అక్షాంశ రేఖాంశాలు: 19°08′38″N 72°54′36″E / 19.1440°N 72.910°E / 19.1440; 72.910

విహార్ సరస్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విహార్ సరస్సు
Clouds above Vihar Lake
విహార్ సరస్సు దృశ్యం.
Location of Vihar lake within Mumbai
Location of Vihar lake within Mumbai
విహార్ సరస్సు
ప్రదేశంసంజయ్ గాంధీ జాతీయ ఉద్యాననం, ముంబాయి
అక్షాంశ,రేఖాంశాలు19°08′38″N 72°54′36″E / 19.1440°N 72.910°E / 19.1440; 72.910
రకంరిజర్వాయర్, మంచి నీరు
స్థానిక పేరుविहार तलाव  (Marathi)
సరస్సులోకి ప్రవాహంమితి నది
వెలుపలికి ప్రవాహంమితి నది
పరీవాహక విస్తీర్ణం18.96 కి.మీ2 (7.32 చ. మై.)
ప్రవహించే దేశాలుభారతదేశం
నిర్వహణా సంస్థబృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC)
నిర్మాణం1860
ఉపరితల వైశాల్యం7 కి.మీ2 (2.7 చ. మై.)
గరిష్ట లోతు34 మీ. (112 అ.)

విహార్ సరస్సు ఉత్తర ముంబైలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అని పిలువబడే బోరివాలి నేషనల్ పార్క్ ఆవరణలో మిథి నదిపై విహార్ గ్రామం సమీపంలో ఉంది. దీని నిర్మాణం 1856 లో ప్రారంభమై 1860 లో పూర్తైంది, అప్పట్లో ఇది సాల్సెట్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్‌లో ముంబైలోని అతిపెద్ద సరస్సుగా పరిగణించబడేది. ఇది తులసి సరస్సు, పొవాయి సరస్సుల మధ్య నిర్మించబడింది.

చరిత్ర

[మార్చు]

1845 వేసవి సమయంలో ముంబైలో తీవ్రమైన నీటి కొరత కారణంగా జూన్ 1845 లో స్థానిక నివాసితులు నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో బ్రిటిష్ పాలకులు నియమించిన ఇద్దరు వ్యక్తుల కమిటీ, ఆందోళనకారుల సమస్యతో ఏకీభవించి ముంబై నీటి సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని నొక్కిచెప్పింది.[1]

ప్రభుత్వం నియమించిన కమిటీ ఆనకట్టలను నిర్మించడానికి, మిథి నదీ ప్రవాహాన్ని నిల్వ చేయడంకోసం రిజర్వాయర్లను రూపొందించడానికి తగిన ప్రదేశాలను కనుగొంది, దీని ఫలితంగా ప్రస్తుతం విహార్ సరస్సు, తులసి సరస్సు, పొవై సరస్సలు నిర్మించబడ్డాయి. విహార్ జలాశయం ముంబై మొదటి పైపు నీటి సరఫరా పథకం.

1850 లో, కెప్టెన్ క్రాఫోర్డ్ ముంబై నగర నీటి సరఫరా అవసరాల కోసం విహార్ పథకానికి అనుకూలంగా నివేదికను సమర్పించారు.

"విహార్ వాటర్ వర్క్స్" పని జనవరి 1856 లో ప్రారంభమైంది. 1860 లో జాన్ లార్డ్ ఎల్ఫిన్‌స్టోన్ గవర్నర్ సమయంలో పూర్తయింది.

బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC), సరస్సు వ్యవహారాలను నియంత్రిస్తుంది.[2]

ముంబై నుండి దూరం

[మార్చు]

రోడ్డు మార్గంలో, ఇది ముంబై నుండి 31 కి.మీ. ల దూరంలో ఉంది..[3]

భౌగోళికం

[మార్చు]

విహార్ సరస్సు పరీవాహక ప్రాంతాలలో అన్ని వైపులా ఎత్తైన కొండలు ఉన్నాయి.[4]

ఈ సరస్సులో మంచినీటి మొసళ్లు, మగ్గర్ లేదా మార్ష్ మొసళ్ళు (క్రోకోడిలస్ పాలూస్ట్రిస్) అధిక సంఖ్యలో నివసిస్తాయి. సరస్సులో వాటిని చూడటం కష్టంగా ఉన్నందున, సరీసృపాలను వీక్షించడానికి ఒక మొసలి పార్కు ఏర్పాటు చేయబడింది.

లిమ్నోలజీ

[మార్చు]

1964 లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, నాగ్‌పూర్ నిర్వహించిన లిమ్నోలాజికల్ అధ్యయనాల ప్రకారం కార్బన్ డయాక్సైడ్ దిగువన కంటే ఉపరితలంపై తక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది. శీతాకాలంలో, ఉపరితల నీటిలో ఆల్కలీన్ తక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది ఇది ఆల్గే కిరణజన్య సంయోగ క్రియకు కారణమని చెప్పవచ్చు.[5]

ఒక వింత సంఘటన

[మార్చు]

2006 సంవత్సరంలో, మాహిమ్ క్రీక్ (ఒక పాక్షిక పరివేష్టిత ప్రాంతం) వద్ద మంచినీరు, సముద్రపు నీరు కలిసే చోట తియ్యటి నీరు లభించటం ప్రజలలో చాలా ఉత్సాహాన్ని సృష్టించింది. నీటి నమూనాను విశ్లేషించిన BMC ఆరోగ్య విభాగం, సముద్రపు నీటిలో ఉప్పు స్థాయి మిలియన్‌కు 600 కణాల (ppm) కంటే తక్కువగా ఉందని నిర్ధారించింది.[6]

మూలాలు

[మార్చు]
  1. "History of Water Supply". Mumbai Pages. 21 July 1997. Retrieved 17 June 2018.
  2. http://www.webindia123.com/city/maharashtra/mumbai/around1.htm Mumbai
  3. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 16 February 2012. Retrieved 30 August 2012.{{cite web}}: CS1 maint: archived copy as title (link) A design for echo sustainability: lessons from a stressed environment in Mumbai
  4. "Maharashtra State Gazetteers - Greater Bombay District". Archived from the original on 24 June 2008. Retrieved 20 September 2008. Maharashtra State Gazetteers
  5. Hussainy, S. U. (1967). "Studies on the limnology and primary production of a tropical lake". Hydrobiologia. 30 (3–4): 335–352. doi:10.1007/BF00964021. S2CID 2787988.
  6. http://www.zeenews.com/articles.asp?aid=316456&sid=NAT Sweet` water attracts thousands to Mumbai beach