విభూతి జలపాతం
స్వరూపం

విభూతి జలపాతం భారతదేశం, కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లా, అంకోలా తాలూకా, అచ్చవే గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. "విభూతి" అంటే సున్నపురాయి అని అర్ధం. యానా సమీపంలోని సున్నపురాయి శిలల గుండా నీరు ప్రవహించడం వల్ల ఈ జలపాతానికి "విభూతి జలపాతం" అని పేరు వచ్చింది.[1] విభూతి జలపాతానికి సమీపంలో సిర్సి, కుమటా, అంకోలా, గోకర్ణ పట్టణాలు ఉన్నాయి.
ఈ జలపాతం కర్ణాటకలోని కరావళి ప్రాంతంలో ఉంది. కర్ణాటక రాష్ట్ర రహదారి 143 (SH143) ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. విభూతి జలపాతానికి సుమారు 40 కి.మీ దూరంలో ఉన్న కుమటాలో సమీప రైల్వే స్టేషన్ ఉంది.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Ankola Tourism". Uttarakannada.nic.in. Retrieved 13 March 2019.