Jump to content

వితికా శేరు

వికీపీడియా నుండి
(వితిక షేరు నుండి దారిమార్పు చెందింది)
వితిక షేరు
మహుబాబ్ నగర్ లోని రెయిన్ బో కాన్సెప్ట్ స్కూల్ 9వ వార్షికోత్సవంలో పాల్గొన్న వితిక షేరు
జననంఫిబ్రవరి 3, 1993
ఇతర పేర్లువితిక రావు
కీర్తి
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2008–ప్రస్తుతం
భాగస్వామివరుణ్ సందేశ్
పిల్లలురుద్ర, మహేష్

వితిక షేరు దక్షిణ భారతదేశ చలనచిత్ర నటి. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించింది.

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

వితిక 1993, ఫిబ్రవరి 3న భీమవరంలో జన్మించింది. ముంబై, హైదరాబాదుల్లో స్కూల్ విద్యను పూర్తిచేసిన వితిక, హైదరాబాదులోని లోహిత ఇన్సిట్యూట్ ఆఫ్ డిజైన్ కళాశాల నుండి డిప్లొమా పట్టా అందుకుంది.[1]

వివాహం

[మార్చు]

సినీనటుడు వరుణ్ సందేశ్ తో 2016, ఆగస్టు 19న వితిక వివాహం జరిగింది.

సినిమారంగ ప్రస్థానం

[మార్చు]

వితిక 11 సంవత్సరాల వయస్సులో బాలనటిగా తన నటన జీవితాన్ని ప్రారంభించి, 15వ ఏట 2008లో అంతు ఇంతు ప్రీతి బంతు (తెలుగు సినిమా ఆడవారి మాటలకు అర్థాలే వేరులేలో కలర్స్ స్వాతి పాత్ర) కన్నడచిత్రంతో సినీరంగ ప్రవేశంచేసింది.[2] తన అత్తతో సినిమా షూటింగుకు వెళ్ళిన వితికను చూసిన దర్శకుడు కన్నడ సినిమాలో చిన్న పాత్రను ఇచ్చాడు.[1] ఆ తరువాత 2009లో ఉల్లాస ఉత్సాహ సినిమాలో నటించింది.[3]

తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించి 2008, 2009లలో ప్రేమించు రోజుల్లో,[4] ఛలో 123,[5] మై నేమ్ ఈజ్ అమృత[6] వంటి తక్కువ బడ్జెట్ తెలుగు చిత్రాలలో కీర్తి పేరుతో నటించింది. తరువాత ఝుమ్మందినాదం, భీమిలి కబడ్డీ జట్టు చిత్రాలలో సహాయనటిగా, ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో ప్రధానపాత్రలో నటించింది. ఈ చిత్రంలో కళాశాల విద్యార్థి పాత్రను పోషించింది.[7] కాస్ట్యూమ్ స్టైలింగ్ కూడా చేసింది.[8] 2014లో ఉయిర్ మోజి సినిమాతో తమిళ సినిమారంగంలోకి ప్రవేశించిన వితిక, ఈ చిత్రంలో అంధురాలైన అమ్మాయిగా నటించింది..[9] ఈ సినిమాలోని పాత్రకోసం బ్రెయిలీని నేర్చుకోవడమేకాకుండా, చాలారోజులు కళ్ళకు గంతలు కట్టుకొని సాధన చేసింది.[10]

2015లో మహేష్ ఉప్పుటూరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం పడ్డానండి ప్రేమలో మరి సినిమాలో ఆమె ప్రధానపాత్రలో నటించింది, ఈ చిత్రం కోసం తన స్వంత దుస్తులను తానే రూపొందించుకుంది.[11] తన రెండవ తమిళ చిత్రం మహాబలిపురంలో నటించింది.[1] విదార్థ్‌తో వేదిక్కై అనే తమిళ చిత్రంలో నటించింది.[12]

ఆర్కేస్ గ్రాండ్ మాల్, భార్గవి ఫ్యాషన్స్, భీమా జ్యువెలరీ, తస్యాహ్ వంటి బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది.

నటించిన చిత్రాలు

[మార్చు]
'సంవత్సరంచిత్రంపేరుపాత్రపేరుభాషఇతర వివరాలు
2008అంతు ఇంతు ప్రీతి బంతుకన్నడ
2009ఉల్లాస ఉత్సాహకన్నడ
2009ప్రేమించు రోజుల్లోతెలుగుకీర్తి
2010సందడితెలుగుకీర్తి
2010ఝుమ్మందినాదంతెలుగు
2010భీమిలి కబడ్డీ జట్టుతెలుగు
2013ప్రేమ ఇష్క్ కాదల్సరయుతెలుగు
2014ఉయిర్ మోజీప్రియతమిళం
2015పడ్డానండి ప్రేమలో మరిశ్రావణితెలుగు
2015మహాబలిపురంమహాలక్ష్మీతమిళం

టివీరంగం

[మార్చు]

బాలనటిగా టెలివిజన్ ధారావాహికల్లో నటించింది.[12] 2019లో టెలివిజన్ రియాలిటీ కార్యక్రమమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 పోటీలో పాల్గొన్నది.

సంవత్సరంకార్యక్రమంపాత్రఛానల్భాష Exitఇతర వివరాలు
2019బిగ్ బాస్ 3పోటిదారుడుస్టార్ మాతెలుగు టివి రియాలిటి కార్యక్రమం

మూలాలు

[మార్చు]
  1. 1 2 3 Gupta, Rinku (16 November 2013). "Playing the innocent girl next door". The New Indian Express. the original నుండి 13 ఏప్రిల్ 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 August 2019.
  2. "Beauty, talent essential for long career: Vithika Sheru (With Image)". Business Standard. 17 May 2013. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 August 2019.
  3. "Beauty, talent essential for long career: Vithika Sheru (With Image)". Sify.com. 17 May 2013. the original నుండి 29 ఆగస్టు 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 August 2019.
  4. "'Preminche Rojullo' second schedule complete - Telugu Movie News". Indiaglitz.com. 29 January 2008. the original నుండి 24 సెప్టెంబరు 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 August 2019.
  5. "Chalo 1..2..3..' is ready for censoring - Telugu Movie News". Indiaglitz.com. 23 April 2009. the original నుండి 24 సెప్టెంబరు 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 August 2019.
  6. "'My Name is Amrutha' ready for release". The New Indian Express. 10 October 2009. the original నుండి 13 ఏప్రిల్ 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 August 2019.
  7. sangeetha devi dundoo (8 December 2013). "Love, sex and dhoka". The Hindu. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 August 2019.
  8. "Vithika turns stylist for 'Prema Ishq Kaadhal' - IBNLive". Ibnlive.in.com. 21 May 2013. the original నుండి 18 మార్చి 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 August 2019.
  9. K. R. Manigandan (4 August 2012). "Confident strides". The Hindu. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 August 2019.
  10. "Vithika on a roll". Deccan Chronicle. 6 January 2014. the original నుండి 13 ఏప్రిల్ 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 August 2019.
  11. http://www.deccanchronicle.com/140915/entertainment-tollywood/article/offers-pouring-vithika-sheru
  12. 1 2 Ians (21 May 2013). "Vithika turns stylist for 'Prema Ishq Kaadhal'". Entertainment.in.msn.com. the original నుండి 13 ఏప్రిల్ 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 August 2019.

ఇతర లంకెలు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వితికా శేరు పేజీ