వినాయక్ దామోదర్ సావర్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వినాయక్ దామోదర్ సావర్కర్
సావర్కర్
సావర్కర్
జననం(1883-05-28)1883 మే 28
మరణం1966 ఫిబ్రవరి 26(1966-02-26) (వయసు 82)
బొంబాయి, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయతభారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
హిందూ
రాజకీయ పార్టీహిందు మహాసభ
జీవిత భాగస్వామి
యమునాబాయి
(m. 1901; died 1963)
[2]
బంధువులుగణేష్ దామోదర్ సావర్కర్ (సోదరుడు)
పూనే నగరంలో వీర సావర్కర్ విగ్రహం
సెల్యులార్ జైల్ ఆవరణలో వీర సావర్కర్ విగ్రహం

వినాయక్ దామోదర్ సావర్కర్ (మే 28, 1883 - ఫిబ్రవరి 26, 1966) భారత రాజకీయ నాయకుడు, కార్యకర్త, రచయిత. ఈయన 1922 లో రత్నగిరి కారాగారంలో ఉండగా హిందూత్వ అనే రాజకీయ హిందూ జాతీయవాదాన్ని అభివృద్ధి చేశాడు. హిందు మహాసభ ఏర్పాటులో ఈయన కీలక సభ్యుడు. తన ఆత్మకథ రాసినప్పటి నుంచి ఆయన పేరు ముందు వీర్ అనే పదాన్ని వాడటం ప్రారంభించాడు.[3] హిందూ మహాసభలో చేరిన తర్వాత హిందువులనందరినీ భారతీయత పేరు మీదుగా ఏకతాటిపైకి తెచ్చేందుకు హిందూత్వ[4] అనే పదాన్ని వాడాడు.[5][6] సావర్కర్ నాస్తికుడు.[7]

సావర్కర్ ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉండగానే తన రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించాడు. పుణె లోని ఫెర్గూసన్ కళాశాలలో కూడా వీటిని కొనసాగించాడు. ఇతను తన సోదరుడితో కలిసి రహస్యంగా అభినవ భారత్ సొసైటీ అనే సంస్థను స్థాపించాడు. తర్వాత తన న్యాయవిద్య కోసం యుకెకి వెళ్ళినపుడు అక్కడ ఇండియా హౌస్, ఫ్రీ ఇండియా సొసైటీ సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించాడు. విప్లవం ద్వారా భారతదేశం సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని పొందాలని పుస్తకాలు రాశాడు. 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామాన్ని గురించి ఈయన రాసిన ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పుస్తకాన్ని బ్రిటిష్ వారు నిషేధించారు.[8]

1910 లో విప్లవ సంస్థ ఇండియా హౌస్ తో సంబంధాలు కలిగి ఉన్నందున ఈయనను అరెస్ట్ చేసి భారత్ కు తరలించారు. భారత్ కు వచ్చే దారిలో ఫ్రాన్స్ లో తాను ప్రయాణించే ఓడ ఎస్ ఎస్ మర్సీలెస్ నుంచి నీళ్ళలో దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఫ్రెంచి ఓడరేవు అధికారులు అతన్ని తిరిగి బ్రిటిష్ అధికారులకు అప్పగించారు. భారత్ కు రాగానే సావర్కర్ కు 50 ఏళ్ళ జైలు శిక్ష విధించిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను అండమాన్ దీవుల్లోకి సెల్యులార్ జైలుకు తరలించారు. తర్వాత ఆయన బ్రిటిష్ అధికారులకు ఎన్నో క్షమాపణ లేఖలు రాసిన తర్వాత 1924 లో ఆయన్ను విడుదల చేశారు.[9] జైలు నుంచి విడుదలైన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించడం దాదాపు మానివేశాడు.[10]

