Jump to content

విరుదునగర్

అక్షాంశ రేఖాంశాలు: 9°34′04.8″N 77°57′44.6″E / 9.568000°N 77.962389°E / 9.568000; 77.962389
వికీపీడియా నుండి
Virudhunagar
City
Virudhunagar is located in Tamil Nadu
Virudhunagar
Virudhunagar
Virudhunagar, Tamil Nadu
Coordinates: 9°34′04.8″N 77°57′44.6″E / 9.568000°N 77.962389°E / 9.568000; 77.962389
Country India
StateTamil Nadu
DistrictVirudhunagar
Revenue DivisionAruppukkottai
TalukVirudhunagar
Government
 • TypeSelection Grade Municipality
 • BodyVirudhunagar municipality
విస్తీర్ణం
 • Total6.39 కి.మీ2 (2.47 చ. మై)
Elevation
120 మీ (390 అ.)
జనాభా
 (2011)
 • Total72,296
 • జనసాంద్రత11,000/కి.మీ2 (29,000/చ. మై.)
Languages
 • OfficialTamil
Time zoneUTC+5:30 (IST)
PIN
626 001
Telephone code04562
Vehicle registrationTN-67

విరుదునగర్ భారతదేశం, తమిళనాడు రాష్ట్రం, విరుదునగర్ జిల్లా లోని ఒక నగరం. జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. ఇది రాష్ట్ర రాజధాని చెన్నైకి నైరుతిలో 506 కి.మీ. (314 మై.) దూరంలో, మధురైకి దక్షిణంగా 53 కి.మీ. (33 మై.) దూరంలో ఉంది. బ్రిటిష్ పాలనలో విరుదునగర్ ఒక ముఖ్యమైన వాణిజ్యకేంద్రంగా ఉద్భవించింది. కౌసికానదికి తూర్పున ఉన్న విరుదునగర్ సముద్రమట్టానికి సగటుఎత్తు 102 మీ. (335 అ.) పైన ఉంది. ఎక్కువ భూగోళ నిర్మాణాలు లేకుండా చదునుగా ఉంటుంది. పట్టణం తేమతోకూడిన వాతావరణంతో 780 మీ (31 అం) ఏటా వర్షపాతం అందుకుంటుంది. తరువాతి పాండ్యులు, విజయనగర సామ్రాజ్యం, మధురై నాయకులు, చందాసాహిబ్, కర్ణాటకరాజ్యం, బ్రిటీష్ వారు వివిధసమయాల్లో దీనిని పాలించారు. దీనిని పూర్వం విరుదుపట్టి అని పిలిచేవారు. విరుదునగర్ 6.39 కి.మీ2 (2.47 చ. మై.) విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీని పరిపాలన విరుదునగర్ పురపాలకసంఘం ద్వారా సాగుతుంది. 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం 72,296 మంది జనాభాను కలిగి ఉంది.ఇది జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. పట్టణ ఆర్థిక వ్యవస్థ మొత్తం శ్రామికశక్తిలో 93% ఉద్యోగులను కలిగి ఉన్న సేవారంగంపై ఆధారపడి ఉంది. మిగిలిన 7% వ్యవసాయం, మైనింగ్ క్వారీ, పశువుల పెంపకం, తయారీ పరిశ్రమలు, నిర్మాణరంగం, వాణిజ్యం ద్వారా ఉపాధి పొందుచున్నారు. రోడ్డు మార్గాలు ప్రధాన రవాణా సాధనాలు. పట్టణంలో రైలు ప్రయాణసదుపాయం ఉంది. పట్టణానికి ఈశాన్యంగా సమీప విమానాశ్రయం 45 కి.మీ. (28 మై.) దూరంలో మధురై విమానాశ్రయం ఉంది. పట్టణంలో 14 ద్వితీయపాఠశాలలు, రెండు ఆర్ట్స్, సైన్సెస్ కళాశాలలు (పురుషులకు ఒకటి, మహిళలకు ఒకటి), ఒక పాలిటెక్నిక్ కళాశాల, మూడు ఇంజనీరింగ్ కళాశాలలు (కామరాజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, శ్రీ విద్య, ఎఎఎ) మూడు విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. విరుదునగర్ ప్రభుత్వ వైద్య కళాశాల 2021 సంవత్సరంలో ఏర్పడింది. ఇది విరుదునగర్ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని జాతీయ రహదారి-44లో ఉంది.

