విజేందర్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజేందర్ సింగ్
ఫెమినా మిస్ ఇండియా 2014 కార్యక్రమంలో విజేందర్ సింగ్
గణాంకాలు
జన్మ నామమువిజేందర్ సింగ్ బెనివాల్
ఇతర పేర్లుసింగ్
బరువు విభాగంసూపర్-మిడిల్ వెయిట్
ఎత్తు6 ft 0 in
Reach76 in
జాతీయతభారతీయుడు
జననము (1985-10-29) 1985 అక్టోబరు 29 (వయసు 38)
కలువాస్, హర్యానా, భారతదేశం
StanceOrthodox
బాక్సింగ్ రికార్డ్
పాల్గొన్న పోరాటాలు14
విజయాలు13
నాకౌట్ విజయాలు9
పరాజయాలు1
2006లో విజేందర్ సింగ్‌కు అర్జున అవార్డును అందజేస్తున్న అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్

విజేందర్ సింగ్ బెనివాల్ (జననం 1985 అక్టోబరు 29) ఒక భారతీయ ప్రొఫెషనల్ బాక్సర్, రాజకీయ నాయకుడు. ఆయన 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. దీంతో ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ బాక్సర్‌గా నిలిచాడు. అతను 2009 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, 2010 కామన్‌వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకాలు, అలాగే 2006, 2014 కామన్‌వెల్త్ గేమ్స్‌ మిడిల్ వెయిట్ విభాగంలో రజత పతకాలను గెలుచుకున్నాడు.[1]

2015 జూన్లో ప్రొఫెషనల్‌గా IOS స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా క్వీన్స్‌బెర్రీ ప్రమోషన్స్‌తో బహుళ-సంవత్సరాల ఒప్పందంపై విజేందర్ సింగ్ సంతకం చేశాడు.[2] MTV ఇండియా రియాలిటీ టీవీ షో రోడీస్ X2లో విజేందర్ సింగ్ న్యాయనిర్ణేతలలో ఒకరు.[3]

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

1985 అక్టోబరు 29న హర్యానాలోని భివానీకి చెందిన కలువస్ గ్రామంలో ఒక జాట్ కుటుంబంలో విజేందర్ సింగ్ జన్మించాడు.[4][5] అతని తండ్రి మహిపాల్ సింగ్ బెనివాల్, హర్యానా రోడ్‌వేస్‌లో బస్సు డ్రైవర్, అతని తల్లి గృహిణి. విజేందర్ సింగ్ కు ఒక అన్నయ్య మనోజ్.[6][7][8] విజేందర్ సింగ్ తన ప్రాథమిక పాఠశాల విద్యను కలువస్‌లో, మాధ్యమిక పాఠశాల విద్యను భివానీలో పూర్తి చేశాడు. భివానీలోని వైష్ కళాశాల నుండి బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నాడు.[9][10]

బాలీవుడ్[మార్చు]

2014 జూన్ 13న విడుదలైన ఫగ్లీ చిత్రంతో నటుడిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రాన్ని అక్షయ్ కుమార్, అశ్విని యార్డి యాజమాన్యంలోని గ్రేజింగ్ గోట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ చిత్రానికి సగటు సమీక్షలు వచ్చాయి.[11][12]

రాజకీయ జీవితం[మార్చు]

2019 భారత సార్వత్రిక ఎన్నికల ముందు భారత జాతీయ కాంగ్రెస్‌లో విజేందర్ సింగ్ చేరాడు. దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు.[13]

వ్యక్తిగతం[మార్చు]

2011 మే 17న ఢిల్లీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన అర్చన సింగ్‌ను విజేందర్ సింగ్ వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం ఢిల్లీలో సాధారణ వేడుకగా జరుగగా అతని స్వస్థలమైన భివానీలో రిసెప్షన్ ఏర్పాటు చేయబడింది. వారికి ఇద్దరు కుమారులు, అబీర్ సింగ్, అమ్రిక్ సింగ్ ఉన్నారు.[14][15][16]

గుర్తింపు[మార్చు]

