Jump to content

విన్సెంట్ వాన్ గోహ్

వికీపీడియా నుండి

విన్సెంట్ విల్లెం వాన్ గోహ్(వాన్ హాక్ ) (ఆంగ్లం: Vincent van Gogh, Dutch: [ˈvɪnsənt ˈʋɪləm vɑŋ ˈɣɔx]) (30 మార్చి 1853 – 29 జూలై 1890) ఒక డచ్ పోస్ట్-ఇంప్రెషనిస్ట్ చిత్రకారుడు, మరణానంతరం పాశ్చాత్య కళా చరిత్రలో అత్యంత ప్రసిద్ధ ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకడు అయ్యాడు. ఒక దశాబ్దంలో, అతను దాదాపు 860 ఆయిల్ పెయింటింగ్స్‌తో సహా దాదాపు 2,100 కళాకృతులను సృష్టించాడు, వీటిలో చాలా వరకు అతని జీవితంలోని చివరి రెండు సంవత్సరాలకు చెందినవి.ఇతను ముప్పై సంవత్సరాల వయసులో మరణించాడు.[1]

విన్సెంట్ ఎంత గొప్ప కళాకారుడో అప్పట్లో ప్రపంచానికే కాదు, విన్సెంట్ కు సైతం తెలియకపోవటం ఆశ్చర్యకరం. [2] పలు మానసిక ఆందోళనలతో బాధపడుతోన్నను, విన్సెంట్ అనేక కళాఖండాలను సృష్టించాడు.

పుట్టు పూర్వోత్తరాలు

[మార్చు]

విన్సెంట్ 1854 లో నెదర్లాండ్స్ లోని గ్రూట్-జుండర్ట్ అనే ప్రదేశంలో థియోడరస్ వాన్ గోఘ్ - అన్నా కోర్నిలియా కార్బెంటస్ లకు జన్మించాడు. [2] ఏడాది ముందు మృత శిశువుగా జన్మించిన తన సోదరుడి పేరు అయిన విన్సెంట్ వాన్ గోఘ్ పేరే తనకు కూడా పెట్టటం, తొలి విన్సెంట్ ఎలా మరణించాడో ఆ తల్లి నిర్భయంగా వివరించటం, తన అన్న సమాధి పై తన పేరును చూడటం చిన్నప్పటి విన్సెంట్ కు పరిపాటి అయిపోయింది.

బాల్యం

[మార్చు]

విన్సెంట్ తండ్రి తాత, చర్చి మినిస్టర్ లు కావటంతో ఆ ఇంట్లో క్రమశిక్షణ ఉండేది.[2] తల్లి అన్నా ఔత్సాహిక చిత్రకారిణి కావటంతో విన్సెంట్ ను, అతని తోబుట్టువులతో బాటు గోధుమ పొలాల్లోకి తీసుకెళ్ళి వారిని చిత్రలేఖనం చేయమనేది. ఈ చిత్రలేఖనాలను విన్సెంట్ చాలా ఆసక్తిగా చేసేవాడు. కానీ పేదరికం వలన విన్సెంట్ చదువు ఎక్కువ కాలం సాగలేదు. తన తల్లిదండ్రులు విన్సెంట్ ను సాధ్యమైనంత త్వరలో పనిలో పెట్టదలచుకొన్నారు. అదృష్టవశాత్తూ వారి బంధువు ఒకరు కళా వర్తకుడు (Art Dealer) కావటం తో విన్సెంట్ ను అతని వద్ద చేర్చారు. కళాఖండాలను ఐరోపా మొత్తం లో అమ్మదలచుకొన్న విన్సెంట్ ఫ్రెంచి భాష, జర్మన్ భాష, ఆంగ్ల భాష లో పట్టు సాధించాడు. సోదరుడు థియో కూడా విన్సెంట్ వలే కళా వర్తకుడు కావటంతో అనేక ప్రదర్శనశాలలో వీరిరువురికీ పలు కళాకారుల గురించి, కళాఖండాల గురించి చక్కని అవగాహన ఏర్పడింది.

