" కావడం అవసరం, మరియు ఈ తప్పిదం విచారణ గురించి U.S. న్యాయ విభాగం నిర్ణయించేవరకూ, దీనికి ప్రచారం కల్పించడం నివారించాలి. అటువంటి క్వి తాం కేసులు సీల్ ఉపయోగించి దాఖలు చేయాల్సి ఉంటుంది, ఇందులో జాతీయ ప్రభుత్వం ప్రత్యక్ష విచారణ గురించి నిర్ణయం తీసుకునేవరకూ, ఈ విచారణ బహిరంగ పరచకుండా ఉండడానికి, ప్రత్యేక విధానాలు అవలంబించాల్సి ఉంటుంది.
జాతీయ ఉద్యోగులు, విజిల్‌బ్లోయర్ ప్రొటెక్షన్ యాక్ట్,[12] మరియు నో ఫియర్ యాక్ట్ (చట్టవిరుద్ధమైన ప్రతిచర్యల ఆర్థిక వనరులకు ప్రత్యక్షంగా వివిధ సంస్థలను బాధ్యత వహించేలా చేసినవి) ద్వారా లాభం పొందవచ్చు . అటువంటి కొన్ని సందర్భాలలో జాతీయ రక్షణలు, విజిల్బ్లోయర్ల తరఫున ఆఫీస్ అఫ్ స్పెషల్ కౌన్సెల్ ద్వారా నిర్వహింపబడతాయి.
ది మిలిటరీ విజిల్‌బ్లోయర్ ప్రొటెక్షన్ యాక్ట్[13], ఎవరైనా కాంగ్రెస్ సభ్యులతో సంభాషించడానికి సాయుధ దళాల సభ్యుల హక్కును పరిరక్షిస్తుంది (సమాచారం యొక్క కాపీలు ఇతరులకు పంపినప్పటికీ).
దేశదేశాలలో విజిల్ బ్లోయింగ్ యొక్క చట్టపరమైన భద్రతా మారుతూ ఉంటుంది.[14] యునైటెడ్ కింగ్డంలో, దుష్ప్రవర్తన మరియు అటువంటి విషయాలను తెలియజేసే సమాచారం అందించిన వ్యక్తులకు పబ్లిక్ ఇంట్రెస్ట్ డిస్క్లోజర్ యాక్ట్ 1998, చట్టపరమైన భద్రత కల్పిస్తుంది. వ్యావహారికంలో, అది విజిల్బ్లోయర్లకు బాధింపబడడం మరియు పదవీచ్యుతి నుండి భద్రత కల్పిస్తుంది.
చట్టపరమైన నిబంధనలు[మార్చు]
మూస:Out of date మూస:Globalize/USA
సేల్లాబోస్ కేసు మరియు ది విజిల్‌బ్లోయర్ ప్రొటెక్షన్ యాక్ట్ అఫ్ 2007[మార్చు]
ప్రభుత్వానికి చెందిన విజిల్బ్లోయర్లకు పెద్ద ఎదురుదెబ్బగా భావించే విధంగా, U.S. సుప్రీం కోర్ట్ గర్సేట్టి v. సెబాల్లోస్, 04-5, 547 US 410,[15] కేసులో వెలువరించిన తీర్పు నిలిచింది, దాని ప్రకారం వృత్తి నైపుణ్యం అంచనాలలో యజమానుల ప్రతీకారం నుండి ప్రభుత్వోద్యోగులు, చెప్పబడిన సందేశం అతడి/ఆమె విధుల్లో భాగంగా ఉన్నప్పుడు, రాజ్యాంగంలోని మొదటి సవరణ ప్రకారం రక్షణ పొందడానికి అర్హులు కారు.[16] సెబాల్లోస్ అతడి మేమో తన అధికారిక విధుల్లో భాగంగా తయారు చేయబడిందని వాదించలేదు. మొదటి సవరణ ద్వారా ఫెడరల్ కేసును దాఖలు చేసే విజిల్బ్లోయర్లు, ప్రస్తుతం ఎల్లప్పుడూ మెమోలూ మరియు వ్రాతలూ అధికారిక విధుల్లో మాత్రమే కాక, పౌరుల అభిప్రాయం మరియు ప్రజా సంబంధ సందేశాలలో భాగమని చెప్పడం అవసరం. ప్రతీకారానికి కారణం మెమోలోని వాక్యప్రయోగం కాదనీ, దానికి దారితీసిన ఆలోచనలనీ చెప్పడం ద్వారా ఇది చేయవచ్చు. సెబాల్లోస్ విషయంలో, అతడు తన రక్షింపబడిన సందేశం, చట్ట నియమాలను కఠినముగా పాటించడం అనే భావన, అని వాదించి ఉండవచ్చు.
