విలంబి
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
విలంబి తెలుగు సంవత్సరాలలో 32వ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం హేవిళంబి, తర్వాత సంవత్సరం వికారి. దీని అర్థం సాగదీయడం. సుభిక్షముగా ఉంటుంది. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.
సా.శ. 1898 - 1899, సా.శ. 1958 - 1959, సా.శ 2018-19 లలో వచ్చిన తెలుగు సంవత్సరానికి విలంబి అని పేరు.
2018 : విళంబి నామ సంవత్సరం 18 మార్చి 2018 ఆదివారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై 6 ఏప్రిల్ 2019 శనివారం వికారి నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.
తెలుగు సంవత్సరాలు
[మార్చు]తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.
ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1] క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.
వివిధ సంవత్సరాలలో "విళంబి"
[మార్చు]| తెలుగు సంవత్సరం పేరు | క్రీస్తు శకం | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | |
| 32 | విలంబి | 38-39 | 98-99 | 158-159 | 218-219 | 278-279 | 338-339 | 398-399 | 458-459 | 518-519 | 578-579 | 638-639 | 698-699 | 758-759 | 818-819 | 878-879 | 938-939 | 998-999 | 1058-1059 | 1118-1119 | 1178-1179 | 1238-1239 | 1298-1299 | 1358-1359 | 1418-1419 | 1478-1479 | 1538-1539 | 1598-1599 | 1658-1659 | 1718-1719 | 1778-1779 | 1838-1839 | 1898-1899 | 1958-1959 | 2018-2019 | 2078-2079 | 2138-2139 | 2198-2199 | 2258-2259 | 2318-2319 | 2378-2379 | 2438-2439 | 2498-2499 | 2558-2559 | 2618-2619 | 2678-2679 | 2738-2739 | 2798-2799 |
సంఘటనలు
[మార్చు]- వైవస్వత మన్వంతరములో ఐదవ మహాయుగములో ముప్పై వేల సంవత్సరములు మిగిలి ఉండగా త్రేతాయుగము నందు"విళంబినామ" సంవత్సర మేషరాశి యందు రవి సంక్రమణ జరుగగా చైత్ర శుక్ల నవమి బుధవారము పునర్వసు నక్షత్రం 4వ పాదములో మధ్యాహ్న సమయంలో కర్కాటక లగ్నంలో 5 గ్రహములు ఉచ్ఛస్థితిలో ఉండగా శ్రీరాముడు జనియించాడు.[3]
- ఆశ్వయుజమాసములో కిర్లంపూడి జమీందారు శ్రీ యినగంటి చిన్నారావుగారు తిరుపతి వేంకట కవులు చేత యష్టావధానము జరిపించారు.[4]
జననాలు
[మార్చు]- చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రంలో కౌసల్యా తనయుడైన శ్రీరాముడు జన్మించడం.[5]
- ఆశ్వయుజ శుద్ధ దశమి : త్రిమతాచార్యులలో మూడవవాడైన మధ్వాచార్యులు క్రీ. శ. 1238 లో జన్మించారు.
- వైశాఖ శుద్ధ పంచమి : దువ్వూరి వేంకటరమణ శాస్త్రి - సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు
మరణాలు
[మార్చు]పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]2018-19
[మార్చు]సెలవుల జాబితా ప్రకారం 2018-19 సంవత్సరంలో వచ్చే విళంబినామ సంవత్సరంలో వివిధ పండుగలు ఈ క్రింది విధంగా నిర్ణయించబడినవి.
జాబితా ప్రకారం. 2018 మార్చి 18- ఉగాది, 25న స్మార్తానాం శ్రీరామ నవమి, 26న వైష్ణవానాం శ్రీరామ నవమి, ఏప్రిల్ 18న అక్షయ తృతీయ, మే 10న హనుమాన్ జయంతి, జూలై 27న వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ, 29, సికింద్రాబాద్ మహంకాళి జాతర, ఆగస్టు 24 వరలక్ష్మీ వ్రతం, 26న రాఖీ పూర్ణిమ, సెప్టెంబరు 2 స్మార్తానాం శ్రీకృష్ణాష్టమి, 3న వైష్ణవానాం శ్రీకృష్ణాష్టమి, 13న వినాయక చవితి, అక్టోబరు 17న దుర్గాష్టమి, 18న విజయ దశమి, నవంబరు 6న దీపావళి, 23 న కార్తీక పౌర్ణమి, 2019 జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ, 12న రథ సప్తమి, మార్చి 4 మహా శివరాత్రి, 19న కామదహనం (దక్షిణాది వారికి), 20న కామదహనం (ఉత్తరాదివారికి), 21న హోలీ.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Telugu Year Names". Retrieved 4 February 2013.
- ↑ "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
- ↑ "శ్రీ రామ జనన సంవత్సర(విళంబి నామ సంవత్సర) కళ్యాణ వైభవ మహోత్సవము - Telugu Ap Herald". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-09-25.
- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 69. Retrieved 27 June 2016.
- ↑ "విళంబి మాఘ పునర్వసుకు విశిష్టత - Eenadu". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-09-15.
- ↑ pnr. "విళంబి నామసంవత్సరం.. ఏ పండుగ.. ఏ తేదీలో..." telugu.webdunia.com. Retrieved 2020-09-15.