విశ్వనాథ్ సూరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విశ్వనాథ్ సూరి ప్రముఖ తెలంగాణ విమోచనోద్యమ నాయకుడు, రాజకీయనేత. ఇతను కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో జన్మించాడు.[1] నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆదిలాబాదు జిల్లా చెన్నూరు కేంద్రంగా అనేక పోరాటాలు చేసిన యోధుడు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిననూ తెలంగాణ ప్రజలు ఇంకనూ బానిసల వలె బ్రతుకుతూ ఎలాంటి స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు లేకుండా మ్రగ్గుతూ జీవించే దారుణ పరిస్థితిని చూసి దానికి కారకుడైన నిజాంనవాబుపైనే ఉద్యమం చేపట్టాడు. ఆయన ఉద్యమాలు నిజాంపాలకులను దడ పుట్టించాయి. రజాకార్ల దురంగతాల సమయంలో చెన్నూరులో ప్రస్తుతం గాంధీచౌక్‌గా పిలువబడే అంగడిబజారులో విశ్వనాథ్ సూరి మొదటిసారి జాతీయపతాకాన్ని ఎగురవేశాడు [2] అక్కడి నుంచి పోరాటాన్ని మరింత ఉధృతం చేశాడు. చివరికి నిజాంనవాబు సెప్టెంబరు 17, 1948న భారతప్రభుత్వానికి తలవంచడంతో సూరి లక్ష్యం నెరవేరినట్లయింది.

1952లో జరిగిన తొలి శాసనసభ ఎన్నికలలో విశ్వనాథ్ సూరి సోషలిస్ట్ పార్టీ తరఫున అప్పటి ఉమ్మడి నియోజకవర్గమైన లక్సెట్టిపల్లి-చెన్నూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. తర్వాత 1965-70 కాలంలో ఐరేళ్ళి మార్కెటింగ్ కమిటీ చైర్మెన్‌గా పనిచేశాడు.

మూలాలు

[మార్చు]
  1. ఆదిలాబాదు జిల్లా స్వాతంత్ర్యోద్యమ చరిత్ర, పేజీ 115
  2. ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఆదిలాబాదు జిల్లా టాబ్లాయిడ్, తేది 17-09-2009