మొదటి సవరణ యొక్క వాక్స్వాతంత్ర్యం రక్షణలు ఎంతో కాలంగా, విజిల్బ్లోయర్లను ప్రతీకారాల నుండి రక్షించడానికి విజిల్‌బ్లోయర్ న్యాయవాదులు ఉపయోగించారు. సుప్రీం కోర్ట్ నిర్ణయానికి సమాధానంగా, ది హౌస్ అఫ్ రెప్రెజెంటేటివ్స్, H.R. 985, 2007లో, ది విజిల్‌బ్లోయర్ ప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకురావడం జరిగింది. ప్రెసిడెంట్ జార్జ్ W. బుష్, జాతీయ భద్రతా విధానాల ఆధారంగా, కాంగ్రెస్ ద్వారా చట్టంగా అమలయిన పక్షంలో, దానిని రద్దు చేస్తానని మాట ఇచ్చారు. గణనీయమైన ద్వైపాక్షిక సహకారం కలిగిన విజిల్‌బ్లోయర్ ప్రొటెక్షన్ యాక్ట్ (S.274) యొక్క సెనేట్ రూపం, ది సెనేట్ కమిటీ ఆన్ హోంల్యాండ్ సెక్యూరిటీ అండ్ గవర్నమెంటల్ ఎఫైర్స్ ద్వారా 2007 జూన్ 13 నాడు ఆమోదింపబడింది. కానీ, ఆ బిల్ ను, సెనేటర్ టాం కోబర్న్ (R-OK) నిలిపి ఉంచడం వలన, సెనేట్ ద్వారా వోటును ఇంకా చేరాల్సి ఉంది.[17] ది నేషనల్ విజిల్‌బ్లోయర్ సెంటర్ ప్రకారం, S. 274 ను కోబర్న్ నిలిపి ఉంచడం, ప్రెసిడెంట్ బుష్ యొక్క విధానాలను పొడిగించేందుకు జరిగింది.[18]
కాలిఫోర్నియా ఫాల్స్ క్లెయిమ్స్ యాక్ట్[మార్చు]
ది కాలిఫోర్నియా ఫాల్స్ క్లెయిమ్స్ యాక్ట్, యజమాని ప్రతీకారం నుండి విజిల్బ్లోయర్లకు రక్షణను క్రింది విభాగం ద్వారా కల్పిస్తుంది: "సెక్షన్ 12653. ఉద్యోగి బహిరంగపరచడంలో యజమాని జోక్యం."[19] ఈ విభాగం క్రింద యజమానులు, ఒక ఉద్యోగి ప్రభుత్వానికి ఫాల్స్ క్లెయిమ్స్ చర్య గురించి సమాచారం తెలియజేయడాన్ని నివారిస్తూ నిబంధనలు తయారు చేయకూడదు, ఉద్యోగి ప్రభుత్వానికి సమాచారం తెలియజేసినందుకు, ఒక యజమాని అతడు లేదా ఆమెను తొలగించడం, పదవి తగ్గించడం, తాత్కాలికంగా తొలగించడం, బెదిరించడం, వేధించడం, పదోన్నతి కల్పించకపోవడం, లేదా ఎలాంటి ఇతర వివక్ష చూపించడం చేయకూడదు.
