విమలక్క

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విమలక్క
విమలక్క

నియోజకవర్గము ఆలేరు

వ్యక్తిగత వివరాలు

జననం 1964 (age 55–56)
కొలనుపాక, ఆలేరు, నల్గొండ, తెలంగాణ
రాజకీయ పార్టీ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ (TUF)
నివాసము హైదరాబాదు, తెలంగాణ

విమలక్క అరుణోదయ కళాకారిణి. ప్రజా ఉద్యమాల పోరాట వనిత. ప్రగతిశీల విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడే జోగిని వ్యవస్థపై పోరాడింది. నల్లగొండ జిల్లాలోని ఆలేరు లో 1964 లో జన్మించారు. ముగ్గురు అక్కాచెల్లెళ్ళు,ఇద్దరు అన్నలు.అమ్మ నర్సమ్మ కష్టజీవి. నాన్న బండ్రు నర్సింహ్మయ్య రైతుకూలీ సంఘం నాయకుడు. టెన్త్ వరకు ఆలేరులోనే చదివారు. ఇంటర్, డిగ్రీ భువనగిరిలో చేశారు. జీవన సహచరుడు అమర్‌. ఆమె అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉద్యమ పోరాట వర్గం యొక్క సభ్యురాలు.[1]

భావాలు, అనుభవాలు[మార్చు]

  • అప్పట్లో ఎంతోమంది విప్లవకారులకు ఆశ్రయం ఇచ్చి, అన్నంపెట్టిన ఇల్లు మాది. సుందరయ్య, చండ్రపుల్లా రెడ్డి, పైలా వాసుదేవరావు, చంద్రన్న వంటిఎంతో మంది నాయకులకు ఆశ్రయమిచ్చింది. టాన్యా అక్క(చంద్రన్న భార్య) మా ఇంట్లోనే అరెస్టు అయ్యింది.
  • బ్రహ్మజెముడు కాయల గుజ్జును పిసికితే మెరూన్ కలర్ రంగు వచ్చేది. ఆ రంగునే వాడేవాళ్లం. మా కురుమ వాడలో ఆడే బతుకమ్మ ఆటే మా ఊరందరికీ హైలైట్. ఎగ్గిడి బీరమ్మ అని ఒక పెద్దావిడ చాలా బాగా పాటలు పాడేది. తర్వాత నేను పాడేదాన్ని.
  • చిన్నప్పుడు పొలం గట్లపై కూర్చుండి కూలీలు నాటేస్తూ పాటలు పాడుతుంటే వినేదాన్ని. మనసుకు ఎంతో హాయిగా ఉండేది. అయితే వాళ్లు నాటు వేస్తూ వేస్తూ గట్టుకు దూరమైపోతుంటే నాకు పాట సరిగా వినబడదనే ఆతృతతో నేను కూడా పొలంలోకి దిగి వాళ్లతో పాటు నాటువేస్తూ పాటలు వినేదాన్ని. అలా చాలాసార్లు చేయడం వల్ల నాటు వేయడం కూడా పూర్తిగా వచ్చేసింది. నా ఫస్టు పాట మొదలైంది కూడా ఆలేరులోనే.
  • ఇప్పుడు ఆ ఊరు నాకేమిచ్చింది అనే కంటే నా ఊరికి నేనేమి ఇవ్వగలను అని ఆలోచిస్తున్నా. నాకు ఏది సాధ్యమైతదో, నేనేం చేయగలనో వంద శాతం చేయడానికి ప్రయత్నం చేస్తా!ఊరుకు దూరంగా ఎవరు, ఎక్కడున్నా వాళ్లు సొంతూరు గురించి ఆలోచించాలి. ఎందుకంటే మన పునాదులు, ఆటలు, పాటలు, జీవితం మొదలైంది అక్కడే కదా.
  • ఆ కాలంలో తెలంగాణలో చాలా చోట్ల ఉన్నట్టే దొరల పెత్తనం, రెడ్డి దౌర్జన్యాలు మా ఊళ్లో కూడా ఉండేవి. ఓ టైమ్‌లో ఊళ్లో భూమి కోసం పోరాడుతున్న ఓ ముస్లిం ఫ్యామిలీ మొత్తం హత్యకు గురైంది. వాళ్లతో నాది మంచి అనుబంధం ఉండేది. అయితే ఆ శవాలను చూసే పరిస్థితి కూడా లేకుండే. అయినా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లి చూసొచ్చాను.
  • ఊరంతా వరసలతో పిలుచుకునేవాళ్లం. గౌడ్స్‌తో మాకు ఎక్కువ అనుబంధం. వాళ్లంతా తాతలు, మామలు మాకు. నన్ను 'ఇమ్లవ్వా..' అని ప్రేమగా పిలిచేవారు. ఇప్పటికీ నేను ఊరెళితే అదే ఆప్యాయత, అదే పలకరింపు. నేనూ అంతే దగ్గరకెళ్లి వాళ్లతో పాటు అరుగు మీద కూర్చుండి కాసేపు మాట్లాడి వస్తాను. నిజానికి మనం ఎలాంటి స్థాయిలో ఉన్నా సొంతూళ్లో, మనవాళ్ల మధ్య అరుగు మీద కూర్చుండి ముచ్చట్లు పెట్టుకోవడంలో ఉన్నంత ఆనందం ఇంకెక్కడా దొరకదేమో!
  • ఈమె 1996 నుండి తెలంగాణ ఉద్యమంలొ పాల్గొన్నారు.[2]

మూలాలు[మార్చు]

  1. http://articles.timesofindia.indiatimes.com/2010-10-27/hyderabad/28246916_1_praja-front-gaddar-tpf
  2. http://epaper.namasthetelangaana.com/Details.aspx?id=92270&boxid=114838416
"https://te.wikipedia.org/w/index.php?title=విమలక్క&oldid=2771499" నుండి వెలికితీశారు