విమర్శ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అత్యంత ప్రాచీకాలం నుంచి విమర్శ అనే ప్రక్రియ ఉన్నప్పటికి దీనిని ఆధునిక ప్రక్రియయలలో భాగంగా గుర్తిస్తున్నారు. ఏదైనా సాహిత్య రచనను దోషా,అదోషా నిరూపనలు చేసేది విమర్శ.

విమర్శనము[మార్చు]

ఉత్తమమైన విమర్శకులకు విజ్ఞానవికాశములు చేకూర్చుటయేకాక వారియందు నూతనచైతన్యము రేకెత్తించును.మహాకవులు తమవికావ్యములు ద్వారా మానవజీవిత పరమార్థమును జూఱలొసంగ విమర్శకులు తమ విమర్శలద్వారా సారస్వత పరమార్థమును జూఱయిచ్చుచుందురు.

విమర్శక లక్షణములు[మార్చు]

కావ్యవిమర్శ చేయగలగు వారందరూ తగిన అధికారము సంపాదించాలి.సాహిత్యశాస్త్రనిష్టాతులై,విద్వాంసులై,పూర్వకవి రచిత మహాకావ్యములతో పరిచయము కలిగి ఉండాలి.వారు విమర్శకావ్యమును సానుభూతితో పరిశీలించు సహ్రుదయులై ఉండాలి.వారు విమర్శనీయాంశము కావ్యప్రవృత్తియే కాని కవిప్రవృత్తి కాదని గుర్తించుకొనవలయును.వారు కావ్యవిమర్శ చేయునప్పుడు తమ్ముతమ భావములను విస్మరించి అహంకార పరిత్యాగము చేయవలయును.విమర్శ నిర్మాణాత్మకంగా ఉండవలయునే కాని,విద్వాంసనాత్మకముగా ఉండరాదు.


ప్రాక్ప్రతీచీ విమర్శన విధానములు[మార్చు]

పాశ్చాత్యులతో పోల్చిచూచినచో విమర్శ సందర్భమున భారతీయులకు చారిత్రకదృష్టి తక్కువగా కనిపించును.పాశ్చాత్యులేదైన గ్రంథమును విమర్శించుటకు ముందాగ్రంథమును రచించిన కర్త ఏ దేశమందు,ఏ కాలమందు నివశించెనో అప్పటి మత,రాజకీయ,సాంఘిక పరిస్థితులెట్లుండెనో కర్తరచనపై వానికిగల ప్రభావమెట్టిదో పరిశీలన చేయుదురు.అందుచే పాశ్చాత్య దేశమందలి విమర్శలలో కావ్యముల చరిత్రముతోపాటు కవుల చరిత్రకూడా తెలిసికొనుటకు అవకాశముండును.

భారతీయులలో ఆ పరిశీలన అల్పముగా ఉండును.భారతీయులు విమర్శ సందర్భమున ఈ బహిర,అంతర స్వరూపములు రెండింటికి సమప్రాధాన్యము చెప్పుదురు.కావ్యమునకు శబ్ధ,ఛందస్సులు బాహ్యస్వరూపములు.రసభావాదులు అంతర స్వరూపములు.పాశ్చాత్యులు అంతరస్వరూప విమర్శనకు ఇచ్చినంత ప్రాధాన్యత బహిస్వరూపమునకు చెప్పరు.వీరి విమర్శనలు మనోభావ పరిశీలనము,ఔచిత్యము,సౌందర్యము మొదలగువానికి సంబంధించియుండును.

భారతీయ విమర్శకులలో లక్షణానుసరణము ఎక్కువగకనిపించును.సమయ సంప్రదాయాభిమానము ఎక్కువ.పాశ్చాత్యుల విమర్శకులలో కూడా కొందరిలో సంప్రదాయాభిమానము ఉన్ననూ కొందరు నూతన ప్రయోగములను,ఉత్కర్షావహమైన స్వాతంత్ర్యమును నిరశింపకపోవుటయే కాక అధికముగా ప్రశంసింతురు.భారతీయులు ఉపదేశమును వాంఛింతురు.పాశ్చాత్యులు ఉపదేశప్రధానముకంటే ఆనంద సంధానధక్షత్వమునకు ఎక్కువ ప్రాధాన్యము ఒసంగుదురు.భారతీయులలో కావ్యవిమర్శతోపాటు

కావ్యకర్త జీవితమువరకు వ్యాపించుచుండును.పాశ్చాత్యులలో వ్యక్తిగత దూషణాదులు అత్యల్పముగా గోచరించును.

