Jump to content

ఐ.ఎన్.ఎస్ విరాట్

వికీపీడియా నుండి
(విరాట్ నుండి దారిమార్పు చెందింది)
2002 లో ఐ.ఎన్.ఎస్ విరాట్ (R22)
భారత్
పేరు: ఐ.ఎన్.ఎస్ విరాట్
సేకరించినది: 1987 మే
Recommissioned: 1987 మే 12[1]
Decommissioned: 2017 జనవరి (అంచనా)[2]
పని నుండి విరమణ: 2016 జూలై 23
Refit: April 1986, July 1999, Mid-2003-November 2004, August 2008-November 2009, November 2012-July 2013
Homeport: Mumbai, Maharashtra
Identification: పెన్నంట్ నంబరు: R22
Motto: జలమేవ యస్య, బలమేవ తస్య' (జలాధిపత్యం కలిగినవాడే బలాధిపత్యం కలిగినవాడు)
మారుపేర్లు: Grand Old Lady[3]
స్థితి: Retired from active service
United Kingdom
పేరు: HMS Hermes
Ordered: 1943
నిర్మాణ సంస్థ: Vickers-Armstrong
నిర్మాణం మొదలైనది: 21 June 1944
జలప్రవేశం: 16 February 1953
కమిషనైనది: 25 November 1959
Decommissioned: 1984
Struck: 1985
Homeport: HMNB Portsmouth
Identification: pennant number: R12
Fate: Sold to India in 1986
సాధారణ లక్షణాలు
తరగతి, రకం: -class aircraft carrier
డిస్‌ప్లేస్‌మెంటు: 23,900 tons standard *28,700 tons full load
పొడవు: 226.5 మీ. (743 అ.)
బీమ్: 48.78 మీ. (160.0 అ.)
డ్రాట్: 8.8 మీ. (29 అ.)
ప్రొపల్షన్: 2 × Parsons geared steam turbines; 4 boilers with 400 psi, 76,000 shp (57,000 కి.W)
వేఘం: 28 knots (52 km/h)
పరిధి: 6,500 మై. (10,500 కి.మీ.) at 14 knots (26 km/h)
Complement: Maximum 2,100; *1,207 ship's crew, *143 air crew
సెన్సార్లు,
ప్రాసెసింగ్ వ్యవస్థలు:
1 × BEL/Signaal RAWL 02 air radar *1 × RAWS 08 air/surface radar *2 × BEL Rashmi navigation radars *1 × EL/M-2221 STGR fire control radar *1 × Plessey Type 904 radar *1 × FT 13-S/M Tacan system *Sonar: *1 × Graseby Type 184M hull-mounted sonar
ఎలక్ట్రానిక్ యుద్ధ
& డికాయ్‌లు:
1 × BEL Ajanta ESM *Decoy: *2 × Knebworth Corvus chaff launchers
ఆయుధాలు: 2 × 40 mm Bofors AA guns *16 × Barak SAM VL cells *2 × twin AK-230 CIWS
విమానాలు: Up to 26 aircraft, including * 16 * British Aerospace Sea Harrier FRS51 * 4 * Westland Sea King Mk.42B-C * 2 * HAL Chetak * 4 * HAL Dhruv

ఐ ఎన్ ఎస్ విరాట్ భారత నౌకా దళానికి చెందిన సెంటార్ తరగతి విమాన వాహక నౌక. 27 సంవత్సరాల సేవ తరువాత 2016 లో ఈ నౌకను నౌకాదళం నుండి విరమింపజేసారు. 2013 లో ఐ.ఎన్.ఎస్ విక్రమాదిత్య కమిషను కాకముందు, విరాట్‌యే భారత నౌకాదళపు ఫ్లాగ్‌షిప్ నౌక. పని విరమించే ముందు వరకూ ఇది ప్రపంచంలోనే అత్యంత పాత విమాన వాహక నౌక. 1959 లో బ్రిటిషు నౌకాదళంలో హెచ్ ఎం ఎస్ హెర్మెస్‌గా చేరిన ఈ నౌకను 1987లో భారత్ కొని, 1987 మే 12 న ఐ ఎన్ ఎస్ విరాట్‌గా పేరు పెట్టింది.[1] 

విరాట్‌ను వచ్చే ఏడు సేవనుండి విరమింపజేస్తామని నౌకా దళం   2015 ఫిబ్రవరిలో ప్రకటించింది.[4] 2016 జూలై 23 న చివరిసారిగాఅ ముంబై నుండి కొచ్చికి ప్రయాణించి అక్కడి డ్రైడాక్‌లో లంగరు నిలిచింది.[5] అక్టోబరు 23 న కొచ్చి నుండి దాన్ని లాక్కుంటూ అక్టోబరు 28 న ముంబైకి చేర్చారు. 2017 జనవరిలో విరాట్‌ను లాంఛనంగా డీకమిషను చేస్తారు.[2] తరువాత విరాట్‌ను ఏంచేస్తారనేది ఇంకా తేలలేదు.[6]

