విత్తనోత్పత్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పొద్దుతిరుగుడుపువ్వు గింజలు భీజోత్పత్తిని ప్ర్రారంభించిన మూడు రోజుల తరువాత
అంకురోత్పత్తి పట్టిక మీద అంకురోత్పత్తి రేటు పరీక్ష

విత్తనాలు మొలకలగా వృద్ధి చెందడాన్ని విత్తనోత్పత్తి లేక బీజోత్పత్తి లేక అంకురోత్పత్తి అంటారు. విత్తనోత్పత్తిని ఆంగ్లంలో జెర్మినేషన్ (Germination) అంటారు. భూమి క్రింద విత్తనాలు క్రియాశీలకంగా మారి మొలకెత్తడం ప్రారంభమవుతుంది, భూమి పైన మొదటి ఆకులు కనిపించడంతో అంకురోత్పత్తి దశ ముగిసి మొలక దశలో అడుగు పెడుతుంది. ఒక విత్తన పిండానికి ఒకటి లేదా రెండు దళబీజాలు (విత్తన ఆకులు) తయారయి కేంద్ర అక్షంకు జోడించబడి ఉంటాయి. ఊర్ధ్వదళభాగం గ్రీవం దాని ఎగువ భాగంలో దాని మొన వద్ద ప్రథమాంకురమును కలిగి ఉంటుంది. అధోదళం గ్రీవం దాని దిగువ భాగంలో ప్రథమ మూలమును (విత్తనములో వేరు కాబోయే భాగము) కలిగి ఉంటుంది. తల్లి మొక్క నుండి విడిపోయిన తరువాత విత్తనాలు నిర్జలీకరణమయి నిద్రావస్థలోకి ప్రవేశిస్తాయి. ఈ నిద్రాణమైన కాలం తరువాత, ఆ విత్తనాలకు తగినంత నీరు, ఆక్సిజన్, వేడి, కొన్ని సందర్భాలలో వెలుగును అందిస్తే ఆ విత్తనాలలో అంకురోత్పత్తి ప్రారంభమవుతుంది. అంకురోత్పత్తి మొదటి దశలలో, విత్తనం నీటిని తీసుకుంటుంది, పిండం దాని ఆహార నిల్వలను ఉపయోగించడం ప్రారంభిస్తుంది, ప్రథమ మూలం ఉబ్బుతుంది, బీజకవచం బ్రద్ధలవుతుంది, క్రిందికి పెరుగుతుంది. అప్పుడు అంకురోత్పత్తి విత్తనం రకాన్ని బట్టి రెండు విధానాలలోని ఒక విధానంలో కొనసాగుతుంది. Epigeal (నేల ఉపరితల) అంకురోత్పత్తి లో, అధోదళం పొడిగించుకునేందుకు, ప్రథమాంకురం లాక్కొనేందుకు, దాని బీజదళం నేలపై రక్షింపబడుతుంది. hypogeal (నేల లోపల) అంకురోత్పత్తిలో, ఊర్ధ్వదళభాగం పొడిగించుకునేందుకు, ప్రథమాంకురం పైకి నెట్టేందుకు బీజదళం భూమి లోపల ఉంటుంది.

విత్తనం లేక బీజ కణము క్రమంగా పెరగడం ప్రారంభించడాన్ని బీజోత్పత్తి అంటారు. ఈ విధంగా విత్తనం లేక బీజ కణము నుండి మొక్క లేక శిలీంద్రం ఆవిర్భవిస్తుంది. సంవృతబీజవృంతం లేక వివృతబీజవృంతం నుండి అంకురం లేక నారుమొక్క అరంభమవడం భీజోత్పత్తికి ఉదాహరణ. అయినప్పటికి బీజకణోత్పత్తి నుండి ఒక బీజకణం పెరగడం ఉదాహరణకు హైఫా (దారపుకొమ్మ) నుండి బీజకణాలు పెరగడం కూడా బీజోత్పత్తి. చాలా సాధారణంగా జీవం ఉనికి లేక బీజం విశాలంగా విస్తరించేలా సాధించగలగడాన్ని సూచించడమే భీజోత్పత్తి.

చిత్రమాలిక

[మార్చు]


ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]