అక్షాంశ రేఖాంశాలు: 34°23′17″N 75°07′08″E / 34.388119°N 75.11875°E / 34.388119; 75.11875

విషాన్సర్ సరస్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విషాన్సర్ సరస్సు
విషాన్సర్ సరస్సు is located in Jammu and Kashmir
విషాన్సర్ సరస్సు
విషాన్సర్ సరస్సు
ప్రదేశంగందర్బల్ జిల్లా, కాశ్మీరు లోయ,జమ్మూ కాశ్మీరు
అక్షాంశ,రేఖాంశాలు34°23′17″N 75°07′08″E / 34.388119°N 75.11875°E / 34.388119; 75.11875
సరస్సులోకి ప్రవాహంకృషాన్సర్ సరస్సు
వెలుపలికి ప్రవాహంనీలం నది
గరిష్ట పొడవు1 కిలోమీటరు (0.62 మై.)
గరిష్ట వెడల్పు0.6 కిలోమీటర్లు (0.37 మై.)
ఉపరితల ఎత్తు3,710 మీటర్లు (12,170 అ.)
ఘనీభవనండిసెంబర్ నుండి ఏప్రిల్

విషాన్సర్ సరస్సు జమ్మూ కాశ్మీర్ లోని గందర్బల్ జిల్లాలో గల సోనామార్గ్ పరిసరాల్లో ఉంది. ఇది గరిష్టంగా 1 కిలోమీటర్ పొడవు, 0.6 కిలోమీటర్ల వెడల్పు కలిగి, సముద్రమట్టానికి 3710 మీటర్ల ఎత్తులో ఉంది.[1]

పేరు - అర్థం

[మార్చు]

విషాన్సర్ అనే పదం విష్ణుసర్ అనే పదం నుండి వచ్చింది. కాశ్మీరీ భాషలో విషాన్సర్ అంటే విష్ణు సరస్సు అని అర్థం. కాశ్మీరులో ఉన్న పండితులు ఈ సరస్సును చాలా పవిత్రంగా భావిస్తారు.[2]

భౌగోళికం

[మార్చు]

ఈ సరస్సు శీతాకాలంలో పూర్తిగా గడ్డకట్టుకుపోతుంది. వేసవి కాలంలో సరస్సు చుట్టూ పచ్చటి పచ్చికభూములు ఏర్పడుతాయి ఇవి స్థానిక పెంపుడు గొర్రెలకు, మేకలకు ఆహారంగా ఉపయోగపడతాయి. ఇది అనేక రకాల చేపలకు నిలయం వాటిలో బ్రౌన్ ట్రౌట్ వంటి చేపలు ముఖ్యమైనవి. సుందరమైన మంచుతో కప్పబడిన పర్వతాలు, కొండలు, చిన్న హిమానీనదాలు, చుట్టూ పచ్చికభూములు, ఆల్పైన్ పువ్వులతో నిండిన సరస్సు కాశ్మీర్ లోయలో ట్రెక్కింగ్ చేసేవారికి ఒక ఆకర్షణగా ప్రసిద్ధి చెందింది. ఇది కృషాన్సర్ సరస్సు, హిమానీనదాల ద్వారా నిండుతుంది. ఇది ఉత్తరం వైపు బడోబ్ వరకు ప్రవహించి, తరువాత పశ్చిమ దిశలో గురైస్ గుండా వెళ్ళి, చివరకు నీలం నదిలో కలుస్తుంది. ఈ సరస్సుకు 9కిలోమీటర్ల దూరంలో గడ్సర్ సరస్సు ఉంటుంది.[3][4]

ప్రయాణం

[మార్చు]

విషాన్సర్ సరస్సు శ్రీనగర్ నుండి 115 కి.మీ. దూరంలో, షిట్కాడి సోనామార్గ్ నుండి 35 కి.మీ. దూరంలో ఉంది. శ్రీనగర్ విమానాశ్రయం నుండి NH 1D రోడ్డు ద్వారా 80 కి.మీ. ప్రయాణంతో షిట్కాడి గ్రామం చేరుకొని అక్కడి నుండి 35కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి సరస్సును చేరుకోవచ్చు. ఈ సరస్సును సందర్శించడానికి ఉత్తమ సమయం జూన్ నుండి సెప్టెంబర్.[5]

చిత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Raina, HS; KK Vass (May–June 2006). "Some biological features of a freshwater fairy shrimp, Branchinecta schantzi, Mackin, 1952 in the Northwestern Himalayas, India" (PDF). J. Indian Inst. Sci. 86: 287–291. Retrieved 20 April 2012.[permanent dead link]
  2. "go2kashmir, Sonmarg, sonmarg, Accommodation in Sonmarg, Hotel in Sonamarg, Sonmarg attractions,Sonmarg Travel". Go2kashmir.com. Retrieved 2012-04-20.[permanent dead link]
  3. "Fishes and Fisheries in high altitude lakes, Vishansar, Gadsar, Gangabal, Krishansar". Fao.org. Retrieved 20 April 2012.
  4. Petr, T. (1999). Fish and fisheries at higher altitudes : Asia. Rome: FAO. p. 72. ISBN 92-5-104309-4.
  5. Majid Hussain (1998). Geography of Jammu and Kashmir. Rajesh Publications, 1998. p. 13–. ISBN 9788185891163. Retrieved 31 July 2012.