డిజైను

[మార్చు]

విరాట్‌కు సీ హారియర్ విమానాలను నడిపేందుకు వీలుగా 14° వాలు కలిగిన స్కీజంపు కలిగి ఉంది. ఆయుధాగారంలో 80 తేలిక రకం టార్పెడోలుంటాయి. 750 మంది నావికులను తీసుకెళ్ళగలిగే సామర్థ్యం విరాట్‌కు ఉంది. వెనక భాగంలో LCVP landing craft ఉంటుంది.[7] యుద్ధ సమయాల్లో నౌక 26 యుద్ధ విమానాలను తీసుకువెళ్ళగలదు.

విమానాలు

[మార్చు]

విరాట్‌పై ఉన్న విమానాలను నౌకాదళ వాయు సేనకు చెందిన నాలుగు స్క్వాడ్రన్లు నిర్వహిస్తాయి:

వాయు స్క్వాడ్రన్లు
స్క్వాడ్రన్ పేరు చిహ్నం విమానాలు
INAS 30 వైట్ టైగర్స్ దస్త్రం:INAS 300 insignia.jpg BAE Sea Harrier
INAS 552 ది బ్రేవ్స్ దస్త్రం:INAS 552 insignia.jpg BAE Sea Harrier
INAS 321 ఏంజెల్స్ దస్త్రం:INAS 321 insignia.jpg Alouette III

HAL Chetak

INAS 330 హార్పూన్స్ Westland Sea King

చరిత్ర

[మార్చు]

భారత నౌకాదళం

[మార్చు]
నౌకాదళ సీ హారియర్లు, వాయు సేనకు చెందిన జాగ్వార్లు, అమెరికా నౌకా దళ సూపర్ హార్నెట్ విరాట్ పై ఎగురుతున్న దృశ్యం

భారత నౌకాదళం విరాట్‌ను 1986 లో కొని ఇంగ్లాండులోనే పునర్నిర్మాణం చేయించింది.[8][9] కొత్త ఆయుధ నియంత్రణ వ్యవస్థ, రాడార్లు, విమానాల ల్యాండింగు సహాయక వ్యవస్థలను ఏపొరాటు చేసారు.[10]

1993 సెప్టెంబరులో ఇంజను గదిలోకి నీళ్ళు వచ్చి మునిగిపోయింది. రెండేళ్ళపాటు రిపేర్లు జరిగాక తిరిగి 1995 లో విరాట్ దళ సేవలో చేరింది. 1999, 2001 ల మధ్య  మరోసారి నౌక రీఫిట్ జరిగింది  దీంతో నౌక జీవితకాలం 2010 వరకూ పెరిగింది.[11] 2001 ఫిబ్రవరిలో ముంబైలో జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొంది. 2003లో మరో రీఫిట్ జరిపి 2004 లో తిరిగి సేవలో దింపారు.ఈ సమయంలో నౌకలో బరాక్ క్షిపణులను అమర్చారు.[12] 2009 ఆగస్టులో నౌకను మరోసారి పునర్నిర్మించారు. దీంతో నౌక 2015 వరకూ పనిచేస్తుంది. నౌకాదళ అధికారులు ఇది 2020 వరకూ పనిచేస్తుందని నివేదికలిచ్చారు.[13][14]

2012 నవంబరు 2 న నౌకకు కొచ్చిలో మరోసారి రీఫిట్ జరిగింది. నౌక దేహాన్ని పరీక్షించి అవసరమైఅన రిపేర్లు చేసి, రంగు వేసారు.[15] తరువాత ముంబైలో మరిన్ని రిపేర్లు  జరిగాక, 2013 లో తిరిగి దళంలో చేరింది. ఇదే నౌకకు జరిగిన చివరి రీఫిట్. ఇక అది 2016 లో డికమిషను అయ్యేవరకూ పనిచేసింది.[16] 2016 ఫిబ్రవరిలో విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనే ముందు   చిన్నపాటి రిపేర్లు జరిగాయి.[17]

విరమణ

[మార్చు]
ముంబై నుండి కొచ్చి వరకు చేసిన చిట్టచివరి ప్రయాణంలో విరాట్
ఐ ఎన్ ఎస్ విక్రమాదిత్య (కింద) తొలిసారి భారత జలాల్లో ప్రవేశించినపుడు దాన్ని తోడ్కొని వెళ్తున్న ఐ ఎన్ ఎస్ విరాట్

2013 లో ఐ ఎన్ ఎస్ విక్రమాదిత్య భారత నౌకా దళంలోకి చేరింది. విరాట్ 2020 వరకూ సేవలను అందింగలిగినప్పటికీ,[13][18] పెరుగుతున్న నిర్వహణా ఖర్చులను దృష్టిలో ఉంచుకుని, దాన్ని 2017 లో డికమిషను చెయ్యాలని నౌకాదళం నిర్ణయించింది. 

