వినాళ గ్రంధులు
Jump to navigation
Jump to search

ముఖ్యమైన వినాళ గ్రంధులు. (ఎడమవైపు పురుషుడు, కుడివైపు స్త్రీ.) 1. Pineal gland 2. పియూష గ్రంధి 3. థైరాయిడ్ గ్రంధి 4. Thymus 5. అధివృక్క గ్రంధి 6. క్లోమము 7. అండాశయము 8. వృషణాలు
వినాళ గ్రంధులు లేదా నాళరహిత గ్రంధులు లేదా అంతఃస్రావక గ్రంధులు ఒక ప్రత్యేకమైన గ్రంధులు . పేరు తెలియజేసినట్లుగానే వీటికి నాళాలు (Ducts) గాని, రంధ్రాలు (Openings) గాని ఉండవు. ఇవి స్రవించే స్రావాలు (Secretions) సూటిగా వానికి సరఫరా చేయబడిన రక్తం లోనికి కలపబడతాయి. ఈ గ్రంధులచేత స్రవించబడిన రసాయనాలను హార్మోన్లు (Hormones) అంటారు. ఇవి శరీరంలోని అన్నిభాగాలకు రక్తం ద్వారా పంపబడతాయి. శరీరంలో సరియైన భాగానికి అవి చేరగానే, ప్రత్యేక ఫలితాలను కలుగజేస్తాయి. పెరుగుదల రేటు, లింగ పరిపక్వత వంటి మార్పులన్నీ హార్మోనుల అదుపులో ఉంటాయి. కాలేయం ద్వారా పోయినపుడు హార్మోనులు క్రియాశీలం కాని సమ్మేళనాలుగా మారుతాయి. తరువాత అవి మూత్రపిండాల ద్వారా విసర్జింపబడతాయి.
ముఖ్యమైన వినాళ గ్రంధులు[మార్చు]
- పియూష గ్రంధి (Pituitary gland)
- థైరాయిడ్ గ్రంధి (Thyroid gland)
- పారాథైరాయిడ్ గ్రంధి (Parathyroid gland)
- అధివృక్క గ్రంధి (Adrenal or Suprarenal gland)
- క్లోమము (Pancreas)
- అండకోశము (Ovary)
- వృషణాలు (Testis)
ఇతర వినాళ గ్రంధులు[మార్చు]
- హైపోథలామస్ (Hypothalamus)
- జీర్ణకోశము (Stomach)
- కాలేయము (Liver)