శబ్దవ్యుత్పత్తి, చరిత్ర

[మార్చు]

స్థానిక పురాణం ప్రకారం, తన రాజ్యాలను జయించడం నుండి అనేక పతాకాలను ( తమిళంలో విరుదు అని పిలుస్తారు) గెలుచుకున్న ఒకయోధుడు పట్టణానికి వచ్చి నగరం లోని నివాసితులను సవాలు చేస్తాడు. ఒక నివాసి ఆ సవాలును స్వీకరించి, సవాలు విసిరిన యోధుని చంపాడు. ఆ పై అతనివద్ద ఉన్న జెండాలను స్వాధీనం చేసుకున్నాడు. అప్పటి నుండి ఈ పట్టణం విరుదుక్కల్వెట్టి అనే పేరుతో పిలువబడింది. [1][2]

సా.శ. 16వ శతాబ్దంలో విరుదునగర్ మధురై ప్రాంతంలో (ఆధునిక కాలంలో త్రిచీకి ఆవల దక్షిణ తమిళనాడు మొత్తాన్ని కలిగిఉన్న ప్రాంతం) ఒకభాగం. ఈ ప్రాంతం, నాయకుల ఆధ్వర్యంలో 1559లో విజయనగర సామ్రాజ్యం నుండి స్వతంత్రం పొందింది.[3] నాయక్ పాలన 1736లో ముగిసింది. ఈ ప్రాంతాన్ని18వ శతాబ్దం మధ్యలో చందాసాహిబ్ (1740-1754), ఆర్కాట్ నవాబ్, మరుదనాయగం పిళ్లై (1725-1764) పలుమార్లు స్వాధీనం చేసుకున్నారు.1801లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రత్యక్ష నియంత్రణలోకి వచ్చిన తరువాత, మద్రాసు ప్రెసిడెన్సీలో విలీనం అయింది.[4]

1875లో పట్టణం పేరు విరుదుపట్టిగామార్చబడింది. 1923 ఏప్రిల్ 6న అప్పటి పట్టణ మండలి దీనిని విరుదునగర్‌గామార్చింది. బ్రిటిష్ పాలనలో ఇది ఒకముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉంది. విరుదునగర్ నుండి సరుకులు కులశేఖరపట్నం, తూత్తుకుడి, వైప్పర్, దేవిపట్నం ఓడరేవుల ద్వారా విదేశాలకు సరుకులు ఎగుమతి చేయబడ్డాయి. స్వాతంత్ర్య సమరయోధుడు, 1954 నుండి 1963 వరకు తమిళనాడు ముఖ్యమంత్రి, భారతదేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న గ్రహీత కె. కామరాజ్ ఈ పట్టణంలో జన్మించాడు.[1] [5]

భౌగోళికం

[మార్చు]

విరుదునగర్ పురపాలక సంఘం 6.39 కి.మీ2 (2.47 చ. మై.) విస్తీర్ణంలో విస్తరించి ఉంది. [6] ఇది రాష్ట్ర రాజధాని చెన్నైకి నైరుతిన 506 కి.మీ. (314 మై.) దూరంలో, మధురైకి దక్షిణంగా 53 కి.మీ. (33 మై.) దూరంలోఉంది. ఈ పట్టణం సముద్రమట్టానికి 102 మీ. (335 అ.) సగటు ఎత్తులో, కౌసికానదికి తూర్పున, మధురై-తిర్నెల్వేలి రైలు మార్గానికి పశ్చిమాన ఉంది. భూమి ఎక్కువభాగం చదునుగా ఉంటుంది. పెద్ద భౌగోళిక నిర్మాణాలు లేవు. నల్లనేల, ఎరుపునేలలతో కూడుకుని ఉంటుంది. ఇవి పత్తి, మిరప, సుగంధ ద్రవ్యాలు ఏలకులు, మినుము వంటి పంటలకు అనుకూలం. నీటిపారుదల కోసం మోటారు పంపులు అందుబాటులో ఉన్న ప్రదేశాలలో వరి, చెరుకు పండిస్తారు.