2016 జూలై 23 న ముంబై నుండి విరాట్‌ కొచ్చి వెళ్ళి డీకమిషను కోసం అవసరమైన సన్నాహాలను అక్కడ పూర్తి చేసుకుంది.    

నౌకలోని బాయిలర్లు, ఇంజన్లు, ప్రొపెల్లర్లు, రడ్డర్లు వంటి ముఖ్యమైన భాగాలను తీసివేసారు.[5][19] ఆ తరువాత నౌకను ముంబైకి లాకొని వెళ్ళి, డికమిషనుకు ఏర్పాట్లు చేసారు.[6] 2017 జనవరిలో డీకమిషను జరగవచ్చు..[2] డీకమిషను తరువాత విరాట్‌లోని ఆయుధ వ్యవస్థలు, పరికరాలు వగైరాలను తీసివేస్తారు. ఆ తరువాత నౌకను ఏం చేస్తారనేది ఇంకా తేలలేదు.[6][20]

ఐ ఎన్ ఎస్ విరాట్ తన జీవిత కాలంలో 2,250 రోజుల పాటు సముద్రంలో ఉంది. 10,94,215 కిలోమీటర్లు ప్రయాణం చేసింది.[20]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Surface Ships". Indian Navy.
  2. 2.0 2.1 2.2 Deshpande, Vinaya (29 October 2016). "INS Viraat reaches Mumbai, set to be decommissioned in January". The Sunday Guardian Live.
  3. "INS Viraat sails to Kochi for repairs, dry-docking". The Economic Times. 24 July 2016. Retrieved 24 July 2016.
  4. Anandan, S (12 February 2015). "INS Viraat to be decommissioned in 2016". The Hindu.
  5. 5.0 5.1 "INS Viraat's last journey". The Hindu. 23 July 2016.
  6. 6.0 6.1 6.2 "INS Viraat's final farewell set in Mumbai". The Hindu. 25 September 2016.
  7. Lee, Jae-Hyung (2003). China and the Asia-pacific Region: Geostrategic Relations and a Naval Dimension. iUniverse. p. 174. ISBN 978-0-595-26043-0.
  8. Anthony, Ian (1990). The Naval Arms Trade. SIPRI. p. 135. ISBN 978-0-19-829137-4.
  9. Ramchandani, Indu (2000). Students' Britannica India, Volumes 1-5. Popular Prakashan. ISBN 978-0-85229-760-5.
  10. Bishop, Chris; Chant, Christopher (2004). Aircraft Carriers. MBI Publishing Company LLC. ISBN 978-0-7603-2005-1.
  11. Horizon House (2004). International Electronic Countermeasures Handbook. Artech House. p. 115. ISBN 978-1-58053-898-5.
  12. Abadi, Jacob (2003). Israel's Quest for Recognition and Acceptance in Asia: Garrison State Diplomacy. Taylor and Francis. ISBN 978-0-203-50414-7.
  13. 13.0 13.1 "Naval Air: Where There Were None, Now There Is One". Strategypage.com. 20 August 2009.
  14. Sharma, Ritu (17 August 2009). "INS Viraat refit complete, gears up for golden jubilee". Indo-Asian News Service. Archived from the original on 27 సెప్టెంబరు 2009. Retrieved 1 జనవరి 2017.
  15. "INS Viraat arrives in Kochi for periodic refit". The Hindu. 3 November 2012.
  16. "Major repairs for the INS Viraat, its replacement delayed again by Russia". NDTV. 8 March 2013.
  17. "INS Viraat to have short refit". The Hindu. 24 July 2015.
  18. "Navy to operate Viraat aircraft carrier for another decade". The Economic Times. 19 January 2011.
  19. "INS Viraat's last journey commences". Times of India. 23 July 2016.
  20. 20.0 20.1 "INS Viraat sails on final journey from Kochi to Mumbai for decommissioning". The New Indian Express. 23 October 2016.

బయటి లింకులు

[మార్చు]