విధిరాత
Jump to navigation
Jump to search
విధిరాత అంటే విధాత(బ్రహ్మదేవుడు) రాసిన రాత. దీనినే తలరాత అని కూడా అంటారు. ప్రతి మనిషికీ భగవంతుడు కష్ట సుఖాలను ముందే నిర్ణయిస్తాడు అనేది ధార్మక మతాల సిద్ధాంతం. ధార్మిక మతాల ప్రకారం మనిషి చేసిన కర్మల పక్రారం ఆ కర్మ ఫలం అనుభవించి తీరాలి.
అబ్రహమిక్ మతాలలో కూడా విధిరాత మీద నమ్మకాలు ఉన్నాయి. రెండిటికీ స్వల్ప తేడా ఉంది. ధార్మిక మతాల ప్రకారం భగవంతుడు మనిషికి కష్టసుఖాలను నిర్ణయిస్తాడే తప్ప మనిషి చేసే మంచి లేదా చెడును నిర్ణయించడు[1]. అబ్రహమిక్ మతాల ప్రకారం మనిషి చేసే అన్ని పనులు భగవంతుడు నిర్ణయిస్తాడు.(బుఖారీ 23:83)
ఇస్లాం ప్రకారం విధిరాత
[మార్చు]- మాషా'అల్లాహ్ అంటే దైవనిర్ణయానుసారం (దేవుడు నిర్ణయించాడు) అని అర్థం. వీరి నమ్మకం ప్రకారం దైవ నిర్ణయానికి ఎవరూ అతీతులు కారు.
- "అన్నీ ముందుగానే అల్లాహ్ నిర్ణయిస్తాడు, ఆయన నిర్ణయం ప్రకారమే అన్నీ జరుగుతాయి" (ఖురాన్ : 14:4, 16:93 , 2:7 , 6:148 , 7:186. )
- అలాహ్ మనిషి అత్మను చేసి అందులోకి పాప పుణ్యాలు రెంటినీ ఊదుతాడు.(ఖురాన్ 91:8).
- శిశువు గర్భంలోఉన్నప్పుడే మగా ఆడా , మంచివాడౌతాడా చెడ్డవాడౌతాడా ,అతని పనులు,ఉపాధి,ఆయుషు వ్రాసినతరువాతే అల్లాహ్ ప్రాణం పోస్తాడు.కొంతమంది స్వర్గార్హత కొద్దిలో కోల్పో వచ్చు,నరకాన్ని కొద్దిలో తప్పించుకోనూ వచ్చు(బుఖారీ 59:6,ముస్లిం:1216)
- విధివ్రాత ప్రకారమే ఏ పనైనాజరుగుతుంది (ముస్లిం :1218)
- ప్రతి ఒక్కరి స్థానం స్వర్గం లేదా నరకంలో ముందుగానే వ్రాయబడిఉంది.అదృష్టవంతుడికి మంచిపనులు చేసే సద్బుద్ది కలుగుతుంది.దురదృష్టవంతుడికి చెడ్డపనులుచేసే దుర్బుద్ది పుడుతుంది.(బుఖారీ 23:83)
క్రైస్తవంలో విధిరాత
[మార్చు]- యెహోవా -తల్లి నిన్ను కనక ముందే ఆమెగర్భంలో ఉండగానే నీవేమౌతావో నాకు తెలుసు ,తమ్ముడు అన్న కంటే గొప్పవాడౌతాడు లాంటి ప్రవచనాలు పంపుతాడు .
- తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారిని ముందుగా నిర్ణయించెను.ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను.ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను.ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను (రోమా 8:28-30)
- మనలను ముందుగా తనకోసరము నిర్ణయించుకొని జగత్తు పునాది వేయబడకమునుపే ఆయన మనలను ఏర్పరచుకొనెను.దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయముచొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు (ఎఫెసీ 1:5,11)
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-08-11. Retrieved 2010-08-14.