Jump to content

విష్ణువర్ధన్

వికీపీడియా నుండి
విష్ణువర్ధన్
గ్రహణం సినిమా లాంచ్‌లో విష్ణువర్ధన్
జననం
విష్ణువర్ధన్ కులశేఖరన్

(1976-12-06) 1976 December 6 (age 49)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
జాతీయత భారతీయుడు
వృత్తి
  • దర్శకుడు
  • నిర్మాత
  • స్క్రీన్ రైటర్
క్రియాశీలక సంవత్సరాలు1990–ప్రస్తుతం
భాగస్వామిఅను వర్ధన్
పిల్లలు1
బంధువులు

విష్ణువర్ధన్ (జననం 6 డిసెంబర్ 1976) భారతీయ సినిమాత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత, మాజీ బాల నటుడు, ఆయన తమిళ సినిమాలలో పని చేస్తాడు.

సంతోష్ శివన్ తో చాలా కాలంగా సహచరుడిగా ఉన్న ఆయన 2003లో కురుంబు సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు, కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు. ఆయన తదుపరి సినిమాలు అరింథం అరియామాలం (2005), పట్టియాల్ (2006), బిల్లా (2007), పంజా (2011) & అరాంబం (2013) చాలా విజయవంతమైన సినిమాలుగా నిలిచాయి. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మించిన షేర్షా (2021) సినిమాతో హిందీ సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు, దీనికి ఆయన సానుకూల సమీక్షలను అందుకున్నారు, ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

విష్ణువర్ధన్ తమిళనాడులోని చెన్నైలో పుట్టి పెరిగాడు. ఆయన తండ్రి పట్టియల్ కె శేఖర్, నటుడు & నిర్మాత, తమిళ సినిమాలలో పని చేశాడు. ఆయనకు తమ్ముడు నటుడు కృష్ణ కులశేఖరన్ ఉన్నాడు. విష్ణువర్ధన్ చెన్నైలోని సెయింట్ బేడ్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌కు వెళ్లి చెన్నైలోని లయోలా కళాశాలలో విజువల్ కమ్యూనికేషన్ పూర్తి చేశాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

విష్ణువర్ధన్ కాస్ట్యూమ్ డిజైనర్ అను వర్ధన్‌ను వివాహం చేసుకున్నాడు, ఆమె తమిళ నటుడు & గాయకుడు ఎన్.ఎస్. కృష్ణన్ మనవరాలు.[1] అను కళాశాలలో విష్ణువర్ధన్‌కు క్లాస్‌మేట్, సంతోష్ శివన్‌కు అసిస్టెంట్‌గా పని చేసింది.[2] విష్ణువర్ధన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పరిశ్రమలో చేరినప్పుడు "కాలేజీ తర్వాత" వారు వివాహం చేసుకున్నారని పేర్కొన్నాడు.[3] విష్ణువర్ధన్ అన్ని సినిమాలలో అను కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

దర్శకుడిగా & స్క్రీన్ రైటర్ గా

[మార్చు]
సంవత్సరం సినిమా గమనికలు మూ
2003 కురుంబు
2005 అరింథం అరియమలుం
2006 పట్టియల్
2007 బిల్లా
2009 సర్వం
2011 పంజా తెలుగు సినిమా
2013 అర్రంభం
2015 యాచన్ యూటీవీ మోషన్ పిక్చర్స్ తో కూడా నిర్మించబడింది
2021 షేర్షా హిందీ సినిమా [4]
2025 నేసిప్పాయ

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం సినిమా విభాగం గమనికలు
నిర్మాత
2019 ఫింగర్‌టిప్ జీ5 ప్లాట్‌ఫామ్‌లో వెబ్ సిరీస్‌లు

అందుబాటులో ఉన్నాయి[5]

అవార్డులు & నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం అవార్డు విభాగం పని ఫలితం మూ
2014 సైమా అవార్డులు ఉత్తమ దర్శకుడు - తమిళం అర్రంభం ప్రతిపాదించబడింది [6]
2022 IIFA అవార్డులు ఉత్తమ దర్శకుడు షేర్షా గెలుపు [7]
2022 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ దర్శకుడు గెలుపు [8]

మూలాలు

[మార్చు]
  1. "Weaves of fortune". The Hindu. Archived from the original on 2001-12-24.
  2. y. sunita chowdhary (11 December 2011). "Customising fashion". The Hindu.
  3. "Kollywood men pay tribute to women". The Times of India.
  4. "We knew 'Shershaah' had come out well but the response has been overwhelming: Vishnuvardhan".
  5. "'Fingertip' Trailer Video: Akshara Haasan and Gayathrie starrer 'Fingertip' Official Trailer Video". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-12-23.
  6. Shekhar (July 17, 2014). "SIIMA Awards 2014 Nominations". OneIndia. Archived from the original on 25 July 2014. Retrieved July 22, 2014.
  7. IIFA 2022 Nominations: Shershaah takes the lead with 12 Nominations, Ludo and 83 emerge as strong contenders; check out the complete list, 1 April 2022
  8. "67th Filmfare Awards 2022". Filmfare (in ఇంగ్లీష్). Retrieved 30 July 2022.

బయటి లింకులు

[మార్చు]