విద్యాస్వరూపానంద స్వామి
విద్యాస్వరూపానంద స్వామి | |
|---|---|
![]() | |
| జననం | గోపాల్ 1932 (age 92–93) రేపల్లె |
| వృత్తి | ఆధ్యాత్మికవేత్త, బహుభాషాకోవిదుడు |
శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి ప్రస్తుత శుకబ్రహ్మాశ్రమ పీఠాధిపతి.
జీవిత విశేషాలు
[మార్చు]ఈయన 1932 సంవత్సరం అంగీరస చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జన్మించాడు. పూర్వాశ్రమంలో పేరు గోపాల్. 1943 జూలై నుంచి 1950 ఏప్రిల్ వరకు శ్రీవ్యాసాశ్రమంలో గురుకులవాసం చేశాడు. 1949లో శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి వద్ద మంత్ర దీక్ష స్వీకరించాడు. 1950 లో సంస్కృత ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. అదే సంవత్సరంలో శ్రీ శుకబ్రహ్మఆశ్రమములో బ్రహ్మచారిగా ప్రవేశించాడు. 1963 నుండి వేదాంత భేరి మాసపత్రిక సంపాదకత్వ బాధ్యతలు చేపట్టాడు.
కృష్ణానది తీరం (రేపల్లె సమీపం) లో ఉపనయనం - 1965 పరమార్థ నికేతన్ - ఋషికేశ్ - (హిమాలయాలలో) అధ్యయనం, తపోజీవనం ప్రారంభం -1965 నుంచి 1968 వరకు ప్రయాగ వారి హిందీ సాహిత్యరత్న ఉత్తీర్ణత 1967 తిరుపతి కేంద్రీయ సంస్కృత విద్యాపీఠములో వేదాంత శాస్త్ర పట్టభద్రత 1971 తిరుపతిలో శ్రీ మలయాళ సద్గురు సేవా సమాజ స్థాపన 1970 తిరుపతిలో సంస్కృత ప్రాథమికోన్నత విద్యాలయ స్థాపన 1973 'సద్గురువాణి' పత్రికా స్థాపక మరియు సంపాదకత్వం 1979 శ్రీ వ్యాసాశ్రమ మేనేజరుగా, విద్యాలయ కరెస్పాండెంటు గా 1974 నుంచి 1984 వరకు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం లో సంస్కృత M.A., ఉత్తీర్ణత -1990 సన్యాసాశ్రమ స్వీకారం (శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారి వద్ద) 1994 మే లో శ్రీ శుకబ్రహ్మఆశ్రమ ఉత్తరాధికారిగా నియామకం - 1996 ఏప్రిల్ 12వ తేది శ్రీ శుకబ్రహ్మఆశ్రమ పీఠ ఆధిపత్య స్వీకారం 1998 ఏప్రిల్ 12 వ తేది. శ్రీస్వాముల వారు వ్రాసిన పుస్తకాలు గూఢార్థ దీపిక, ఉపనిషత్కథలు, వేద సదస్సు, పతంజలి యోగ సుధాకరం.
