విశ్వనాథం సుందరశివరామ శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీ విశ్వనాథం సుందరశివరామ శర్మ (1901-1943) గారి తండ్రి కీ.శే మంగయ్య గారు తల్లి కీ.శే.సూరమ్మ గారు. వీరు బ్రిటీష్ పాలనలో జిల్లా కోర్టులో హెడ్ క్లర్కు గా పనిచేసేవారు. శ్రీ సుందర శివరామ శర్మ గారు మద్రాసు రాష్ట్రంలో కోష్టల్ ఆంధ్ర లో మొట్టమొదటి ఆడీటరుగా సేవలు అందించారు. వీరు బ్రిటీష్ వారి జి.డి.ఏ పట్టాతో(స్వాతంత్ర్యం వచ్చాక చార్టడ్ అక్కౌంటెంట్ గా గుర్తింపు బడిన పట్టా) వృత్తికి అంటే ఈ నాటి చార్టర్డ్ అక్కౌంటెంట్ వృత్తికి బీజం వేసిన ఆడీటరుగా గణతికెక్కి, ఎంతోమందికి ఈ వృత్తిని పరిచయం చేసిన మహానీయులు. ఆనాటి తిరుమల తిరుపతి కౌన్సిల్ (నేటి తితిది)కి, నగరంలోని పేపర్ మిల్లుకి, ఏలూరు జ్యూట్మిల్లుకి తదితర సంస్థలకు ఆడీటర్ గా సేవలు అందిస్తూ, రాజమండ్రి కేంద్రంగా ఎంతో మందికి సిఎ వృత్తి వైపు రావడానికి మార్గం దర్శకులు. ఎన్నో గుప్తదానాలు చేసేవారని ప్రతీతి. వీరి భార్య కీ.శే కేదారేశ్వరి గారు (అప్పటి రాయపూర్ దివాన్ జీ కుమార్తె). వీరికి ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు. వీరికి ఇద్దరు సోదరులు, నలుగురు సోదరీమణులు. వీరి సోదరుడు కీ.శే. భాస్కర రామ శర్మగారు జి.డి.ఏ (దేశ స్వాతంత్ర్యం వచ్చాక సి.ఎ గా నిర్ధారించ బడింది). ఈ సోదరులు పట్టా పొందిన, శర్మ అండ్ కో భూస్వామ్య సంస్థను స్థాపించి వృత్తి కొనసాగించారు. ఈ భాగస్వామ్య సంస్థ ద్వారా తయారైన సీఏ లు దేశం లో ప్రముఖ ఆడీటర్లు గా వృత్తి సేవలు అందిస్తున్నారు.ఉదా: ముంబాయిలో ఆడీటర్లు షా&శాస్త్రి మొ.వారు. వీరి వంశీకులలో చాలమంది సి.ఏ పట్టా పొంది, దేశ విదేశాలలో ఈ వృత్తి సేవలు అందిస్తున్నారు.