యౌవనం

[మార్చు]

20వ ఏట లండన్ లో సారా అనే విధవ నడుపుతోన్న బోర్డింగ్ హౌస్ లో విన్సెంట్ చేరాడు. సారా కుమార్తెకు 19 ఏళ్ళు. విన్సెంట్ సారా కుమార్తెను ప్రేమించాడు. అయితే సారా కుమార్తె అప్పటికే వేరొకతనితో నిశ్చితార్థం అవ్వటంతో విన్సెంట్ హతాశుడయ్యాడు. తనను బాగా చూస్కొంటానని, నిశ్చితార్థాన్ని రద్దు చేసుకొని తనను పెళ్ళి చేసుకొమ్మని విన్సెంట్ సారా కుమార్తె పై పదే పదే వత్తిడి తేవటంతో అతడిని బోర్డింగ్ హౌస్ నుండి వెలి వేశారు. కొందరు చరిత్రకారుల ప్రకారం ఈ వ్యవహారం మొత్తం సారా కుమార్తె తో కాదు, స్వాయానా సారా తోనే జరిగింది అని అభిప్రాయపడుతున్నారు.[2]

ఆధ్యాత్మికం

[మార్చు]

అప్పటి నుండి విన్సెంట్ ప్రతి రోజు బైబిల్ చదవటం ప్రారంభించాడు.[2] బైబిల్ ను అనుసరిస్తూ ఏయే కళాఖండాలు కొనుగోలు చేయకూడదో కళాప్రేమికులకు వివరించేవాడు. ఇది తెలుసుకొన్న యాజమాన్యం అతణ్ణి ఉద్యోగం నుండి తొలగించింది. క్రైస్తవ మతం లో తాను ఏ వర్గానికి చెందినవాడు అనేది విన్సెంట్ పెద్దగా పట్టించుకోలేదు. పేదవారికి బైబిల్ గురించి తెలియజేయాలన్న తపనతో కొన్ని చర్చిలలో మతబోధకుడిగా చేరటానికి ప్రయత్నించాడు. కానీ కావలసిన అర్హతలు లేకపోవటం వలన, పేదవాడు కావటం వలన తిరస్కరించబడ్డాడు. విన్సెంట్ పని లో ఉన్న అక్కడి రైతులను చిత్రీకరించేవాడు.

చిత్రకళ

[మార్చు]

తనకు అత్యంత ఇష్టమైన చిత్రకళలోనే కొనసాగాలని విన్సెంట్ నిర్ణయించుకొంటాడు.[2] సోదరుడు థియోకు ఇదే విషయాన్ని తెలుపుతూ లేఖ రాశాడు. అప్పటికీ కళావర్తకుడిగా కొనసాగుతోన్న థియో విన్సెంట్ నిర్ణయానికి హర్షిస్తాడు. చిత్రకళలో విన్సెంట్ పట్టు గురించి తెలిసిన థియో విన్సెంట్ యొక్క కనీసావసరాలకు నెలకు 50 ఫ్రాంక్ లు పంపటం మొదలు పెట్టాడు. తన చిత్రలేఖనాల విక్రయం లో వచ్చిన లాభాలను థియో ఉంచుకోవచ్చని విన్సెంట్ తెలిపాడు.

హేగ్

[మార్చు]

డచ్ కళా ఉద్యమం నడుస్తోన్న సమయం లో విన్సెంట్ హేగ్ కు బయలు దేరతాడు.[2] తాను వేసిన మొట్టమొదటి ఆయిల్ పెయింటింగ్ ను థియోకు పంపాడు. తాగుబోతు, సిఫిలిస్ తో బాధపడుతోన్న క్రిస్టీనా మరియా హార్నిక్ అనే వేశ్యతో విన్సెంట్ కు పరిచయం ఏర్పడింది. అప్పటికే ఒక పాప ఉన్న క్రిస్టీనా మరల గర్భవతి కావటంతో ఆమె వేశ్యావృత్తి కొనసాగించలేని పరిస్థితి. క్రిస్టీనాను ప్రేమిస్తున్నానని థియోకు తెలపటంతో థియో తాను పంపే స్టైపెండ్ ను రెట్టంపు చేశాడు. అయితే కొద్ది రోజులకే విన్సెంట్ కు సిఫిలిస్, గనోరియా సోకింది. భరించలేనంత నొప్పి రావటంతో విన్సెంట్ ఆస్పత్ర పాలయ్యాడు. కృతజ్ఞత లేని క్రిస్టీనా తిరివి వేశ్యావృత్తి చేపడుతుంది. ఇది తెలుసుకొన్న థియో విన్సెంట్ అతి మంచితనాన్ని మానుకోకపోతే తాను పంపే ధనాన్ని ఆపివేస్తానని తెలుపటంతో విన్సెంట్ పారిస్ బయలుదేరాడు.

