విలియం కోల్గేట్
విలియం కోల్గేట్ (జనవరి 25,1783-మార్చి 25,1857) అమెరికన్ పారిశ్రామికవేత్త. 1806 సంవత్సరంలో కోల్గేట్-పామోలివ్ కంపెనీని స్థాపించాడు.
ప్రారంభ జీవితం
[మార్చు]విలియం కోల్గేట్ జనవరి 25, 1783 సంవత్సరం ఇంగ్లాండు దేశంలోని హోలింగ్బోర్న్లో జన్మించాడు. అతని తల్లి తండ్రులు రాబర్ట్ కోల్గేట్ (1758-1826), సారా.[1]
వృత్తి
[మార్చు]విలియం కోల్గేట్ 1804 సంవత్సరంలో న్యూయార్క్ నగరానికి వెళ్లి సబ్బు బాయిలర్‌లో అప్రెంటిస్‌గా పనిచేయడం ప్రారంభించాడు. 1806 సంవత్సరంలో విలియం మాన్హాటన్ లోని డచ్ వీధిలో పిండి, సబ్బు, కొవ్వొత్తి వ్యాపారాన్ని ప్రారంభించాడు. 1820 సంవత్సరంలో, అతను జెర్సీ నగరంలోని హడ్సన్ నదిపై పిండి కర్మాగారాన్ని ప్రారంభించి న్యూయార్క్ నగరంలో అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరిగా ఎదిగాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]
కోల్గేట్ ఏప్రిల్ 23,1810 సంవత్సరంన మేరీ గిల్బర్ట్ ను వివాహం చేసుకున్నాడు. వారికి తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు. వారు రాబర్ట్ (1812-1885), గిల్బర్ట్ (1814-1838), సారా (1816-1859), జేమ్స్ (1818-1904), విలియం III (1820-1838), శామ్యూల్ (1822-1897), మేరీ IV (1826-1873), జోసెఫ్ (1828-1865), మార్తా (1831-1837).[2] అతని కుమారుడు రాబర్ట్ 1859 సంవత్సరంలో బ్రోంక్స్‌లోని రివర్‌డేల్-ఆన్-హడ్సన్‌లోని స్టోన్హర్స్ట్ను నిర్మించిన కొద్దికాలానికే కొనుగోలు చేశాడు. ఇది 1983 సంవత్సరంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ హిస్టారిక్ ప్లేసెస్‌లో జాబితా చేయబడింది.[3] రాబర్ట్ కుమారుడు రోములస్ రిగ్స్ కోల్గేట్, కనెక్టికట్‌లోని షారన్ లో కోల్గేట్ మాన్షన్ నిర్మించాడు.[4]
దాతృత్వం
[మార్చు]రోచెస్టర్ నగరానికి హామిల్టన్ లిటరరీ అండ్ థియోలాజికల్ ఇన్స్టిట్యూషన్ (తరువాత మాడిసన్ విశ్వవిద్యాలయం, థియోలాజికల్ సెమినరీ) తరలించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి దానిని నడపడానికి అయ్యే ఖర్చులను తనే భరించాడు. అతని కుమారులు జేమ్స్, శామ్యూల్ ఇద్దరూ ఈ మాడిసన్ విశ్వవిద్యాలయం, థియోలాజికల్ సెమినరీకి కోల్గెట్ తరువాత దాతలుగా ఉన్నారు. ఈ పాఠశాల 1890 సంవత్సరంలో కోల్గేట్ విశ్వవిద్యాలయంగా పేరు మార్చబడింది.[5]
కోల్గెట్ పేస్ట్
[మార్చు]కోల్గేట్-పామోలివ్ వ్యవస్థాపకుడు విలియం కోల్గేట్ మరణించిన పదహారు సంవత్సరాల తర్వాత ఈ కంపెనీ తయారు చేసిన కోల్గేట్ టూత్‌పేస్ట్ ను మొదట 1873 సంవత్సరంలో గాజు జాడిలలో అమ్మేవారు. 1896 సంవత్సరం నుండి ఈ పేస్ట్ ను ట్యూబ్ లలో అమ్ముతున్నారు. కాపీరైటర్ అలిసియా టోబిన్ రాసిన "ఇట్ క్లీన్స్ యువర్ బ్రీత్ వైల్ ఇట్ క్లీన్స్ యువర్ టీత్" అనే నినాదంతో కోల్గేట్ 1950 సంవత్సరంలో చాల ప్రజాదరణ పొందింది.[6]
మూలాలు
[మార్చు]- ↑ Cathcart, William, ed. (2001). The Baptist Encyclopaedia, Volume 1. The Baptist Standard Bearer, Inc. pp. 249–250. ISBN 9781579789091.
- ↑ Abbe, Truman (1941). Robert Colgate, the immigrant; a genealogy of the New York Colgates and some associated lines, compiled by Truman Abbe and Hubert Abbe Howson. Allen County Public Library Genealogy Center. New Haven, Conn., The Tuttle, Moorehouse & Taylor company, 1941.
- ↑ National Park Service (2009-03-13). "National Register Information System". National Register of Historic Places. National Park Service.
- ↑ "Pricetag for Colgate Mansion in Sharon". ctinsider.com. 2012.
- ↑ "History of the University | Origins, People, Campus | Colgate University". www.colgate.edu. Retrieved 2024-02-03.
- ↑ "Our History | Colgate-Palmolive". www.colgatepalmolive.com. Retrieved 2025-04-11.