విలీనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విలీనం అంటే ఒకదానితో మరొకటి ఐక్యమవటం. ఒకే రంగానికి సంబంధించిన రెండు లేదా అంతకు మించిన వాటిని కొన్ని ప్రయోజనాల దృష్ట్యా మిళితం చేయాలనుకున్నప్పుడు ఒకరితో ఒకరు చర్చలు జరుపుకుని ఒకరికొకరు ఆమోదాన్ని తెలిపి వారు నిర్ణయించిన దానితో మరొక దానిని మిళితం చేస్తారు, ఈ విధంగా ఒకదానికి మరొకటి కలపడాన్ని విలీనం చేయడమంటారు. ఒక్కొక్కసారి ఒకరు ప్రతిపాదించిన విలీన ప్రతిపాదనను మరొకరు వ్యతిరేకించినట్లయితే జరగకపోవచ్చు. కాని కొన్ని సందర్భాలలో అభ్యర్థి యొక్క విలీన ప్రతిపాదనను ప్రత్యర్థి వ్యతిరేకించినను బలవంతంగా విలీనం చేయడం జరుగుతుంటుంది, ఈ విధంగా విలీనం చేయడాన్ని "బలవంతపు విలీనం" అంటారు.

విలీన రకాలు[మార్చు]

  • రాజకీయ విలీనాలు - ఒక రాజకీయ పార్టీతో మరొక రాజకీయ పార్టీ విలీనమవడం
  • వ్యాపార విలీనాలు - ఒకే రకానికి చెందిన ఒక వ్యాపార సంస్థ మరో వ్యాపార సంస్థతో విలీనమవడం
  • భూభాగ విలీనాలు - ఒక దేశం భూభాగంలో మరొక దేశ భూభాగం విలీనమవడం
  • బలవంతపు భూవిలీనాలు - ఉదాహరణకు భారతదేశ భూభాగంలో కలవని హైదరాబాద్ సంస్థానాన్ని భారత ప్రభుత్వం బలవంతంగా భారతదేశం లోకి విలీనం చేసుకోవడం.

వికీపీడియాలో[మార్చు]

వికీపీడియా వ్యాసాలలో ఒక వ్యాసంతో మరొక వ్యాసం విలీనం చేయడం సమంజసమని భావించినప్పుడు "విలీనం" మూసను ఉంచి సభ్యులు చర్చలు జరుపుతారు. తెలుగు వికీపీడియాలో విలీనం మూస ఉంచబడిన మొత్తం వ్యాసాలు విలీనము చేయవలసిన వ్యాసములు అనే వర్గంలో కనిపిస్తాయి. అలాగే తెలుగు వికీపీడియాలో ఫలాన వ్యాసం యొక్క విలీన ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాను అని స్పష్టంగా తెలియపరచుటకు విలీనం చేయకూడని వ్యాసములు అని మరొక వర్గం ఉంది.

"https://te.wikipedia.org/w/index.php?title=విలీనం&oldid=2558260" నుండి వెలికితీశారు