పారిస్

[మార్చు]

తన 33వ ఏట (1885) పొటాటో ఈటర్స్ అనే చిత్రపటాన్ని విన్సెంట్ చిత్రీకరించాడు. [2] పంట చేలలో పనిచేసే నిరుపేద రైతుల భావోద్రేకాలను చిత్రీకరించబడటంతో ఈ నాటికీ ఇది విన్సెంట్ సృష్టించిన అత్యుత్తమ కళాఖండాలలో ఒకటి గా పరిగణించబడుతుంది. ఇది డచ్ శైలిని ప్రతిబింబించటం, కానీ పారిస్ లో అప్పుడు వేరే శైలులు జనాదరణ లో ఉండటం వలన ఇది అమ్ముడు పోలేదు. క్లౌడ్ మానెట్ చిత్రపటాలకు పారిస్ వాసులు బ్రహ్మరథం పడుతుండటంతో అటువంటివి చిత్రీకరించమని, వాటి నమూనాలను విన్సెంట్ కు పంపేవాడు థియో. విన్సెంట్ మానెట్ గురించి వినటమే కానీ అతడిని ఎప్పుడూ చూడలేదు. పారిస్ కు రాగానే థియో విన్సెంట్ ను తాను పని చేసే ఆర్ట్ మ్యూజియం కు తీసుకువెళ్ళి అక్కడి చిత్రపటాలను చూపించాడు. అందమైన ఇంప్రెషనిజం శైలి చిత్రకళను చూచి విన్సెంట్ మంత్రముగ్ధుడయ్యాడు. ఈ శైలి ఇంతటి జనాదరణ నోచుకోవటానికి కారణం అప్పటికీ గానీ విన్సెంట్ కు అర్థం కాలేదు. తాను కూడా తన శైలిని మార్చుకొన్నాడు. సోదరుడు థియో కూడా విన్సెంట్ కు ఇతర కళాకారులను పరిచయం చేశాడు. మాడళ్ళను నియామకం చేసుకోవటం ఖరీదైన వ్యవహారం కావటంతో ఒకరు చిత్రీకరించేటప్పుడు మరొకరు మాడల్ గా ఉండేవారు. చాలా మటుకు ఇంప్రెషనిస్ట్ చిత్రకారులు, వాతావరణం అందంగా ఉన్నప్పుడే చిత్రలేఖనం చేసేవారు. కాంతి సరిగా ఉండటం పై చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు. ఎక్కువ సంపాదించుకోవటానికి కళాప్రేమికులకు ఏం కావాలో అర్థం చేసుకొనేవారు. ప్రేరణ పొందటానికి పార్టీలు నిర్వహించుకొని సరైన సమయం కోసం వేచి చూసేవారు. విన్సెంట్ దీనికి పూర్తి భిన్నంగా ఉండేవాడు. కళలో తనని తాను మెరుగు పరుచుకోవటానికి ప్రతి రోజు చిత్రలేఖనం చేసేవాడు. కళ పట్ల తనకున్న అంకితభావం ఏ ఇతర కళాకారుడికి లేదన్న భావన విన్సెంట్ లో నాటుకు పోవటంతో ఇతర కళాకారులతో విన్సెంట్ కు వాగ్వాదాలు నడిచేవి. ఈ వాగ్వాదాలకు తరచు థియో క్షమాపణలు కోరవలసి వచ్చేది. అయితే విన్సెంట్ అంకితభావాన్నీ అర్థం చేసుకొన్న కళాకారులలో పాల్ గాగ్విన్ ఒకరు. గాగ్విన్ విన్సెంట్ ను ప్రోత్సహించటమే కాక, తనలోని అంత:స్సంఘర్షణ ను తగ్గించటానికి మద్యం తీసుకోవలసిందిగా సూచించాడు. మద్యపానంతో విన్సెంట్ లో భ్రమ, భ్రాంతులు పెరిగి అతని మానసికస్థితి మరింత కుంగిపోయింది. పాశ్చాత్య చిత్రలేఖనం లో పట్టు సాధించిన విన్సెంట్ జపాన్ దేశపు చిత్రలేఖనాన్ని అర్థం చేసుకోవటం ప్రారంభించాడు. జపనీస్ కళాకారలు అంతరాత్మలను అర్థం చేసుకొనే ఉద్దేశ్యం తో బౌద్ధరచనలను చదివాడు. ఫ్రెంచి గ్రామ ప్రదేశాలలోని చిత్రలేఖనం సైతం జపాన్ చిత్రలేఖనాన్ని పోలి ఉంటుంది అని ఒకానొక తోటి కళాకారుడు చెప్పటంతో ఆర్ల్స్ అనే అందమైన గ్రామానికి మకాం మార్చాడు. అది వరకటి కంటే విన్సెంట్ ఆర్ల్స్ లో నే ఎక్కువ కళాఖండాలు సృష్టించాడు.