కన్సైన్షస్ ఎంప్లాయీ ప్రొటెక్షన్ యాక్ట్ (CEPA)[మార్చు]
CEPA, న్యూజెర్సీ యొక్క విజిల్‌బ్లోయర్ చట్టం ప్రకారం, ఈ క్రింది పనులు చేసిన ఉద్యోగిపై యజమాని ప్రతీకార చర్య తీసుకోవడం నిషిద్ధం:
- యజమాని లేదా వ్యాపార సంబంధాలు కలిగిన ఇతర యజమాని యొక్క ఒక చర్య, విధానం లేదా పద్ధతి గురించి, చట్టంద్వారా జారీ చేయబడిన ఏదైనా ఒక చట్టం లేదా నియమం లేదా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లూ బలీయంగా నమ్మినప్పుడు, లేదా, అనుమతి లేదా యోగ్యతాపత్రం పొందిన ఆరోగ్య పరిరక్షణ ఉద్యోగుల విషయంలో, రోగి సంక్షేమంలో అపసవ్యమైన నాణ్యత ఉన్నట్లుగా నమ్మినప్పుడు, ఒక పర్యవేక్షకుడికి లేదా ప్రభుత్వ సంస్థకు తెలియజేయడం లేదా తెలియజేస్తానని బెదిరించడం;'
- యజమాని లేదా వ్యాపార సంబంధాలు కలిగిన ఇతర యజమాని ద్వారా, చట్టంద్వారా జారీ చేయబడిన ఏదైనా ఒక చట్టం లేదా నియమం లేదా నిబంధనల ఉల్లంఘన జరిగిన విషయం పట్ల, లేదా, అనుమతి లేదా యోగ్యతాపత్రం పొందిన ఆరోగ్య పరిరక్షణ ఉద్యోగుల విషయంలో, నాణ్యమైన రోగి పరిరక్షణ పట్ల, విచారణ లేదా వాదప్రతివాదాలు జరిపే ప్రభుత్వ సంస్థ ముందు సమాచారం తెలియజేయడం, లేదా సాక్ష్యం చెప్పడం జరిగినప్పుడు; లేదా
- చట్టంద్వారా జారీ చేయబడిన ఏదైనా ఒక చట్టం లేదా నియమం లేదా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లూ ఉద్యోగి బలీయంగా నమ్మినప్పుడు, ఏదైనా చర్య, పద్ధతి లేదా విధానంలో పాల్గొనడానికి తిరస్కరించడం, లేదా నిరసన తెలియజేసినప్పుడు, లేదా, అనుమతి లేదా యోగ్యతాపత్రం పొందిన ఆరోగ్య పరిరక్షణ ఉద్యోగుల విషయంలో, రోగి సంక్షేమంలో అపసవ్యమైన నాణ్యత ఉన్నప్పుడు; దుష్ప్రవర్తన లేదా నేరప్రవర్తన ఉన్నప్పుడు; లేదా ప్రజా ఆరోగ్యం, సంక్షేమం లేదా భద్రత లేదా పర్యావరణ పరిరక్షణ గురించి ప్రభుత్వ విధానానికి ప్రతికూలంగా ఏదైనా జరిగినప్పుడు.[20]