1937 తర్వాత ఆయన విస్తృతంగా పర్యటించడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే వక్తగా, రచయితగా మారి హిందూ జాతీయవాదాన్ని, సమాజంలో ఏకత్వాన్ని సమర్ధించాడు. 1938 లో మరాఠీ సాహిత్య సమ్మేళన్ కు అధ్యక్షుడిగా ఉన్నాడు. హిందు మహాసభకు అధ్యక్షుడిగా భారతదేశాన్ని ఒక హిందూ రాష్ట్రమనే భావనను ఆమోదించాడు. ముస్లింలు ప్రత్యేక పాకిస్థాన్ ఏర్పాటు అనే కల నుంచి బయటపడితే సిక్కులతో కలిసి సిక్కిస్థాన్ ఏర్పాటు చేయవచ్చని సిక్కులకు భరోసా ఇచ్చాడు. సావర్కర్ హిందూ రాజ్యం గురించే కాకుండా పంజాబ్ లో సిక్కుల కోసం సిక్కిస్థాన్ ఏర్పాటు గురించి కూడా ఆలోచించాడు.[11][12][13]

అయితే 1939 సంవత్సరంలో ముస్లిం లీగ్, కాంగ్రెస్ నుంచి వేరు పడటం, సావర్కర్ ను కాంగ్రెస్ తనలో కలుపుకోకపోవడం వలన ముస్లిం లీగ్ తో అనుబంధం ఏర్పరుచుకున్నాడు. అంతే కాకుండా రెండు దేశాలుగా ఏర్పడటాన్ని సమర్ధించాడు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించి దాన్ని అధికారికంగా బహిష్కరించాడు.[14] స్టిక్ టు యువర్ పోస్ట్స్ అనే ఒక లేఖ కూడా రాసి, రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైన్యంలో చేరాడు.[15] 1948 లో సావర్కర్ ను మహాత్మా గాంధీ హత్యలో సహ కుట్రదారుగా చేర్చారు. అయితే ఆధారాలు లేకపోవడంతో కోర్టు అతన్ని విడుదల చేసింది.

జీవితం, వృత్తి[మార్చు]

బాల్యం[మార్చు]

ఈయన మే 28, 1883 న మహారాష్ట్ర, నాసిక్ నగరం సమీపంలోని భగూర్ గ్రామంలో ఒక మరాఠీ చిత్పవన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి పేరు దామోదర్‌ సావర్కర్, తల్లి రాధాబాయి. ఈయనకు గణేష్, నారాయణ్ అనే ఇరువురు సోదరులు, మైనా అనే సోదరి ఉన్నారు. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. తన చిన్న తనములో వినాయక్ దామోదర్ సావర్కర్ అన్నయ్య గణేష్ (బాబారావు) ప్రభావంతో ఆయన కూడా ఒక విప్లవాత్మక యువకుడు అయ్యాడు. 12 సంవత్సరాల వయస్సులో తమ గ్రామంలో జరిగిన హిందూ ముస్లిం గొడవల తర్వాత తన మిత్ర బృందాన్ని కూడదీసుకుని మసీదు మీద దాడి చేసి "మసీదును మాకు ఇష్టం వచ్చినట్లు ధ్వంసం చేశాము" అని పేర్కొన్నాడు."[16][17] 1903 లో ఈయన అన్న గణేష్ సావర్కర్ తో కలిసి మిత్రా మేళా అనే రహస్య యువ బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఇది 1906 లో అభినవ్ భారత్ సొసైటీ గా మారింది.[18] బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదోసి హిందువుల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.[19]

విద్యార్థి నాయకుడు[మార్చు]

పుణెలోని ఫెర్గూసన్ కళాశాలలో చేరిన తర్వాత కూడా సావర్కర్ తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగించాడు. ర్యాడికల్ నేషనలిస్ట్ నాయకుడైన బాలగంగాధర్ తిలక్ నుంచి సావర్కర్ స్ఫూర్తి పొందాడు. ఆయన కూడా యువకుడైన సావర్కర్ చురుకుదనాన్ని కనిపెట్టి 1906 లో లండన్ లో న్యాయవిద్య చదవడం కోసం శివాజీ స్కాలర్షిప్ వచ్చేందుకు సహాయం చేశాడు.[20][21]

లండన్ లో చదువు[మార్చు]