ఆర్ల్స్

[మార్చు]

లస్ట్ ఫర్ లైఫ్, విన్సెంట్ వ్యాన్గో (వాన్ హాక్) (1853-1890)డచ్ చిత్ర కారుడి కళ, జీవితాన్ని నవలీకరించాడు ఇర్వింగ్ స్టోన్. కొందరు కళకోసమే జీవిస్తారేమో. పేదరికం, ప్రేమవైఫల్యాలు, అనారోగ్యం అన్నిటి మధ్యా నలిగిపోతూ విన్సెంట్ ఆచిన్న జీవితంలో 2000పైగా నీటి రంగులచిత్రాలు, 800 తైలవర్ణ చిత్రాలు చిత్రించాడు. నవల చదువుతున్నపుడు విన్సెంట్ చిత్రిచిన చిత్రాలకు స్ఫూర్తి నిచ్చిన అనేక సంఘటనలు, ప్రకృతి విచిత్రాలను, వ్యక్తులను రచయిత యధాలాపంగా పరిచయంచేస్తూపోతాడు.

అప్పుడు, ఇప్పుడు కళాకారులు కళాసృజనలో పడే వేదన, తపన, చేసేత్యాగం మనల్ని అబ్బురపరుస్తాయి.

విన్సెంట్ కళాకారులు ఒకచోట నిత్యనైమిత్తికాలకోసం యాతన పడకుండా స్వేచ్ఛగా బొమ్మలు వేసుకొనే పరిస్థితులకోసం ప్రయత్నిస్తాడు. కళాకారులకు పేరు వచ్చినతర్వాత ప్రపంచం గుర్తిస్తుంది కాని ఆస్థాయికి రావడానికి వారు ఎన్నెన్ని త్యాగాలు చేయవలసివస్తుందో ఈ నవలో చక్కగా చిత్రించబడింది. నవల చదుతున్నపుడు ప్యాసా సినిమా గుర్తొచ్చింది, చివరకు మిగిలేది, ఆఫ్ హ్యుమన్ బాండేజ్, సిటడల్ వంటి ఇంగ్లీషు నవలలు మనసులో మెదిలాయి.

చిత్రకారుడి జీవితాన్ని నవలీకరించడం ఎంతకష్టమో,తరచు చిత్ర కళావిమర్శ, ఆనాటి కళాధోరణులు మొదలైన అనేక విషయాలతో పరిచయం లేకపోతే ఈ గొప్ప నవల చదివి ఆనందించలేము.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Biography of Vincent Willem van Gogh". Van Gogh Museum (in ఇంగ్లీష్). Retrieved 2022-01-08.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 Biographics. "Vincent Van Gogh: The Humble Genius". youtube. Retrieved 2022-10-14.{{cite web}}: CS1 maint: url-status (link)