Jump to content

వినయ్ కతియార్

వికీపీడియా నుండి
వినయ్ కతియార్

పదవీ కాలం
2006 ఏప్రిల్ 3 – 2018 ఏప్రిల్ 2
ముందు జనేశ్వర్ మిశ్రా
తరువాత కాంతా కర్దం
నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్

పదవీ కాలం
1999 అక్టోబర్ 10 – 2004 ఫిబ్రవరి 6
ముందు మిత్రసేన్ యాదవ్
తరువాత మిత్రసేన్ యాదవ్
నియోజకవర్గం ఫైజాబాద్
పదవీ కాలం
1991 జూన్ 20 – 1998 మార్చి 10
ముందు మిత్రసేన్ యాదవ్
తరువాత మిత్రసేన్ యాదవ్
నియోజకవర్గం ఫైజాబాద్

బజరంగ్ దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు
పదవీ కాలం
1984 – 1995
తరువాత జైభన్ సింగ్ పవయ్య

వ్యక్తిగత వివరాలు

జననం (1954-11-11) 1954 నవంబరు 11 (వయసు: 71)
కాన్పూర్ , ఉత్తర ప్రదేశ్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి రామ్ బేతి
పూర్వ విద్యార్థి విక్రమజిత్ సింగ్ సనాతన్ ధర్మ కళాశాల , కాన్పూర్ విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు

వినయ్ కతియార్ (జననం 11 నవంబర్ 1954) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లో‍క్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

వినయ్ కతియార్ భారతదేశంలో హిందూ జాతీయవాద సంస్థ విశ్వ హిందూ పరిషత్ యువజన విభాగం బజరంగ్ దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

వినయ్ కతియార్ సంఘ్ పరివార్ విద్యార్థి విభాగం అయిన అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి 1970 నుండి 1974 వరకు ఏబీవీపీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర విభాగానికి ఆర్గనైజింగ్ కార్యదర్శిగా, 1974లో జయప్రకాష్ నారాయణ్ బీహార్ ఉద్యమ కన్వీనర్‌గా, 1980లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్ )లో పూర్తికాల కార్యకర్తగా, 1982లో హిందూ జాగరణ్ మంచ్‌ను స్థాపించాడు. ఆయన 1984లో రామ జన్మభూమి ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి యువ సంస్థ బజరంగ్ దళ్‌ను ప్రారంభించాడు. కతియార్ 2002 నుండి 2004 జూలై 18 వరకు భారతీయ జనతా పార్టీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిగా, 2006 నుండి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేశాడు.

వినయ్ కతియార్ 1991, 1996 & 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఆ తరువాత 2012లో ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. ↑ "'Mandir movement the most glorious task I undertook': Bajrang Dal founder Vinay Katiyar" (in ఇంగ్లీష్). The Week. 7 January 2024. Archived from the original on 25 June 2025. Retrieved 25 June 2025.
  2. ↑ "Vinay Katiyar Wants To Retire From Politics" (in ఇంగ్లీష్). India TV News. 10 January 2010. Archived from the original on 25 June 2025. Retrieved 25 June 2025.