కొలరాడోలో "రోగి సంక్షేమ సమాచారం తెలియజేసే ఆరోగ్య పరిరక్షణ ఉద్యోగుల రక్షణ గురించి"[మార్చు]
"కొలరాడో పౌరులకు ఆరోగ్య పరిరక్షణ అందించడంలో రోగి సంక్షేమం ఎంతో ప్రధానమైనది. ఒక ఆరోగ్య పరిరక్షణ అధికారి ప్రతీకారం లేదా ప్రతిచర్య భయం లేకుండా, రోగి తరఫున మాట్లాడే హక్కు కలిగి ఉన్నప్పుడే రోగి సంక్షేమం అత్యున్నత స్థాయిలో ఉంటుంది. అత్యున్నత నాణ్యత ఆరోగ్య పరిరక్షణ అందించడానికి, ఆరోగ్య పరిరక్షణ ఉద్యోగులకు, క్రమశిక్షణా చర్యకు గురికావడం లేదా ఉద్యోగం పోవడం వంటి అపాయాలు లేకుండా, రోగి సంక్షేమ వివరాలు తెలియజేయడం మరియు రోగి సంక్షేమానికి సలహాలివ్వడం అనే హక్కు ఉండడం అవసరమని ఆరోగ్య పరిరక్షణ అందించేవారు గుర్తించారు."[21]
వీటిని కూడా చూడండి[మార్చు]
- యురోపియన్ కమ్యూనిటి కాంపిటీషన్ లా: లీనియన్సీ పాలిసీ
- ఫిర్యాదుల వ్యవస్థ
- ఫాల్స్ క్లైమ్స్ యాక్ట్
- గ్లోబల్ ఇంటెగ్రిటి ప్రపంచవ్యాప్తంగా విసిల్ బ్లోయర్స్్ యొక్క స్థితిని పర్యవేక్షిస్తూ ఉంటుంది.
- విజిల్బ్లోయర్లయొక్క జాబితా
- డిపార్టుమెంటు అఫ్ డిఫెన్స్ విజిల్‌బ్లోయర్ ప్రోగ్రాం
- క్వి తాం
- సోర్స్ క్రిటిసిసం
- వికీలీక్స్
సూచనలు[మార్చు]
- ↑ విన్టర్స్ v. హాస్టన్ క్రానికిల్ Pub. Co., 795 S.W.2d 723, 727 (టెక్ష్. 1990) (డోగ్గేట్ట్, J., కంకర్రింగ్).
- ↑ వ్యవహారం—లేక నివేదిక—“అసమ్మతమైన” ప్రవర్తన (“బైస్టాండర్ ఎఫ్ఫెక్ట్” గురించి అదనపు ఆలోచనల తో) ©2009 మేరి రోవ్ MIT, లిండ విల్కొక్ష్ HMS, హొవార్డ్ గడ్లిన్ NIH, జోర్నల్ అఫ్ ది ఇంటర్నేషనల్ ఓంబడ్స్మాన్ అస్సోసియేషన్ 2(1), ఆన్ లైన్ Ombudsassociation.org
- ↑ మేరి రోవ్, "ఒప్షన్స్ అండ్ ఛాయస్ ఫర్ కాన్ఫ్లిక్ట్ రిజల్యుషన్ ఇన్ ది వర్క్ ప్లేస్" నెగోషియేషన్స్: స్ట్రాటజీస్ ఫర్ మ్యుచ్‌వల్ గైన్, by లావినియా హాల్ చే, ed., సేజ్ పబ్లికేషన్స్, Inc., 1993, పేజీలు 105–119.
- ↑ వాట్ ఈస్ ఏ టాక్ష్ ఇంఫోర్మంట్ అవార్డు?