జనాభా గణాంకాలు

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
195146,456—    
196154,871+18.1%
197161,904+12.8%
198168,040+9.9%
199170,971+4.3%
200172,081+1.6%
201172,296+0.3%

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, విరుదునగర్‌లో 72,296 జనాభా ఉంది. ప్రతి 1,000 మంది పురుషులకు 1,014 మంది స్త్రీల లింగనిష్పత్తి ఉంది. ఇది జాతీయ సగటు 929 కంటే చాలా ఎక్కువ [7] మొత్తం జనాభాలో 6,454 మంది ఆరేళ్లలోపు వారు ఉన్నారు. వారిలో 3,268 మంది పురుషులు ఉండగా, 3,186 మంది మహిళలు ఉన్నారు. జనాభాలో షెడ్యూల్డ్ కులాలువారు 7.06% మంది ఉండగా, షెడ్యూల్డ్ తెగలువారు 0.08% మంది ఉన్నారు. పట్టణ సగటుఅక్షరాస్యత 84.28% ఉంది.దీనినిజాతీయ సగటు 72.99%తో పోల్చగాఎక్కువ ఉంది.[7] పట్టణంలోమొత్తం 19,841 గృహాలు ఉన్నాయి.మొత్తం జనాభాలో 27,533 మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 54 మంది రైతులు, 64 మంది ప్రధాన వ్యవసాయకార్మికులు, 703 మంది గృహపరిశ్రమలపై ఆధారపడినవారు, 25,266 మంది ఇతర కార్మికులు, 1,446 సన్నకారు కార్మికులు, 17 సన్నకారు రైతులు, 10 మంది సన్నకారు వ్యవసాయ కార్మికులు, 66 మంది ఉపాంత కార్మికులు ఉన్నారు. [8]2004 నాటికి పట్టణంలో గుర్తింపు పొందిన పన్నెండు మురికివాడలు, పదకొండు గుర్తింపు లేని మురికివాడలు ఉన్నాయి. మొత్తం జనాభాలో 17,787 మంది మురికివాడలలో నివసిస్తున్నారు. మురికివాడల జనాభా ప్రధానంగా రోజువారీ కూలీలుగా పనిచేసేవారుగా ఉన్నారు. [9] 2001లో హెక్టారుకు 114 మంది జనాభా సాంద్రత ఉంది [10]

2011 మతపరమైన జనాభా లెక్కల ప్రకారం, విరుదునగర్ పురపాలక సంఘ పరిధిలో 85.02% మంది హిందువులు,7.73% మంది ముస్లింలు, 7.09% మంది క్రైస్తవులు, 0.02% మంది సిక్కులు, 0.14% మంది ఇతర మతాల అనుసరిస్తున్నారు.[11]

విరుదునగర్ పట్టణం పరిసర ప్రాంతాలకు వాణిజ్య సేవా పట్టణం. ఇది తమిళనాడు ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతాలలో ఇది ఒకటి. తరువాత కోయంబత్తూర్, సేలం ఉన్నాయి. అనేక రకాల సుగంధ ద్రవ్యాలు, వనస్పతి నూనెలు జాతీయ, అంతర్జాతీయ వాణిజ్యం కోసం తయారవుతాయి. అగ్గిపెట్టెకర్మాగారాలు ఉన్నాయి. [12] వాణిజ్య కార్యకలాపాలు కట్చేరి వీధి, పుల్లలకోట్టై వీధి, ప్రధాన బజార్ చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. [13] స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వంటి అన్ని ప్రధాన జాతీయ బ్యాంకులు, తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులు విరుదునగర్‌లో శాఖలను కలిగి ఉన్నాయి.ఈ బ్యాంకులన్నింటికీ పట్టణం లోని పలు ప్రాంతాల్లో ఏటీఎంలు ఉన్నాయి. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ 1940 నుండి దాని శాఖను కలిగిఉన్న మొదటి బ్యాంక్. [14] విరుదునగర్ కమీషన్ వ్యాపారం తృణ ధాన్యాలు, పత్తి, వనస్పతి నూనెలుకు ప్రసిద్ధి చెందింది. ఇటీవలి సంవత్సరాలలో, విరుదునగర్ ఇ-కామర్స్‌లో కూడా స్థానం పొందింది.

