విజ్ఞాన సర్వస్వము

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జర్మన్ విజ్ఞాన సర్వస్వం పుస్తకాల దొంతరలు

విజ్ఞాన కోశము లేదా విజ్ఞాన సర్వస్వము (ఆంగ్లం: Encyclopedia) అనగా అన్ని విషయాల గురించి లేదా ఒక రంగానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఒక చోట చేర్చిన వ్రాతప్రతుల సముదాయం. ఇందులో సమాచారం వ్యాసాలుగా విభజిస్తారు. దీన్ని ఉపయోగించడానికి అనువుగా కొన్ని విభాగాలుగా వర్గీకరిస్తారు.

చరిత్ర[మార్చు]

ఇప్పుడు విజ్ఞాన సర్వస్వాలుగా భావిస్తున్న వన్నీ 18 వ శతాబ్దంలో నిఘంటువు ఆధారంగా రూపొందించబడ్డవే. చారిత్రకంగా నిఘంటువులు, విజ్ఞాన సర్వస్వాలు రెండూ విద్యాధికుల చేత వివిధ రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులచే రాయబడ్డవే. కానీ వాటి కూర్పు లో మాత్రం తేడాలున్నాయి. సాధారణంగా నిఘంటువులో అక్షర క్రమంలో అమర్చిన పదాలు, వాటి నిర్వచనాలు, పర్యాయ పదాలు ఉంటాయి. కానీ విజ్ఞాన సర్వస్వంలో ఒక పదం గురించిన పూర్తి సమాచారం కూడా ఉంటుంది. ఉదాహరణలు పద వ్యుత్పత్తి, దాని పూర్వాపరాలు మొదలైనవి.

లక్షణాలు[మార్చు]

విషయ పరిజ్ఞానం, పరిధి, వర్గీకరణ పద్ధతి, ఉత్పత్తి మొదలైనవి ఒక విజ్ఞాన సర్వస్వాన్ని ఏర్పరుస్తాయి.

  • ఇది అన్ని విషయాల గురించిన సమాచారం కలిగి ఉండవచ్చు. ఉదాహరణలు ఆంగ్లంలో ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా, జర్మన్ లో బ్రాక్‌హస్ (Brockhaus) మొదలైనవి. ఇవే కొన్ని జాతులకు, సంస్కృతులకు సంబంధించిన సమాచారం కూడా కలిగి ఉండవచ్చు.
  • ఇవి ఒక రంగంలో ఇప్పటిదాకా కుడగట్టుకుంటూ వచ్చిన ముఖ్యమైన, అవసరమైన సమాచారాన్ని మాత్రమే భద్రపరచవచ్చు.
  • వీటికి ఒక ప్రామాణిక పద్దతిలో విభజన, వర్గీకరణ కూడా అవసరం
  • ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో దీనికి సంబంధించిన సమాచార సేకరణ, నిరూపణ, సంక్షిప్తీకరణ మొదలైన ప్రక్రియల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.

తెలుగులో విజ్ఞాన సర్వస్వం[మార్చు]

ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం-సంపుటి 1(కాశీనాథుని నాగేశ్వరరావు పునఃముద్రణ)ముఖచిత్రం
ఆంధ్ర సర్వస్వం
విజ్ఞాన సర్వస్వం- సంపుటి 4 దర్శనములు-మతములు, శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయము వారి కొమర్రాజు వేంకట లక్ష్మణరావు తెలుగు విజ్ఞానసర్వస్వ కేంద్రం వారిచే ప్రకటింపబడినది.
  • తెలుగు భాషా సమితి విషయాల క్రమంలో విజ్ఞాన సర్వస్వం ముద్రించింది. ఆ తరువాత తెలుగు విశ్వవిద్యాలయము లో విజ్ఞానసర్వస్వ కేంద్రము వాటిని పరిష్కరించి మరల కొత్త వాటిని ముద్రించింది. [2]

అంతర్జాలంలో తెలుగు విజ్ఞాన వేదికలు[మార్చు]

తెలుగు వికీపీడియా మొదటి పేజి తెరపట్టు

తెలుగు వికీపీడియా అవతరించకముందు, ఆ తరువాత కొంతమంది ఔత్సాహికులు తెలుగు విజ్ఞాన వేదికలను ఏర్పాటు చేశారు. వాటి వివరాలు

  1. ఆంధ్రభారతి
  2. తెలుపు (తెలుగు పుస్తకాలు)
  3. తెలుగు సాహిత్యము గురించి ఇంగ్లీషు,RTS కోడుతో
  4. తెలుగు వరల్డ్ (ఇంగ్లీషులో)

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

విజ్ఞాన సర్వస్వము - తెలుగు సంస్కృతి