- ↑ DOL.gov
- ↑ 2004 హెల్త్ కేర్ విజిల్ బ్లోయింగ్ మొనాష్ బయో ఎథిక్స్ రివ్యు యొక్క ఫాన్స్ TA అభివృధి మరియు బోధన the సద్గుణం-నీతిశాస్త్రం ముఖ్యఅంశాలు; 23(4): 41-55
- ↑ ఫాన్స్ TA మరియు జేఫ్ఫిరీస్ S. విజిల్ బ్లోయింగ్ అండ్ సైంటిఫిక్ మిస్కండక్ట్: రెన్యుయింగ్ లీగల్ అండ్ వర్త్యు ఎథిక్స్ ఫౌన్డేషన్స్ జోర్నల్ అఫ్ మెడిసిన్ అండ్ లా 2007, 26 (3): 567-84
- ↑ రోవ్, మారి & బెండర్స్కై, కోరిన్ని, "వర్క్ ప్లేస్ జస్టిస్, జీరో టోలరెన్స్ అండ్ జీరో బార్రియర్స్: గెట్టింగ్ పీపుల్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ మానేజ్మెంట్ సిస్టమ్స్," ఇన్ నెగోషియేషన్స్ అండ్ చేంజ్, ఫ్రొం ది వర్క్ ప్లేస్ టు సొసైటి, థోమస్ కోచన్ అండ్ రిచార్డ్ లోకే (ఎడిటర్స్), కోర్నెల్ యునివర్సిటి ప్రెస్, 2002 దీనిని కూడా చూడుము వ్యవహారం—లేక నివేదిక—“అసమ్మతమైన” ప్రవర్తన (“బైస్టాండర్ ఎఫ్ఫెక్ట్” గురించి అదనపు ఆలోచనల తో) ©2009 మేరి రోవ్ MIT, లిండ విల్కొక్ష్ HMS, హొవార్డ్ గడ్లిన్ NIH, జోర్నల్ అఫ్ ది ఇంటర్నేషనల్ ఓంబడ్స్మాన్ అస్సోసియేషన్ 2(1), ఆన్ లైన్ Ombudsassociation.org
- ↑ Peer.org
- ↑ కొంగ్రిష్ణల్ నివేదిక p. S7412; S. Rep. No. 107-146, 107th Cong., 2d సెస్సన్ 19 (2002).
- ↑ 31 U.S.C. § 3730(h)
- ↑ 5 U.S.C. § 1221(e)
- ↑ 10 U.S.C. § 1034
- ↑ గ్లోబల్ ఇంటిగ్రిటి రిపోర్ట్
- ↑ [[[:మూస:SCOTUS URL BoundVolume]] గర్సేట్టి v. సెబల్లోస్, 04-5, 547 US 410]
- ↑ హై కోర్ట్ ట్రిమస్ విజిల్‌బ్లోయర్ రైట్స్
- ↑ విజిల్‌బ్లోయర్ ప్రొటెక్షన్ ఎంహన్స్మెంట్ యాక్ట్ అఫ్ 2007 - కాంగ్రెస్ పీడియా
- ↑ టెక్ యాక్షన్ నౌ
- ↑ కాలిఫోర్నియా ఫాల్స్ క్లైమ్స్ యాక్ట్
- ↑ N.J.S.A. 34:19-3
- ↑ హౌస్ బిల్ 07-1133. కార్రోల్ M., లేవి, సోపెర్, కేఫలాస్, ప్రైమవేర, కార్రోల్ T., కెర్బో, ఫ్రాన్గాస్, గాగ్లియార్ది, కెర్ర్ A., లబుడ, మక్ కిన్లే, రీస్బెర్గ్, సోలానో, బ్యుస్చర్, కస్సో, ఫిస్చర్, గార్సియా, గ్రీన్, జాన్, లాంబెర్ట్, మడ్డెన్, మక్ గిహన్, పెనిస్టన్, రాబెర్ట్స్, రోమనోఫ్ఫ్, మరియు టోడ్ద్; ఇంకా సెనేటర్(S) హగేడర్న్, బోయ్ద్, ఫిత్జ్-జేరాల్ద్, మిత్చేల్ S., షఫ్ఫర్, టోచ్త్రోప్, టుప, మరియు విలియమ్స్ చే ప్రాతినిధ్యం వహించబడినది. State.co.us
మరింత చదవటానికి[మార్చు]
- IRS.gov, విజిల్‌బ్లోయర్ - ఇంఫోర్మంట్ అవార్డు
- గవర్నమెంట్ ఓవర్ సైట్ పై ప్రాజెక్ట్, హొంల్యాండ్ అండ్ నేషనల్ సెక్యురిటి విజిల్‌బ్లోయర్ ప్రొటెక్షన్స్: ది అన్ ఫినిష్డ్ అజెండా , ఏప్రిల్, 2006.