సావర్కర్ లండన్ లోని గ్రేస్ ఇన్ లా కాలేజీలో చేరాడు. ఇండియా హౌస్, ఫ్రీ ఇండియా సొసైటీ లాంటి సంస్థ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించాడు. అక్కడ తన తోటి భారతీయ విద్యార్థులను ప్రేరేపించి, స్వేచ్ఛ కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి ఫ్రీ ఇండియా సొసైటీ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. 1857 తిరుగుబాటు తరహాలో, వీర్ సావర్కర్ స్వాతంత్య్రం సాధించడానికి గెరిల్లా యుద్ధం గురించి ఆలోచించాడు. "భారత స్వాతంత్య్ర యుద్ధ చరిత్ర" పేరుతో ఒక పుస్తకం రాశాడు. ఇది స్వేచ్ఛ కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి చాలా మంది భారతీయులను ప్రేరేపించింది. ఈ పుస్తకాన్ని బ్రిటిష్ వారు నిషేధించినప్పటికీ,[22] అనేక దేశాలలో ప్రజాదరణ పొందింది. వీర సావర్కర్ యువతను దేశభక్తులుగా తయారు చేసి సైన్యంగా చేసుకున్నాడు.

సావర్కర్ ఇటాలియన్ జాతీయ నాయకుడైన జసెప్పీ మజ్జిని జీవితం, అతని భావాలను చూసి స్ఫూర్తి పొందాడు. లండన్ లో ఉండగానే అతని జీవిత చరిత్రను మరాఠీలోకి అనువాదం చేశాడు.[23] మదన్‌లాల్ ధింగ్రా అనే సహవిద్యార్థి ఆలోచనలను ప్రభావితం చేశాడు. 1909 లో మదన్‌లాల్ కర్జన్ విల్లీ అనే బ్రిటిష్ భారత ఆర్మీ అధికారిని హత్య చేశాడు. అతను వాడిన తుపాకీ సావర్కర్ అతనికి సమకూర్చాడు అని జర్గన్స్‌మయర్ అనే ఆంగ్లేయుడు ఆరోపించాడు. ఇంకా మదన్‌లాల్ ధింగ్రా ఉరిశిక్షకు ముందు చివరి మాటలను కూడా సావర్కరే సరఫరా చేశాడని జర్గన్స్‌మయర్ అభిప్రాయపడ్డాడు. కర్జన్ విల్లీ హత్యకు కొద్ది రోజుల తర్వాత సావర్కర్ మొదటిసారిగా గాంధీని లండన్ లో కలుసుకున్నాడు. గాంధీ అక్కడ ఉన్నన్ని రోజులు వలస వాదులతో తీవ్రవాదం, గెరిల్లా యుద్ధంతో ఎదుర్కోవడం వ్యర్థమైన పని అని సావర్కర్, ఇంకా ఇతర జాతీయవాదులతో చర్చలు చేశాడు.[24]

అరెస్టు, భారతదేశానికి తరలింపు[మార్చు]