ఆసక్తికరమైన ప్రదేశాలు

[మార్చు]
temple tank with a hall in the centre
విరుదునగర్‌లోని మారియమ్మన్ టెంపుల్ ట్యాంక్
  • ఒక పురాతన శివాలయం అరుల్మిగు శ్రీ మీనాక్షి చొక్కనాథస్వామి ఆలయం 1000 సంవత్సరాల పురాతన ఆలయం
  • పరాశక్తి మరియమ్మన్ దేవాలయం పట్టణం మధ్యలో ఉంది. [15]
  • కామరాజ్ ఇల్లు స్మారక చిహ్నంగా మార్చబడింది. ఇది విరుదునగర్‌లోని ప్రముఖ సందర్శకుల ఆకర్షణలలో ఒకటి.
  • కుల్లూర్‌సండై ఆనకట్ట అనేక వలస పక్షులను ఆకర్షిస్తుంది.

పరిపాలన, రాజకీయాలు

[మార్చు]
పురపాలక సంఘ అధికారులు
చైర్మన్ జి. శాంతి [16]
కమీషనర్ ఎ. సర్దార్ [17]
ఉపాధ్యక్షుడు ఎస్. మారియప్పన్ [18]
ఎన్నికైన సభ్యులు
శాసన సభ సభ్యుడు ఎ.ఆర్.ఆర్. శ్రీనివాసన్ [19]
పార్లమెంటు సభ్యుడు మాణికా ఠాగూర్ [20]

విరుదునగర్ పురపాలక సంఘం (గతంలో విరుదుపట్టి పురపాలక సంఘం) 1915లో మూడవ తరగతి పురపాలక సంఘంగా స్థాపించబడింది. ఇది1956లో రెండవ తరగతి పురపాలక సంఘగా, 1998లో ప్రత్వేక తరగతి పురపాలక సంఘంగా ఉన్నతస్థాయి పొందింది. [21] విరుదునగర్ పట్టణం విరుదునగర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. నియోజకవర్గ ప్రస్తుత శాసనసభ్యుడు గా డిఎంకె పార్టీ నుండి ఎన్నికైన ఎ.వి.ఆర్. శ్రీనివాసన్ కొనసాగుచున్నాడు. విరుదునగర్ ఇప్పుడు విరుదునగర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యురాలు మాణిక్క ఠాగూర్ ప్రస్తుతం కొనసాగుతుంది. [20]

ప్రధాన రహదారులలో జాతీయ రహదారి 44, మూడు జిల్లా రహదారులు ఉన్నాయి, ఇవి విరుదునగర్‌ను శివకాశి, మదురై, రాజపాళయం, అరుప్పుక్కోట్టై, సత్తూర్ వంటి పొరుగు పట్టణాలను కలుపుతాయి. విరుదునగర్ నుండి కల్లుపట్టిని కలుపుతూ పట్టణానికి పశ్చిమాన ఉప రహదారి సదుపాయం ఉంది. ఇది పట్టణంలో వాహనాల రద్దీని తగ్గిస్తుంది. [22]

తమిళనాడు రోడ్డు రవాణా సంస్థ చెన్నై, తిరుప్పూర్, తూత్తుకుడి వంటి ముఖ్యమైన నగరాలకు వెల్లూర్ పట్టణాన్ని కలుపుతూ సుదూర బస్సులను నడుపుతోంది.[23] పట్టణం నుండి మదురై, చెన్నై, రాజపాళయం, తెన్కాసి, కోవిల్‌పట్టి, టుటికోరిన్, తిరుచెందూర్, నాగర్‌కోయిల్, తిరునల్వేలి, అరుప్పుకోట్టై, రామేశ్వరం వంటి ప్రక్కనే ఉన్న నగరాలకు ప్రధాన అంతర్గత నగర బస్సు మార్గాలు ఉన్నాయి. [24]