- గవర్నమెంట్ ఓవర్ సైట్ పై ప్రాజెక్ట్, ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ అండ్ గవర్నమెంట్ అకౌంటబిలిటీ ప్రాజెక్ట్ కోసం ప్రజా ఉద్యోగులు, ఆర్ట్ అఫ్ అనానిమస్ ఆక్టివిజం: సర్వింగ్ ది పబ్లిక్ వైల్ సర్వైవింగ్ పబ్లిక్ సర్వీస్ "ఒకటవ అధ్యాయం", 2002. పూర్తీ పుస్తకాన్ని ఆర్డర్ చెయ్యటానికి, go here.
- గవర్నమెంట్ ఓవర్ సైట్ పై ప్రాజెక్ట్, ప్రత్యేక సలహాదారు కార్యాలయం గురించి పత్రాలు.
- క్వెంటిన్ డెంప్‌స్టర్, విజిల్బ్లోయర్స్్, సిడ్నీ, ABC బుక్స్, 1997. ISBN 0-7333-0504-0 [ముఖ్యముగా చూడుము పేజీలు. 199–212: 'విజిల్బ్లోయర్స్్ యొక్క ధైర్యం']
- ఫ్రిస్, ఎ విజిల్‌బ్లోయింగ్ హీరోస్ — బూన్ ఆర్ బర్డెన్? మెడికల్ ఎథిక్స్ యొక్క వార్తకథనం, 2001 ఆగస్టు: (170):13-19.
- Alford, C. Fred (2001). Whistleblowers: Broken Lives and Organizational Power. Cornell University Press. ISBN 0-8014-3841-1.
- గర్రెట్ట్, అల్లిసన్, "ఆడిటర్ విజిల్‌బ్లోయింగ్: ది ఫైనాన్షియల్ ఫ్రాడ్ డిటెక్షన్ అండ్ డిస్క్లోజర్ యాక్ట్," 17 సెటన్ హాల్ లెగిస్. J. 91 (1993).
- Hunt, Geoffrey (20061). The Principle of Complementarity: Freedom of Information, Public Accountability and Whistleblowing in Chapman, R & Hunt, M (eds) Freedom of Information: Perspectives on Open Government in a Theoretical and Practical Context. Ashgate, Aldershot, UK. Check date values in:
|year=
(help) - Hesch, Joel (2009). Whistleblowing: A guide to government reward programs. Goshen Press. ISBN 978-0977260201.
- Hunt, Geoffrey (2000). Whistleblowing, Accountability & Ethical Accounting, in. Clinical Risk 6(3): 115-16.
- Hunt, Geoffrey (1998). 'Whistleblowing', commissioned entry for Encyclopedia of Applied Ethics, (8,000 words). Academic Press, California, USA,.CS1 maint: extra punctuation (link)
- Hunt, Geoffrey (ed) (1998). Whistleblowing in the Social Services: Public Accountability & Professional Practice. Arnold.CS1 maint: extra text: authors list (link)
- Hunt, G (ed) (1995). Whistleblowing in the Health Service: Accountability, Law & Professional Practice. Arnold.CS1 maint: extra text: authors list (link)
- Johnson, Roberta Ann (2002). Whistleblowing: When It Works—And Why. L. Reinner Publishers. ISBN 978-1588261144.
- Kohn, Stephen M (2000). Concepts and Procedures in Whistleblower Law. Quorum Books. ISBN 1-56720-354-X.
- Kohn, Stephen M; Kohn, Michael D; Colapinto, David K. (2004). Whistleblower Law A Guide to Legal Protections for Corporate Employees. Praeger Publishers. ISBN 0-275-98127-4.CS1 maint: multiple names: authors list (link)
- లారెటానో, మజర్ డానియల్ A., "ది మిలిటరీ విజిల్‌బ్లోయర్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ ది మిలిటరీ మెంటల్ హెల్త్ ప్రొటెక్షన్ యాక్ట్", ఆర్మీ లా, (అక్టోబరు) 1998.
