వి.ఆర్. ప్రతాప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వి.ఆర్. ప్రతాప్
జననం
వంకినేని రత్న ప్రతాప్

మరణంజూలై 4, 2011
వృత్తితెలుగు చలనచిత్ర దర్శకుడు

వి.ఆర్. ప్రతాప్ తెలుగు చలనచిత్ర దర్శకుడు. 2000లో నువ్వు వస్తావని చిత్రం ద్వారా తెలుగు సినిమారంగంలో దర్శకుడిగా అడుగుపెట్టాడు.[1]

సినీరంగ ప్రస్థానం

[మార్చు]

1997లో వచ్చిన పెళ్ళిపందిరి సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేసిన ప్రతాప్, 2000లో అక్కినేని నాగార్జున నటించిన నువ్వు వస్తావని చిత్రంతో దర్శకుడిగా మారాడు. నిన్ను చూడాలని సినిమాతో జూ. ఎన్టీయార్ ను హీరోగా పరిచయం చేశాడు. రాజశేఖర్ హీరోగా వచ్చిన కన్నడ రీమేక్ గోరింటాకు చిత్రం ఆయన చివరి చిత్రం.

దర్శకత్వం చేసినవి

[మార్చు]
  1. నువ్వు వస్తావని (2000)
  2. నిన్ను చూడాలని (2001)
  3. నాలోవున్న ప్రేమ (2001)
  4. స్వామి (2004)
  5. గోరింటాకు (2008)

మరణం

[మార్చు]

కొద్దిరోజులుగా కాన్సర్ తో బాధపడుతున్న ప్రతాప్ 2011, జూలై 4న తెనాలిలోని ఆయన స్వగృహంలో మరణించాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. తెలుగు ఫిల్మీబీట్. "వి.ఆర్. ప్రతాప్". telugu.filmibeat.com. Retrieved 16 May 2018.
  2. తెలుగు ఫిల్మీబీట్. "'నువ్వు వస్తావని' దర్శకుడు వి.ఆర్. ప్రతాప్ మృతి". telugu.filmibeat.com. Retrieved 16 May 2018.
  3. సినీజోష్. "Director VR Pratap Passed away". www.cinejosh.com. Retrieved 16 May 2018.

బయటి లంకెలు

[మార్చు]