వినోద్ కుమార్ (క్రీడాకారుడు)

వికీపీడియా నుండి
(వినోద్‌ కుమార్ (క్రీడాకారుడు) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వినోద్‌ కుమార్
వ్యక్తిగత సమాచారం
జాతీయత భారతదేశం
జననం (1980-07-20) 1980 జూలై 20 (వయసు 43)
రోహతక్, హర్యానా,  భారతదేశం
క్రీడ
దేశం భారతదేశం
క్రీడఅథ్లెట్స్‌
వైకల్యం తరగతిF52 విభాగం
పోటీ(లు)డిస్కస్ త్రో

వినోద్‌ కుమార్ భారతదేశానికి చెందిన పారా అథ్లెట్స్‌ క్రీడాకారుడు. ఆయన 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో డిస్కస్ త్రో విభాగంలో కాంస్య పతకం గెలిచాడు.[1]

క్రీడా జీవితం[మార్చు]

వినోద్ బీఎస్‌ఎఫ్‌లో సైనికుడిగా చేరి లఢఖ్‌లోని లేహ్‌లో శిక్షణ పొందుతుండగా ప్రమాదవశాత్తు కొండ అంచు నుంచి కిందపడిపోవడంతో తీవ్రమైన గాయాలై, వెన్నెముకకు దెబ్బ తగలడంతో శరీర భాగాల్లో చలనం లేకుండా దాదాపు పదేండ్లకు పైగా పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. అంతటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొని మళ్లీ జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలతో డిస్కస్‌ థ్రోపై పట్టు సాధించాడు. ఆయన 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో డిస్కస్ త్రో విభాగంలో కాంస్య పతకం గెలిచాడు.

అయితే, వైకల్య వర్గీకరణ విషయంలో తోటి అథ్లెట్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వర్గీకరణ ప్రక్రియను సమీక్షించిన నిర్వాహకులు వినోద్‌ కుమార్‌ను అనర్హుడిగా తేల్చి పతకాన్ని రద్దు చేశారు.[2][3]

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (29 August 2021). "vinod Kumar : పారాలింపిక్స్‌లో డిస్కస్‌త్రోలో వినోద్‌కు కాంస్యం". Archived from the original on 31 ఆగస్టు 2021. Retrieved 31 August 2021.
  2. Andrajyothy (30 August 2021). "పారాలింపిక్స్‌లో చేతికి చిక్కిన పతకం కోల్పోయిన భారత్.. వినోద్ కుమార్ 'కాంస్యం' వెనక్కి". Archived from the original on 31 ఆగస్టు 2021. Retrieved 31 August 2021.
  3. V6 Velugu (30 August 2021). "బ్యాడ్‌ న్యూస్‌: మన అథ్లెట్ మెడల్ వెనక్కి" (in ఇంగ్లీష్). Archived from the original on 31 ఆగస్టు 2021. Retrieved 31 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)