విరుదునగర్ రైల్వే స్టేషన్ మధురై నుండి కన్యాకుమారి వరకు ప్రధాన రైలు మార్గంలో ఉంది.దక్షిణ రైల్వే చెన్నై, టుటికోరిన్, కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్కాసి, గురువాయూర్, తిరుపతి, ముంబై, త్రివేండ్రం,మైసూరు, హౌరా, పాలక్కాడ్, కోజికోడ్, కన్నూర్, మంగళూరు, మడ్గావ్, నిజాముద్దీన్ వంటి ప్రాంతాలకు రోజువారీ సత్వర రైళ్లను నడుపుతోంది. మదురై, తెన్‌కాసి, కొల్లాం, తిరునెల్వేలి, కుంభకోణం, మైలదుత్తురై, ఈరోడ్, నాగర్‌కోయిల్, కోయంబత్తూరుకు ఈ పట్టణాన్ని కలుపుతూ సాధారణ ప్రయాణికుల రైళ్లు నడుస్తాయి. [24] సమీప విమానాశ్రయం 45 కి.మీ. (28 మై.) దూరంలో మధురై విమానాశ్రయం ఉంది. [25]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Urban Infrastructure Report 2008, pp. 10–11
  2. "Historical moments". Virudhunagar municipality. 2011. Archived from the original on 2014-03-22. Retrieved 2012-12-29.
  3. V., Vriddhagirisan (1995) [1942]. Nayaks of Tanjore. New Delhi: Asian Educational Services. p. 115. ISBN 81-206-0996-4.
  4. Markovits, Claude (2004), A History of Modern India, 1480–1950, London: Wimbledon Publishing Company, p. 253, ISBN 1-84331-152-6
  5. "Historical moments". Virudhunagar municipality. 2011. Archived from the original on 2014-03-22. Retrieved 2012-12-29.
  6. "About city". Virudhunagar municipality. 2011. Archived from the original on 2013-10-16. Retrieved 2012-12-29.
  7. 7.0 7.1 "Census Info 2011 Final population totals". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
  8. "Census Info 2011 Final population totals – Virudhunagar". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
  9. Urban Infrastructure Report 2008, p. 48
  10. Urban Infrastructure Report 2008, pp. 6–10
  11. "Population By Religious Community – Tamil Nadu" (XLS). Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2011. Retrieved 13 September 2015.
  12. "Virudhunagar industries". Virudhunagar municipality. 2011. Archived from the original on 2013-10-16. Retrieved 2012-12-29.
  13. "Virudhunagar markets". Virudhunagar municipality. 2011. Archived from the original on 2013-10-16. Retrieved 2012-12-29.
  14. "Banks in Virudhunagar". Virudhunagar municipality. Archived from the original on 2013-10-16. Retrieved 2012-07-02.
  15. "Virudhunagar places of interest". Virudhunagar municipality. 2011. Archived from the original on 2013-10-17. Retrieved 2012-12-29.
  16. "Chairman of municipality". Virudhunagar municipality. 2011. Archived from the original on 2009-10-04. Retrieved 2012-12-29.
  17. "Commissioner of municipality". Virudhunagar municipality. 2011. Archived from the original on 2012-12-06. Retrieved 2012-12-29.
  18. "Vice Chairman of municipality". Virudhunagar municipality. 2011. Archived from the original on 2011-08-20. Retrieved 2012-12-29.
  19. "MLA of Virudhunagar". Archived from the original on 2019-05-14. Retrieved 2023-03-20.
  20. 20.0 20.1 "Members of Lok Sabha from Tamil Nadu". Government of Tamil Nadu. 2014. Retrieved 26 May 2014.
  21. "About the municipality". Virudhunagar municipality. 2011. Archived from the original on 2012-12-07. Retrieved 2012-12-29.
  22. Urban Infrastructure Report 2008, p. 12
  23. "Bus service to Tuticorin and Sivakasi". The Hindu. 27 October 2007. Archived from the original on 28 October 2007. Retrieved 2012-12-29.
  24. 24.0 24.1 "Virudhunagar bus routes". Virudhunagar municipality. 2011. Archived from the original on 2009-10-05. Retrieved 2012-12-29.
  25. "Virudhunagar bus stand". Virudhunagar municipality. 2011. Retrieved 2012-12-29.[permanent dead link]

వెలుపలి లంకెలు

[మార్చు]