విశ్వనాథ్ జిల్లా
విశ్వనాథ్ జిల్లా | |
---|---|
అసోం రాష్ట్ర జిల్లా | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అసోం |
డివిజన్ | ఉత్తర అసోం |
జిల్లా ఏర్పాటు | 15 ఆగస్టు 2015 |
ముఖ్యపట్టణం | విశ్వనాథ్ చారియాలి |
Government | |
• డిఫ్యూటి కమీషనర్ | ప్రణబ్ కుమార్ శర్మ,[1] కమీషనర్ |
విస్తీర్ణం | |
• Total | 1,100 కి.మీ2 (400 చ. మై) |
Elevation | 48 - 849 మీ (157 - 2,787 అ.) |
జనాభా (2011) | |
• Total | 6,12,491 |
భాషలు | |
• అధికారిక | అస్సామీ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Website | biswanath.gov.in |
విశ్వనాథ్ జిల్లా, అసోం రాష్ట్ర్రంలోని నూతనంగా ఏర్పడిన ఒక జిల్లా. దీని ముఖ్య పట్టణం విశ్వనాథ్ చారియాలి. 2015, ఆగస్టు 15న అస్సాం ముఖ్యమంత్రి ప్రకటించిన కొత్త జిల్లాలలో ఇది ఒకటి.[2][3] పాత సోనిత్‌పూర్ జిల్లాలోని గోహ్పూర్, విశ్వనాథ్ సబ్ డివిజనులోని ఎక్కువ భాగం కలిపి ఈ జిల్లాగా ఏర్పాటు చేయబడింది. ఈ జిల్లాకు ఉత్తరాన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర జిల్లా గోలఘాట్, దక్షిణాన బ్రహ్మపుత్రా నది, తూర్పున లఖింపూర్ జిల్లా, పశ్చిమాన సోనిత్‌పూర్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లా పరిపాలన ప్రధాన కార్యాలయం విశ్వనాథ్ చారియాలి వద్ద ఉంది.
చరిత్ర
[మార్చు]16వ శతాబ్దంలో అహోమ్స్ చేజిక్కించుకునే వరకు చుటియా రాజ్యంలో ఈ ప్రాంతం భాగంగా ఉండేది. జిల్లా పశ్చిమ భాగమంతా స్వతంత్ర భూయాన్ అధిపతుల పాలనలో ఉండేది. చుటియా రాజ్యం, భూయాన్ రాజ్యాల మధ్య డికారాయ్[4], గిలాధరి నదులు సరిహద్దులుగా గుర్తించబడ్డాయి.[5] చుటియా రాజులు ఈ ప్రాంతంలో అనేక కోటలను నిర్మించారు, ఇందులో బురోయ్ కోట (డఫ్లా కొండల సమీపంలో)[6], ప్రతాప్ కోటలను రాజు ప్రతాప్ నారాయణ్ నిర్మించాడు.[7][8]
పరిపాలన
[మార్చు]- ప్రధాన కార్యాలయం
- విశ్వనాథ్ చారియాలి
- ఉప విభాగాల పేరు
- విశ్వనాథ్ చారియాలి, గోహ్పూర్
- రెవెన్యూ సర్కిల్స్/తహసిల్స్ పేరు
- విశ్వనాథ్ చారియాలి, గోహ్పూర్, హెలెం
- అభివృద్ధి విభాగాలు
- పబ్-చైదువార్ అభివృద్ధి విభాగం
- చైదువర్ అభివృద్ధి విభాగం
- బెహాలి అభివృద్ధి విభాగం
- బాగ్మోరా అభివృద్ధి విభాగం
- విశ్వనాథ్ అభివృద్ధి విభాగం
- సకోమోథా అభివృద్ధి విభాగం
- సోటియా అభివృద్ధి విభాగం
- పోలీసు స్టేషన్ల పేర్లు
- గోహ్పూర్ పోలీస్ స్టేషన్
- హెలెం పోలీస్ స్టేషన్
- బెహాలి పోలీస్ స్టేషన్
- గింజియా పోలీస్ స్టేషన్
- విశ్వనాథ్ చారియాలి పోలీస్ స్టేషన్
- సూటియా పోలీస్ స్టేషన్
- హవాజన్ పోలీస్ అవుట్‌పోస్ట్
- బోర్గాంగ్ పోలీస్ అవుట్‌పోస్ట్
- గ్రామాల సంఖ్య
- 832
- పట్టణాల పేర్లు
- విశ్వనాథ్ చారియాలి, గోహ్పూర్
- పట్టణ కమిటీల పేరు
- విశ్వనాథ్ చారియాలి, గోహ్పూర్
రైల్వే స్టేషన్లు
[మార్చు]- దుబియా
- గోహ్పూర్
- బ్రహ్మజన్
- హెలెం
- నిజ్ బోర్గాంగ్
- మోనబారి
- విశ్వనాథ్ చారియాలి
- నిజ్ సోటియా
మూలాలు
[మార్చు]- ↑ https://biswanath.gov.in/contact-us
- ↑ http://www.dnaindia.com/india/report-cm-tarun-gogoi-announces-5-new-districts-in-assam-on-independence-day-2114724
- ↑ http://zeenews.india.com/news/assam/assam-gets-five-more-districts_1647470.html
- ↑ Baruah, Swarnalata. Comprehensive History of Assam,1986, p. 193.
- ↑ Neog, Maheswar. Early History of the Vaisnava Faith and Movement in Assam,1965, p. 66.
- ↑ Basu, Nagendra Nath. Thee Social History of Kamrupa,1988, p. 271.
- ↑ Bilgrami, Syaed Ali. Journal Of The Asiatic Society Of Bengal,1904, p. 258.
- ↑ The stone inscription found in Umatamani, Biswanath states that a king named Lakshminah was crowned as the Lord of Pratapapura(Pratapapura-adhikari Dalapati Shri Lakshminah). This was none other than the Chutia king Lakshminarayan