గుణములు వైదేశికములైననూ ఆదరణీయములే.దోషములు స్వదేశికములైననూ విషర్జింపదగినవే.

  • తెలుగులో ఆధునిక శాస్త్రీయ విమర్శ ప్రారంభించినది కందుకూరి వీరేశలింగంపంతులు.
  • అనతరం ఆధునిక సాహిత్య విమర్శనం శాస్త్రీయం చేసినవారు కట్టమంచి రామలింగారెడ్డి.
  • కావ్య శరీరం నుండి విమర్శను కావ్య ఆత్మ దిశగా నడిపినవాడు కట్టమంచి రామలింగారెడ్డి.
  • విమర్శకు ఆరంభకుడు కందుకూరి అయితే వికాసానికి కారకుడు కట్టమంచి రామలింగారెడ్డి.

విమర్శన గ్రంథాలు-రచయితలు[మార్చు]

1.విగ్రహతంత్ర విమర్శనం >కందుకూరి వీరేశలింగంపంతులు.(తొలి సాహిత్య విమర్శనా గ్రంథం )

2.విగ్రహతంత్రము >కొక్కొండ వారు.

3.సరస్వతి నారదవిలాసం >కందుకూరి వీరేశలింగంపంతులు (క్షీనయుగంపై తొలిసారి విమర్శ వ్రాసినవారు).

4.అభాగ్యోపాఖ్యానం >కందుకూరి వీరేశలింగంపంతులు (తొలితెలుగు హేళన కావ్యం)

5.వివేకచంద్రిక విమర్శనం >కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రీ (తొలిసారి నవలా విమర్శనం చేసినవారు )

6.పింగళి సూరన(విమర్శాన గ్రంథం) >పి.దక్షిణామూర్తి

7.నన్నయభట్టారకుడు >పుదుప్పాకం సుబ్రహ్మణ్య అయర్

8.విక్రమార్క చరిత్రా విమర్శనం >వేదం వేంకటరాయ శాస్త్రీ(విక్రమార్క చరిత్ర రచించినది జక్కన)

9.శ్రీకాళహస్తీశ్వర మహాత్యం >వేదం వేంకటరాయ శాస్త్రీ

10.తిక్కన సోమయాజి విజయం >వేదం వేంకటరాయ శాస్త్రీ

11.ఆంధ్రగ్రంథ విమర్శనాప్రకాశలేఖనం>వేదం వేంకటరాయ శాస్త్రీ(మహామహోపాధ్యాయ అనేది ఈయన బిరుదు)

12.వ్యాసమంజిరి >కట్టమంచి రామలింగారెడ్డి

13.పంచమి >కట్టమంచి రామలింగారెడ్డి

14.సారస్వతి లోకనం >రాళ్ళపల్లి అంతకృష్ణశర్మ

15.రాయలనాటిరసికత(వ్యాససంపుటి)>రాళ్ళపల్లి అంతకృష్ణశర్మ

16.వేమన >రాళ్ళపల్లి అంతకృష్ణశర్మ

17.వేమన >సి.పి.బ్రౌన్

18.వేమన >ఎన్.గోపి

19.కావ్యానందం >విశ్వనాధ సత్యన్నారాయణ

20.కావ్య పరిమలం >విశ్వనాధ సత్యన్నారాయణ

21.శాకుంతలం యొక్క అభిజ్ఞానత >విశ్వనాధ సత్యన్నారాయణ

22.ఒకడు నాచనసోమన >విశ్వనాధ సత్యన్నారాయణ

23.అల్లసాని వారి అల్లిక జిగిబిగి >విశ్వనాధ సత్యన్నారాయణ

24.నన్నయగారి ప్రసన్నకథాకలితార్థయుక్తి >విశ్వనాధ సత్యన్నారాయణ( కవి సాంరాట్ ఈయన బిరుదు)

25.ఆధునికాంధ్ర కవిత్వము:ప్రయోగములు, సంప్రదాయములు >సి.నారాయణరెడ్డి

26.తెలుగులో కవితా విప్లవాల స్వరూపం >వేల్చేరు నారాయణరావు

"https://te.wikipedia.org/w/index.php?title=విమర్శ&oldid=2065999" నుండి వెలికితీశారు