- Miethe, Terance D (1991). Whistleblowing at work : tough choices in exposing fraud, waste, and abuse on the job. Westview Press. ISBN 0-81—33-3549-3.
- "సర్బనేస్-ఓక్ష్లెయ్ క్రిమినల్ విజిల్‌బ్లోయర్ ప్రొవిషన్స్ & ది వర్క్ ప్లేస్: మోర్ దాన్ జస్ట్ సెక్యురిటీస్ ఫ్రాడ్," జే P. లేచ్నర్ & పాల్ M. సిస్కో చే, 80 ఫ్లోరిడా B. J. 85 (జూన్ 2006)
- రోవ్, మారి & బెండర్స్కై, కోరిన్ని, "వర్క్ ప్లేస్ జస్టిస్, జీరో టోలరెన్స్ అండ్ జీరో బార్రియర్స్: గెట్టింగ్ పీపుల్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్," ఇన్ నెగోషియేషన్స్ అండ్ చేంజ్, ఫ్రం ది వర్క్ ప్లేస్ టు సొసైటి, థోమస్ కోచన్ అండ్ రిచార్డ్ లోకే (ఎడిటర్స్), కోర్నెల్ యునివర్సిటి ప్రెస్, 2002
బాహ్య లింకులు[మార్చు]
![]() |
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో విజిల్బ్లోయర్చూడండి. |
![]() | This article's use of external links may not follow Wikipedia's policies or guidelines. (August 2010) (ఈ మూసను ఎప్పుడు తీసెయ్యవచ్చో తెలుసుకోండి) |
![]() |
Wikimedia Commons has media related to Category:Whistleblower. |
- అడ్వైస్ టు విజిల్‌బ్లోయర్స్ వాస్తవానికి విజిల్‌బ్లోయర్స్ ఏం తెలుసుకోవాలి.
- గ్లోబల్ ఇంటిగ్రిటి రిపోర్ట్ ప్రపంచవ్యాప్తంగా విజిల్‌బ్లోయర్ యొక్క రక్షణార్ధం.
- ది ఇంటిగ్రిటి లైన్ - UK చారిటి క్రైంస్టాపర్స్ యొక్క అద్వర్యంలో
- whistleblower.co.uk విజిల్‌బ్లోయర్స్ తమ కథలను వెల్లడించుటకు UK సైట్
- మోసానికి వ్యతిరేకంగా పన్ను చెల్లింపుదారులు
- తండ్రి మరియు తనయుడు విజిల్‌బ్లోయర్స్' వెబ్ సైట్ - విజిల్‌బ్లోయర్స్ కొరకు చిట్కాలు - ఉచిత ప్రజా సేవ
- పబ్లిక్ ఎంప్లాయీస్ ఫర్ ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ (PEER)
- గవర్నమెంట్ అకౌంటబిలిటి ప్రాజెక్ట్
- ప్రపంచ వ్యాప్తముగా విజిల్‌బ్లోయర్స్ - ఇంటర్నేషనల్ విజిల్‌బ్లోయింగ్ వార్తలు మరియు సమాచారారానికి సైట్
- ప్రాజెక్ట్ ఆన్ గవర్నమెంట్ ఓవర్ సైట్ (POGO)
- ది రాన్ రిడెన్అవర్ అవార్డ్స్
- నేషనల్ విజిల్‌బ్లోయర్ సెంటర్
- ది ట్రూత్-టెల్లింగ్ ప్రాజెక్ట్ - విజిల్బ్లోయర్స్చే తయారు చేయబడిన ప్రాజెక్ట్ డానియెల్ ఎల్స్‌బెర్గ్ మరియు కాథరీన్ గన్
- కెనడా లో విజిల్‌బ్లోయర్స్ కోసం FAIR: ఫెడరల్ అకౌంటబిలిటి ఇనిషియేటివ్ ఫర్ రిఫార్మ్
