విద్యానగర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విద్యానగర్
పరిసరప్రాంతం
విద్యానగర్ రైల్వే స్టేషను
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
ప్రభుత్వం
 • నిర్వహణహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
పిన్ కోడ్
500044
వాహనాల నమోదు కోడ్టి.ఎస్
లోకసభ నియోజకవర్గంసికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
జాలస్థలిtelangana.gov.in

విద్యానగర్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇక్కడ విద్యానగర్ రైల్వే స్టేషను[1] మరియు దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రి ఉంది. ఇది వ్యాపారప్రాంతంగా పిలువబడుతుంది.

నివాస మరియు వ్యాపార ప్రాంతం[మార్చు]

ఉస్మానియా విశ్వవిద్యాలయం సమీపంలో ఉన్న ఈ విద్యానగర్ అనువైన నివాసప్రాంతంగా ఉంటూ, అనేక అపార్టుమెంటులను, ఇళ్ళను కలిగివుంది. ఎక్కువ సంఖ్యలో వ్యాపార సంస్థలు కూడా విద్యానగర్ లో ఉన్నాయి. ఇక్కడ దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రి, ఆంధ్ర మహిళా సభ, మహారాజా ఫంక్షన్ హాల్ తోపాటూ స్పెన్సర్స్, రిలయన్స్, బాటా, టైటాన్, ఎయిర్‌టెల్, వోడాఫోన్, రిలయన్స్ డిజిటల్ మరియు ఐడియా షోరూమ్స్ ఉన్నాయి.

విద్యాసంస్థలు[మార్చు]

విద్యానగర్ లో ఆంధ్ర మహిళా సభ, వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాణి రుద్రమదేవి డిగ్రీ కళాశాల, వివేకానంద ప్రభుత్వం డిగ్రీ కళాశాలలు...అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్, చైతన్య రెసిడెన్షియల్ స్కూల్, ది మదర్స్ ఇంటిగ్రల్ స్కూల్ వంటి పాఠశాలలతోపాటూ ఇతర కళాశాలలు, పాఠశాలలు మరియు కోచింగ్ సెంటర్లు ఉన్నాయి.[2]

రవాణా[మార్చు]

ఇక్కడ విద్యానగర్ రైల్వే స్టేషనుతో పాటు ఎం.ఎం.టి.ఎస్. కూడా ఉంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో 107 (దిల్‌సుఖ్‌నగర్ నుండి సికింద్రాబాద్), 113 (ఉప్పట్ నుండి మెహిదీపట్నం మరియు కుకట్ పల్లి), 3 (కోఠి నుండి తార్నాక, హబ్సిగూడ, నాచారం, మౌలాలి) బస్సులు నడుస్తున్నాయి.

మూలాలు[మార్చు]

  1. The Hindu, Telangana (8 March 2018). "Vidyanagar railway station joins all-women club". Retrieved 10 July 2018. Cite news requires |newspaper= (help)
  2. Colleges in Vidyanagar, Hyderabad