భారతదేశంలో వీర్ సావర్కర్ అన్నయ్య గణేష్ సావర్కర్ మింటో-మార్లే సంస్కరణలు అని పిలువబడే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 కి వ్యతిరేకంగా సాయుధ విప్లవాన్ని నిర్వహించాడు. ఆయనను బ్రిటిష్ ప్రభుత్వం అండమాన్ జైలులో నిర్బంధించింది.[25][26] అదే సమయంలో వినాయక్ సావర్కర్ కొంతమంది బ్రిటిష్ అధికారులను చంపి భారతదేశంలో ఆంగ్లేయుల ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నాడని ఆరోపణలు వచ్చాయి.[27] అరెస్టు నుండి తప్పించుకోవడానికి, వీర్ సావర్కర్ ప్యారిస్ కి వెళ్ళి అక్కడ భికాజీ కామా ఇంట్లో ఆశ్రయం పొందాడు.[28] కానీ తర్వాత స్నేహితులు సలహా పెడచెవిన పెట్టి మళ్ళీ లండన్ వెళ్ళాడు. అక్కడ మార్చి 13, 1910 న అతన్ని బ్రిటిష్ పోలీసులు అక్రమంగా ఆయుధాలు సమకూర్చడం, రాజద్రోహం, రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేయడం లాంటి వివిధ నేరాల కింద అరెస్టు చేశారు. అరెస్టు అయ్యేనాటికి ఆయన చేతిలో ఆయన స్వయంగా రచించిన, ప్రభుత్వం నిషేధించిన పుస్తకాలు ఉన్నాయి. అంతే కాకుండా ఆయన భారతదేశానికి 20 తుపాకులు దొంగరవాణా చేశాడనీ, అందులో ఒకటి వాడి అనంత్ లక్ష్మణ్ కానేర్ డిసెంబరు 1909 లో నాసిక్ జిల్లా కలెక్టరు ఎ. ఎం. టి జాక్సన్ ను హత్య చేశాడని ఆధారాలు సంపాదించింది.[27] కానీ ప్యారిస్ లో వీర్ సావర్కర్‌ను అరెస్టు చేయడానికి బ్రిటిష్ అధికారులు తగిన చట్టపరమైన చర్యలను ప్రారంభించకపోవడంతో ఫ్రెంచ్ ప్రభుత్వం మండి పడింది. బ్రిటిష్ అధికారులు, ఫ్రెంచ్ ప్రభుత్వం మధ్య వివాదాన్ని శాశ్వత న్యాయస్థానం 1911 లో ఒక తీర్పు ఇచ్చింది. వీర్ సావర్కర్‌ జాక్సన్ హత్య కేసులో నిందితుణ్ణి ప్రేరేపించాడని అతనికి 50 సంవత్సరాల జైలు శిక్ష వేసారు. వీర సావర్కర్ ను బొంబాయికి పంపి, 1911 జూలై 11 న అండమాన్, నికోబార్ ద్వీపానికి తీసుకువెళ్లారు. అక్కడ, కాలా పానీగా ప్రసిద్ధి చెందిన సెల్యులార్ జైలులో నిర్బంధించి తీవ్రంగా హింసించారు. ఆయన ఆస్తులు జప్తు చేశారు.[29][30] అయినా సావర్కర్ లో జాతీయ స్వేచ్ఛా స్ఫూర్తి కొనసాగింది. జైలులో తన తోటి ఖైదీలకు చదవడం, వ్రాయడం నేర్పడం ప్రారంభించాడు. జైలులో ప్రాథమిక గ్రంథాలయాన్ని ప్రారంభించడానికి ఆయన ప్రభుత్వం నుండి అనుమతి తీసుకున్నాడు.[31][32]

వీర సావర్కర్ ను నిర్బంధించిన సెల్యూలార్ జైలు
సెల్యూలర్ జైల్ (అండమాన్) ప్రవేశ ద్వారం

భారతదేశం స్వాతంత్య్రం సాధించబడుతుందని భావించి, సమాధిని సాధించాలనే కోరికను ప్రకటించాడు. అతను 1966 ఫిబ్రవరి 1 న నిరాహార దీక్షను ప్రారంభించాడు, 1966 ఫిబ్రవరి 26 న కన్నుమూశాడు [33] అండమాన్, నికోబార్ దీవుల ద్వీపసమూహం పోర్ట్ బ్లెయిర్‌లో ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలిగి ఉంది. దీనికి వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం (IXZ) అని పేరు పెట్టారు. పోర్ట్ బ్లెయిర్ అండమాన్, నికోబార్ దీవుల రాజధాని నగరం. భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంలో చురుకుగా పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ ( వినాయక్ దామోదర్ సావర్కర్ ) పేరు మీద ఈ విమానాశ్రయానికి పేరు పెట్టారు. ప్రసిద్ధ అండమాన్ సెల్యులార్ జైలులో ఏకాంత గదిలో పరిమితమైన రాజకీయ ఖైదీగా వీర్ సావర్కర్ 10 బాధాకరమైన సంవత్సరాలు గడిపాడు.[34]

కులవ్యవస్థ[మార్చు]