భారతదేశ రెండవ అత్యున్నత క్రీడా పురస్కారం అయిన అర్జున అవార్డును 2006లో విజేందర్ సింగ్ అందుకున్నాడు. ఆయనకు 2009 జూలైలో భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు లభించింది. 2009లో పద్మశ్రీ అవార్డుకు సిఫార్సు చేయబడినప్పటికీ, తర్వాత తిరస్కరించబడింది. కానీ 2010 జనవరిలో అదే అవార్డు అందుకున్నాడు.[17]

మూలాలు[మార్చు]

 1. "Vijender Singh - BoxRec". boxrec.com. Retrieved 2019-11-21.
 2. "Olympic bronze-medallist boxer Vijender Singh turns professional, will miss Rio Olympics". The Times of India. Archived from the original on 1 July 2015.
 3. "Karan Kundra, Esha Deol, Vijender Singh to judge 'MTV Roadies X2' - TelevisionPost.com". Archived from the original on 14 February 2015. Retrieved 26 January 2015.
 4. "'Bhai jaat hu na andh bhakt nhi': Vijender Singh's KO punch to user who asked him to focus on boxing". The Free Press Journal. 7 January 2020. Archived from the original on 13 August 2020. Retrieved 28 August 2021. ... jaat hu ... [... I am Jat ...]
 5. "Vijender Singh to marry on Tuesday". Sify news. Archived from the original on 26 March 2014. Retrieved 3 March 2013.
 6. Bakshi, Akshuna (14 February 2009). "Vijender Singh: From Bhiwani to Beijing". View Magazine. Dynasty Communication. Archived from the original on 21 February 2010. Retrieved 30 September 2009. His struggle from the small town of Bhiwani to Beijing wasn't a cake walk. His father, a bus driver, did overtime to raise money for Vijender's training.Vijender himself had to go through the mill in order to sponsor his training at the Bhiwani Boxing Club run by national level boxer and coach Jagdish Singh. He worked sidewise and even tried his hand at modelling to support his coaching.
 7. "Indian boxer Vijender mobbed after historic medal". Agence France-Presse. 20 August 2008. Archived from the original on 19 September 2009. Retrieved 30 September 2009.
 8. Jayaram, Rahul (31 August 2008). "If I fight again I'll beat him for sure [...] I won't make the same mistakes again". The Telegraph (Kolkata). Archived from the original on 14 October 2008. Retrieved 8 November 2009.
 9. Bakshi, Akshuna (14 February 2009). "Vijender Singh: From Bhiwani to Beijing". View Magazine. Dynasty Communication. Archived from the original on 21 February 2010. Retrieved 30 September 2009.
 10. "Vijender Singh Birthday Special: The Ace Boxer's Story Is Truly Inspiring". Dailyhunt. Verse Innovation. Retrieved 6 February 2019. The boxer took his initial education in his village and then got his Bachelor's degree from Vaish College of Bhiwani. In the initial days, his elder brother Manoj decided to learn boxing, so Vijender decided to join boxing.
 11. "Olympic champion Vijender Singh to make his Bollywood debut with Akshay Kumar's Fugly". India Today. Archived from the original on 2 February 2014. Retrieved 19 January 2014.
 12. "Fugly". Bollywood Hungama. Archived from the original on 20 September 2014. Retrieved 19 January 2014.
 13. "Congress hope for boxer boost fails, Vijender Singh loses deposit". The Indian Express (in ఇంగ్లీష్). 2019-05-24. Retrieved 2021-08-19.
 14. "Vijender Singh shares photo with son Abir along with a cute little message". mid-day (in ఇంగ్లీష్). 2018-02-13. Retrieved 2019-11-22.
 15. "It's a boy! Boxer Vijender Singh becomes a dad for the second time". in.com (in ఇంగ్లీష్). Archived from the original on 2019-05-15. Retrieved 2019-11-22.
 16. "Vijender Singh blessed with a baby boy". Business Standard India. Press Trust of India. 2019-05-14. Retrieved 2019-11-22.
 17. Corresspondent, Special (26 January 2010). "Sehwag, Saina among Padma Shri awardees". The Telegraph. Ananda Publishers. Archived from the original on 4 June 2011. Retrieved 3 February 2010.