విలాస్ డాంగ్రే
విలాస్ డాంగ్రే | |
|---|---|
| జననం | విలాస్ డాంగ్రే 1954 (age 71–72) చందుర్‌బజార్, అమరావతి జిల్లా, మహారాష్ట్ర |
| జాతీయత | |
విలాస్ డాంగ్రే మహారాష్ట్ర రాష్ట్రం నాగ్‌పూర్‌కు చెందిన హోమియోపతి వైద్యుడు. ఆయన వైద్యరంగంలో చేసిన సేవకుగాను 2025 సంవత్సరానికి కేంద్రం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డును జనవరి 25న ప్రకటించింది.[1][2][3]
జననం, విద్యాభాస్యం
[మార్చు]విలాస్ డాంగ్రే 1954లో అమరావతి జిల్లాలోని చందుర్‌బజార్ పట్టణంలో జన్మించాడు. ఆయన నాగపూర్‌లోని హోమియోపతి కాలేజీ నుండి వైద్య విద్యను పూర్తి చేశాడు. విలాస్ డాంగ్రే ఏడు సంవత్సరాల వయస్సులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) లో చేరాడు.
వృత్తి జీవితం
[మార్చు]డాక్టర్ విలాస్ డాంగ్రే నాగ్‌పూర్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా హోమియోపతి వైద్యంలో మంచి గుర్తింపు తెచ్చుకొని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, బాలాసాహెబ్ థాకరే, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మాజీ ఎంపీ విలాస్ ముత్తెంవార్‌తో సహా మహారాష్ట్రకు చెందిన అనేక మంది రాజకీయ నాయకులకు చికిత్స చేశాడు.[3]
అవార్డులు
[మార్చు]- 2016 : మైత్రీ గౌరవ్ పురస్కార్[4]
- 2019 : సత్సంగ్ పురస్కారం[5]
- 2025 : పద్మశ్రీ పురస్కారం[6]
మూలాలు
[మార్చు]- ↑ "పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం -". 25 January 2025. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
- ↑ "Full list of Padma Awards 2025" (in Indian English). The Hindu. 25 January 2025. Archived from the original on 25 January 2025. Retrieved 25 January 2025.
- ↑ 3.0 3.1 "Dr Vilas Dangre, the healer behind PM Narendra Modi's voice, honoured with Padma Shri". The Times of India. 26 January 2025. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
- ↑ "Keep tradition of serving society alive: Bhagwat". The Times of India. 28 December 2016. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
- ↑ "'Dr Dangre's serviceto society is exemplary'". The Times of India. 26 November 2019. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
- ↑ "महाराष्ट्राच्या शिरपेचात मानाचा तुरा, 3 जणांना पद्मभूषण, तर 11 जणांना पद्मश्री जाहीर". 25 January 2025. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.