విద్యాసాగర్ రాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విద్యాసాగర్ రాజు
జననంకిడంబి విద్యాసాగర్ రాజు
(1949-09-20)1949 సెప్టెంబరు 20
మరణం2022 ఆగస్టు 28(2022-08-28) (వయసు 72)
హైదరాబాదు, తెలంగాణ
ప్రసిద్ధితెలుగు నాటకరంగ, సినిమా నటుడు, రచయిత
భార్య / భర్తరత్నాసాగర్
పిల్లలుఇద్దరు కుమార్తెలు

విద్యాసాగర్ రాజు, తెలుగు నాటకరంగ, సినిమా నటుడు, రచయిత. 1984లో వచ్చిన ఈ చదువులు మాకొద్దు సినిమాతో హీరోగా పరిచయమైన విద్యాసాగర్, దాదాపుగా 100 సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, కమెడియన్ గా నటించి మెప్పించాడు.[1]

జననం

[మార్చు]

విద్యాసాగర్ 1949, సెప్టెంబరు 20న జన్మించాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

విద్యాసాగర్ కు నటి రత్న సాగర్ తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[2]

నాటకరంగం

[మార్చు]

నాటకరంగంమీద ఆసక్తితో చిన్నతనం నుండే నాటకరంగంలో కృషిచేశాడు. కోహినూర్, ఢిల్లీ, ఫర్ సేల్ వంటి నాటకాల్లో నటించాడు. కొన్ని నాటకాలకు దర్శకత్వం కూడా వహించాడు.

సినిమారంగం

[మార్చు]

హీరోగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత పక్షవాతం రావడంతో ఒక కాలు ఒక చేయి పనిచేయలేదు. వీల్ చెయిర్ కు పరిమితమైన తరువాత కూడా పలు సినిమాల్లో నటించాడు.[3]

సినిమాలు

[మార్చు]

మరణం

[మార్చు]

విద్యాసాగర్ 2022, ఆగస్టు 28హైదరాబాదులోని తన నివాసంలో మరణించాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "టాలీవుడ్‌ సీనియర్‌ హీరో కన్నుమూత". Sakshi. 2022-08-28. Archived from the original on 2022-08-28. Retrieved 2022-08-28.
  2. "Vidhya Sagar: సీనియర్‌ నటుడు విద్యాసాగర్‌ ఇకలేరు!". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-08-28. Archived from the original on 2022-08-28. Retrieved 2022-08-28.
  3. "Tollywood: టాలీవుడ్‌లో మరో విషాదం... సీనియర్ హీరో మృతి..!". News18 Telugu. 2022-08-28. Archived from the original on 2022-08-28. Retrieved 2022-08-28.
  4. Velugu, V6 (2022-08-28). "నటుడు విద్యాసాగర్ రాజు ఇకలేరు". V6 Velugu. Archived from the original on 2022-08-28. Retrieved 2022-08-28.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)