విష్ణు సదాశివ్ కోక్జే
విష్ణు సదాశివ్ కోక్జే | |
|---|---|
![]() 2008లో విష్ణు సదాశివ్ కోక్జే | |
| హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ | |
| In office 2003 మే 8 – 2008 జూలై 19 | |
| అంతకు ముందు వారు | సూరజ్ భాన్ |
| తరువాత వారు | ప్రభా రావు |
| విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు | |
| అంతకు ముందు వారు | రాఘవ రెడ్ |
| తరువాత వారు | రవీంద్ర నారాయణ్ సింగ్ |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 1939 సెప్టెంబరు 6 ప్రస్తుత మధ్యప్రదేశ్ |
| జాతీయత | భారతీయుడు |
విష్ణు సదాశివ్ కోక్జే (ఆంగ్లం: Vishnu Sadashiv Kokje; జననం 1939 సెప్టెంబరు 6) ఒక భారతీయ న్యాయవేత్త. ఆయన 2003 మే 8 నుండి 2008 జూలై 19 వరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్, విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడిగా పనిచేసాడు.[1][2]
కెరీర్
[మార్చు]విష్ణు సదాశివ్ కోక్జే 1939 సెప్టెంబరు 6న మధ్యప్రదేశ్ లో జన్మించాడు. ఇండోర్ నుండి ఎల్ఎల్బి పూర్తి చేసిన తరువాత 1964లో న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. 1990 జూలై 28న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డాడు. 2001లో 11 నెలల పాటు రాజస్థాన్ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన సెప్టెంబరు 2002లో భారత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యాడు.[3]
ఆయన 2003 మే 8న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ నియమితులయ్యాడు, ఆ పదవిలో 2008 జూలై 19 వరకు కొనసాగాడు.[4] ఆయన భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షుడిగా కూడా పనిచేసాడు.[5] 2018 ఏప్రిల్ 14న శ్రీ రాఘవ్ రెడ్డి తరువాత ఆయన విహెచ్పి అంతర్జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యాడు. 2002లో జాకియా జాఫ్రీ ఎస్సీ కేసులో పని చేస్తున్న ప్రతివాదులలో ఒకరిగా ఆయన పనిచేసాడు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "HIMACHAL PRADESH GOVERNOR LIST". Oneindia.
- ↑ "Padma Shri awardee Rabindra Narain Singh elected as VHP president". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-07-17. Retrieved 2022-11-06.
- ↑ "Governor House, Himachal Pradesh, India - Governors of Himachal Pradesh". himachalrajbhavan.nic.in. Retrieved 2018-04-14.
- ↑ admin (14 April 2018). "Vishnu Sadashiv Kokje becomes new VHP Chief after defeating Raghav Reddy". www.abplive.in.
- ↑ "Bharat Vikas Parishad – Swasth-Samarth-Sanskarit Bharat".