సావర్కర్ కుల వ్యవస్థను, అస్పృశ్యతను విమర్శించాడు. కుల వ్యవస్థ హిందూ సమాజాన్ని నిందించదగినదిగా ఉన్నదని సావర్కర్ గమనించాడు. కాలా పానీ జైలు శిక్ష నుండి తిరిగి వచ్చిన తరువాత, సావర్కర్ కులాంతర భోజనాన్ని నిర్వహించడం ప్రారంభించాడు.[35] 1930 సంవత్సరములో సావర్కర్ మొదటి పాన్-హిందూ గణేష్ చతుర్థిని ప్రారంభించాడు, ఈ ఉత్సవాలకు అస్పృశ్యులు అని పిలవబడే వారు అనువదించిన కీర్తనలతో ఉంటాయి. ఉన్నత కులాలకు చెందిన వారు ఈ భక్తి గీతాలను అందించిన వారికి పూలమాలలు వేస్తారని చెప్పారు. మహిళలు బహిరంగంగా ఉపన్యాసాలు ఇవ్వడం, కులాంతర భోజనాలు ఈ ఉత్సవాలలో ప్రత్యేక లక్షణాలు.[36] 1931లో రత్నగిరిలో పతిత్ పవన్ ఆలయం స్థాపించబడింది.[37] ఈ ఆలయం అన్ని కులాల నుండి ప్రాతినిధ్యం కలిగి ఉంది. వీటిలో మునుపటి అస్పృశ్యులకు చెందినవారు కూడా ఉన్నారు. 1933 మే 1న సావర్కర్ అన్ని కులాల హిందువుల కోసం ఒక హోటల్ ప్రారంభించాడు. మహార్ కులానికి చెందిన ఒక వ్యక్తి అక్కడ ఆహారాన్ని వడ్డిస్తారు.[38] వినాయక్ దామోదర్ సావర్కర్ ఆంగ్ల, హిందీ భాషలలో కొన్ని రచనలు చేసాడు.[38]

రచనలు[మార్చు]

ఆంగ్ల రచనలు[మార్చు]

 • హు ఈజ్ ఎ హిందు?
 • సమగ్ర సావర్కర్ వాఙ్మయ
 • ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857
 • మై ట్రాన్స్‌పోర్టేషన్ ఫర్ లైఫ్

హిందీ రచనలు[మార్చు]

 • ఆజనమ్ కారవాస్ అర్ధత్ అండమాన్ కా 'ప్రియ ప్రవాస్'
 • సావర్కర్ సమగ్ర సావర్కర్,
 • కాలా పానీ సావర్కర్,
 • మేరా అజేవాన్ కరావాస్ సావర్కర్,
 • 1857 కా స్వాతంత్ర్య సమర్ సావర్కర్,
 • మైజినీ చరిత్ర సావర్కర్

గమనికలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. https://www.britannica.com/biography/Vinayak-Damodar-Savarkar
 2. "Yamunabai Vinayak (Mai) Savarkar". Archived from the original on 2023-04-05. Retrieved 2023-10-19.
 3. Salam 2018, p. 32.
 4. "Hindutva is not the same as Hinduism said Savarkar". www.telegraphindia.com. Archived from the original on 20 April 2020. Retrieved 8 June 2020.
 5. Wolf 2010.
 6. Misra 1999, pp. 142–184.
 7. Nandy, Ashis (2 January 2014). "A disowned father of the nation in India: Vinayak Damodar Savarkar and the demonic and the seductive in Indian nationalism". Inter-Asia Cultural Studies. 15 (1): 91–112. doi:10.1080/14649373.2014.882087. ISSN 1464-9373. S2CID 144912079. Archived from the original on 16 April 2021. Retrieved 28 August 2020. Savarkar, a hardboiled atheist who did not believe in sacred geographies, was even less embarrassed to claim the whole of India for the Hindus on the ground of sacred geography
 8. Visana, Vikram (5 November 2020). "Savarkar before Hindutva: Sovereignty, Republicanism, and Populism in India, c.1900–1920". Modern Intellectual History (in ఇంగ్లీష్). 18 (4): 1106–1129. doi:10.1017/S1479244320000384. ISSN 1479-2443. S2CID 224983230. Archived from the original on 30 September 2021. Retrieved 25 July 2021.
 9. Jha, D.K. (2022). Gandhi's Assassin: The Making of Nathuram Godse and His Idea of India. Penguin Random House India Private Limited. p. 25. ISBN 978-93-5492-168-1. Retrieved 2022-11-18.
 10. Devare, A. (2013). History and the Making of a Modern Hindu Self. Taylor & Francis. p. 168. ISBN 978-1-136-19708-6.
 11. Savarkar, VD; Sadashiv, Bhide Anant (1941). Whirl-Wind Propaganda. pp. 340, 341.
 12. Bhide, A.S. (1825). "Whirl-wind Propaganda".
 13. Ahmad, Jamiluddin. Some Recent Speeches and Writings of Mr. Jinnah - Jamiluddin Ahmad. p. 252.
 14. Prabhu Bapu (2013). Hindu Mahasabha in Colonial North India, 1915–1930: Constructing Nation and History. Routledge. pp. 103–. ISBN 978-0-415-67165-1. Archived from the original on 3 January 2016. Retrieved 13 February 2016.
 15. McKean 1996, p. 72.
 16. Jyotirmaya Sharma 2011, p. 128.
 17. "Savarkar, Modi's mentor: The man who thought Gandhi a sissy". The Economist. 20 December 2014. Archived from the original on 6 February 2016. Retrieved 22 December 2014.
 18. Tejani, Shabnum (2021-01-05). Indian Secularism: A Social and Intellectual History, 1890-1950 (in ఇంగ్లీష్). Indiana University Press. ISBN 978-0-253-05832-4.
 19. Bapu, Prabhu (2013). Hindu Mahasabha in Colonial North India, 1915-1930: Constructing Nation and History (in ఇంగ్లీష్). Routledge. ISBN 978-0-415-67165-1.
 20. Jaffrelot 2017, pp. 127–182.
 21. Kumar, M. (2006). History and Gender in Savarkar's Nationalist Writings. Social Scientist, 34(11/12), 33–50. http://www.jstor.org/stable/27644182
 22. Visana, Vikram (5 November 2020). "Savarkar before Hindutva: Sovereignty, Republicanism, and Populism in India, c. 1900–1920". Modern Intellectual History (in ఇంగ్లీష్). 18 (4): 1106–1129. doi:10.1017/S1479244320000384. ISSN 1479-2443. S2CID 224983230. Archived from the original on 30 September 2021. Retrieved 25 July 2021.
 23. Kumar, M. (2006). History and Gender in Savarkar's Nationalist Writings. Social Scientist, 34(11/12), pp 33–50.
 24. Juergensmeyer, Mark. "Gandhi vs. Terrorism." Daedalus, vol. 136, no. 1, 2007, pp. 30–39. JSTOR, http://www.jstor.org/stable/20028087. Accessed 17 Aug. 2022.
 25. Babli Sinha 2014, p. 129.
 26. Pandey, B. N. (1979). The Indian nationalist movement, 1885-1947: select documents. (No Title).|pages-=23-24[1] Archived 18 అక్టోబరు 2023 at the Wayback Machine
 27. 27.0 27.1 Chaturvedi 2022, p. 114.
 28. Trehan 1991, p. 23.
 29. "सावररांनी..." BBC News मराठी. Archived from the original on 30 January 2024. Retrieved 6 September 2023.
 30. "Nasik Conspiracy Case 1910". Bombay High court. Archived from the original on 9 April 2009. Retrieved 6 September 2023.
 31. "Who was Veer Savarkar and how he contributed in National Freedom Struggle Movement?". Jagranjosh.com. 2020-02-24. Retrieved 2020-09-28.
 32. "Vinayak Damodar Savarkar | Biography, History, & Books". Encyclopedia Britannica. Retrieved 2020-09-28.
 33. "10 Interesting facts about VD Savarkar". Deccan Herald. 2019-10-19. Retrieved 2020-09-28.
 34. admin. "Veer Savarkar International Airport | Airport in Andaman Island". Andaman Tourism. Retrieved 2020-09-28.
 35. DHANANJAY, KEER, (1966). VEER SAVARKAR ED.2ND. BOMBAY: POPULAR PRAKASHAN, BOMBAY.{{cite book}}: CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: authors list (link)
 36. "Veer[[Category:All articles with dead external links]][[Category:Articles with permanently dead external links]][[[Wikipedia:Link rot|permanent dead link]]] Savarkar crusade against caste discrimination remains under-appreciated". {{cite web}}: URL–wikilink conflict (help)
 37. "Veer Savarkar's crusade against caste discrimination remains under-appreciated". The Indian Express. 2019-05-29. Retrieved 2021-09-26.
 38. 38.0 38.1 https://indianexpress.com/article/opinion/columns/vinayak-damodar-savarkar-the-reformer-5753369/

వెలుపలి లంకెలు[మార్చు]