Jump to content

విల్సన్ వ్యాధి

వికీపీడియా నుండి
విల్సన్ వ్యాధి
ఇతర పేర్లు విల్సన్ వ్యాధి, హెపాటోలెంటిక్యులర్ డిజెనరేషన్
కార్నియా అంచున గోధుమ రంగు రింగ్ (కేసర్-ఫ్లీషర్ రింగ్) విల్సన్ వ్యాధిలో సాధారణం, ముఖ్యంగా నరాల లక్షణాలు ఉన్నప్పుడు.
ప్రత్యేకతలు. గ్యాస్ట్రోఎంటరాలజీ
లక్షణాలు కాళ్ళు వాపు, పసుపు రంగు చర్మం, వ్యక్తిత్వ మార్పులు [1]
సాధారణ ప్రారంభం 5 నుండి 35 సంవత్సరాల వయస్సు [1]
కారణాలు జన్యుపరమైన [1]
భేదాత్మక రోగ నిర్ధారణ దీర్ఘకాలిక కాలేయ వ్యాధి, పార్కిన్సన్స్ వ్యాధి, మల్టిపుల్ స్క్లెరోసిస్, ఇతరులు [2][3]
చికిత్స ఆహార మార్పులు, చెలేటింగ్ ఏజెంట్లు, జింక్ సప్లిమెంట్స్, కాలేయ మార్పిడి [1]
ఫ్రీక్వెన్సీ ~ 30,000 కు 1 [1]

విల్సన్ వ్యాధి అనేది ఒక జన్యు రుగ్మత, దీనిలో శరీరంలో అదనపు రాగి పెరుగుతుంది.[1] లక్షణాలు సాధారణంగా మెదడు, కాలేయానికి సంబంధించినవి.[1] కాలేయ సంబంధిత లక్షణాలలో వాంతులు, బలహీనత, పొత్తికడుపులో ద్రవం పెరగడం, కాళ్ళు వాపు, పసుపు రంగు చర్మం, దురద ఉంటాయి.[1] మెదడు సంబంధిత లక్షణాలలో ప్రకంపనలు, కండరాల దృఢత్వం, మాట్లాడటంలో ఇబ్బంది, వ్యక్తిత్వ మార్పులు, ఆందోళన, వాస్తవికతతో సంబంధం కోల్పోవడం వంటివి ఉంటాయి.[1]

విల్సన్ వ్యాధి అనేది విల్సన్ వ్యాధి ప్రోటీన్ (ATP7B) జన్యువు ఒక ఉత్పరివర్తన వలన సంభవిస్తుంది.[1] ఈ ప్రోటీన్ అదనపు రాగిని పిత్తంలోకి రవాణా చేస్తుంది, ఇక్కడ ఇది వ్యర్థ ఉత్పత్తులలో విసర్జించబడుతుంది.[1] ఈ పరిస్థితి ఆటోసోమల్ రిసెసివ్, ఒక వ్యక్తి ప్రభావితం కావాలంటే, వారు తల్లిదండ్రులిద్దరి నుండి జన్యువు పరివర్తన చెందిన కాపీని వారసత్వంగా పొందాలి.[1] రోగనిర్ధారణ కష్టం కావచ్చు, తరచుగా రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, కాలేయ బయాప్సీ కలయికను కలిగి ఉంటుంది.[1] ప్రభావితమైన వారి కుటుంబ సభ్యులను పరీక్షించడానికి జన్యు పరీక్ష ఉపయోగించవచ్చు.[1]

విల్సన్ వ్యాధికి సాధారణంగా ఆహారపు అలవాట్లలో మార్పులు, మందులతో చికిత్స చేస్తారు.[1] ఆహారపు అలవాట్లలో మార్పులలో భాగంగా తక్కువ రాగి ఉన్న ఆహారం తినడం, రాగి వంటపాత్రలను ఉపయోగించకపోవడం ఉంటాయి.[1] ఉపయోగించే మందులలో ట్రైయెంటైన్, డి-పెనిసిల్లామైన్ వంటి కీలేటింగ్ ఏజెంట్లు, జింక్ సప్లిమెంట్లు ఉంటాయి.[1] విల్సన్ వ్యాధి సమస్యలలో కాలేయ వైఫల్యం , కాలేయ క్యాన్సర్, మూత్రపిండాల సమస్యలు ఉండవచ్చు.[1] ఇతర చికిత్సలు ప్రభావవంతంగా లేనివారిలో లేదా కాలేయ వైఫల్యం సంభవించినట్లయితే కాలేయ మార్పిడి సహాయకరంగా ఉండవచ్చు.[1]

విల్సన్ వ్యాధి 30,000 మందిలో 1 మందిలో సంభవిస్తుంది.[1] లక్షణాలు సాధారణంగా 5, 35 సంవత్సరాల మధ్య ప్రారంభమవుతాయి.[1] దీనిని మొట్టమొదట 1854లో జర్మన్ పాథాలజిస్ట్ ఫ్రెడరిక్ థియోడర్ వాన్ ఫ్రెరిచ్స్ వర్ణించారు, దీనికి బ్రిటిష్ న్యూరాలజిస్ట్ శామ్యూల్ విల్సన్ పేరు పెట్టారు.[4]

మూలాలు

[మార్చు]
  1. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 "Wilson Disease". NIDDK. July 2014. Archived from the original on 2016-10-04. Retrieved 2016-11-06.
  2. ↑ Lynn, D. Joanne; Newton, Herbert B.; Rae-Grant, Alexander (2004). The 5-minute Neurology Consult. Lippincott Williams & Wilkins. p. 442. ISBN 9780683307238. Archived from the original on 2016-11-07.
  3. ↑ Sahani, Dushyant V.; Samir, Anthony E. (2016). Abdominal Imaging: Expert Radiology Series (2 ed.). Elsevier Health Sciences. p. 400. ISBN 9780323431613. Archived from the original on 2016-11-07.
  4. ↑ "Whonamedit - dictionary of medical eponyms". www.whonamedit.com. Archived from the original on 2016-11-07. Retrieved 2016-11-06.