- పబ్లిక్ కన్సర్న్ ఎట్ వర్క్ - పబ్లిక్ డిస్క్లోషర్ లో UK ముఖ్యమైన అథారిటీ
- హర్ మజస్టీస్ స్టేషనరీ ఆఫీసు నుంచి పబ్లిక్ ఇంట్రెస్ట్ డిస్క్లోషర్ యాక్ట్ 1998
- ఎన్విరాన్మెంటల్ విజిల్‌బ్లోయర్స్ కై వర్క్ ప్లేస్ ఫెయిర్‌నెస్ FAQ
- కాంగ్రెషనల్ రీసర్చ్ సర్విస్ (CRS) రిపోర్ట్ "నేషనల్ సెక్యురిటి విజిల్‌బ్లోయర్స్"
- EU లో విజిల్‌బ్లోయర్స్
- ఇంటర్నేషనల్ ఫ్రీడం అఫ్ ఎక్స్ప్రెషన్ ఎక్స్చేంజ్
- నేషనల్ సెక్యురిటి విజిల్‌బ్లోయర్స్ కోయలిషన్ అనేక రకాల కథనాలకు మూలం
- ఫ్రీడం టు కేర్ UK మొదటి గ్రాస్స్రూట్స్ (1991)విజిల్‌బ్లోయర్స్ కు మద్దతిచ్చే సంస్థ.
- విజిల్‌బ్లోయర్-నేత్జ్వేర్క్ జర్మనీలో విజిల్‌బ్లోయర్ కు మద్దతిచ్చే సంస్థ.
- మూస:Tr icon Canaktan.org, విజిల్‌బ్లోయింగ్ సైట్
- U.S. డిపార్ట్మెంట్ అఫ్ లేబర్ విజిల్‌బ్లోయర్ ప్రోగ్రాం & ఇన్ఫర్మేషన్
- సోర్స్ వాచ్ లో US విజిల్‌బ్లోయర్స్ యొక్క జాబితా మరియు సమాచారం
- రీడ్ v. కెనడా (అటోర్ని జనరల్) విజిల్‌బ్లోయింగ్ డిఫెన్స్ గురించి కెనడియన్ లీగల్ ఫ్రేంవర్క్
- "ఆఫీస్ అఫ్ స్పెషల్ కౌన్సిల్స్ వార్ ఆన్ విజిల్‌బ్లోయర్స్", మదర్ జోన్స్, మే/జూన్ 2007.
- నెదర్లాండ్స్ లో విజిల్‌బ్లోయర్స్ యొక్క రాజకీయ పార్టి
- గ్రాంట్ తోర్న్టన్ IBR విజిల్‌బ్లోయింగ్ సర్వే
- నర్సేస్ టెస్ట్ కలోరాడో విజిల్-బ్లోయర్ లా. ప్రచురించబడినది: జూన్ 17, 2009 at 3:53 PM. UPI.com.
- ఆస్ట్రేలియా మరియు US లో లీగల్ ఫ్రేమ్వోర్క్ పై ABC రేడియో నేషనల్ డాక్యుమెంటరి
- అనాథ పేజీలు from అక్టోబరు 2016
- అన్ని అనాథ పేజీలు
- గూగుల్ అనువాద వ్యాసాలు
- All articles with unsourced statements
- Articles with unsourced statements from September 2007
- CS1 maint: extra punctuation
- CS1 maint: extra text: authors list
- CS1 maint: multiple names: authors list
- Wikipedia external links cleanup from August 2010
- Wikipedia spam cleanup from August 2010
- విజిల్‌బ్లోయర్స్
- భిన్నాభిప్రాయము
- రాజకీయ పదములు
- వ్యాపార నైతిక ప్రవృత్తులు
- ఎంప్లాయ్మెంట్ లా టెర్మ్స్
- ఉద్యోగం నిర్మూలించటానికి షరతులు
- యాంటి-కార్పోరేట్ యాక్టివిజం
- యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ లేబర్ లెజిస్లేషన్