వి.కృష్ణమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వెంకటరామన్ కృష్ణమూర్తి (Venkataraman Krishnamurthy) (14 జనవరి 1925 – 26 జూన్ 2022) తమిళనాడు రాష్టంలో జన్మించిన ఒక భారతీయ ప్రభుత్వోద్యోగి. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్), మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్ (ఎంయుఎల్), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్),  గెయిల్ (ఇండియా) లిమిటెడ్ (గెయిల్) లను భారతదేశంలోనే గాక , వాటి స్థితి, గతులను  మార్చడంలో ఎంతో కృషిచేసిన వాడిగా, ప్రపంచములో గుర్తింపు తేవడంలో, లాభాల దిశలలో నడిపించే పరిశ్రమలకు కృషి చేసిన వ్యక్తిగా, "భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థల పితామహుడు"గా పేరుగాంచిన వ్యక్తి.

వెంకటరామన్ కృష్ణమూర్తి
నేషనల్ మాన్యుఫాక్చరింగ్ కాంపిటీటివ్ నెస్ కౌన్సిల్ (ఎన్ ఎమ్ సిసి) చైర్మన్ డాక్టర్ వి. కృష్ణమూర్తి అధ్యక్షతన 2005 ఏప్రిల్ 15న న్యూఢిల్లీలో జరిగిన ఎన్ ఎమ్ సిసి రెండవ సమావేశానికి అధ్యక్షత వహించారు.
జననం(1925-01-14)1925 జనవరి 14
మరణం2022 జూన్ 26(2022-06-26) (వయసు 97)
చెన్నై, తమిళ నాడు,భారతదేశం

జీవితం[మార్చు]

వి కృష్ణమూర్తి 1925 జనవరి 14న కరువేలిలో జన్మించాడు.1943 సంవత్సరంలో సిఎన్ టి టెక్నికల్ ఇన్ స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో మూడేళ్ల డిప్లొమా చేశాడు. ఆ తరువాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణుడై 1955లో సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ లో చేరాడు. సోవియట్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో ఆర్థికశాస్త్రంలో పి.హెచ్.డి పొందాడు.[1]

వృత్తి[మార్చు]

కృష్ణమూర్తి వృత్తి ( కెరీర్)  1944 సంవత్సరంలోటి మద్రాసు ఎలక్ట్రిసిటీ బోర్డులో  ప్రారంభమైంది. ఆ తర్వాత 1954 నుంచి ప్రణాళికా సంఘంలో భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో కలిసి రెండో పంచవర్ష ప్రణాళికలో విద్యుత్ ప్రాజెక్టుల ఇన్ ఛార్జ్ గా, ఆ తర్వాత  ప్రధానులతో  లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ లతో కలిసి భారత ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేయడం జరిగింది.[2]

భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థల పితామహుడు"గా చాలా మందిచే భావించబడుతున్న కృష్ణమూర్తి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఎయిర్ ఫీల్డ్ టెక్నీషియన్ గా తన వృత్తిని ప్రారంభించాడు. వెంటనే, కృష్ణమూర్తి భెల్ లో తన ఉద్యోగం  ప్రారంభించి,  తరువాత చైర్మన్ గా భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్), గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్), మారుతీ ఉద్యోగ్ వంటి పలు ప్రభుత్వ రంగ సంస్థల  చైర్మన్ గా ఉన్నాడు. మారుతి 800 కారు అభివృద్ధిలో కృష్ణమూర్తి కీలక పాత్ర పోషించాడు[3], ఈ కారు భారతీయ కుటుంబాలకు అందుబాటులో ఉండటం, స్వంతం గా కొనే అవకాశం లభించింది. కృష్ణమూర్తి నాయకత్వంలో 1982 సంవత్సరంలో జపాన్ దేశ సుజుకి మోటార్ కార్పొరేషన్ తో జాయింట్ వెంచర్ ఒప్పందంపై సంతకం చేయడం మారుతి ఉద్యోగ్ కు ఒక మైలురాయి గా నిలిచింది[4].

పదవులు[మార్చు]

కృష్ణమూర్తి ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధి చేయడం తో పాటు భారతదేశం లో ప్రసిద్ధ విద్యాసంస్థలు అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అహ్మదాబాద్, బెంగళూర్ (ఐఐఎం బెంగళూరు, అహ్మదాబాద్)లకు చైర్మన్ గా ఉన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీ(ఐఐటి ఢిల్లీ), జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, భువనేశ్వర్; సెంటర్ ఫర్ ఆర్గనైజేషన్ డెవలప్ మెంట్, హైదరాబాద్. టెక్నాలజీ ఇన్ఫర్మేషన్, ఫోర్ కాస్టింగ్ అండ్ అసెస్ మెంట్ కౌన్సిల్ చైర్మన్ గా కూడా ఆయన పనిచేశాడు. తమిళనాడు కేంద్రీయ విశ్వవిద్యాలయం,ఇండియన్ మారిటైమ్ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ గా ఉన్నాడు. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ పదవులలో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్, ప్రెసిడెంట్, అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (నేషనల్ కాలేజ్), తిరుచిరాపల్లి మొదలైన వాటికి పనిచేయడం జరిగింది. ఇవిగాక 2004-08 వరకు జాతీయ సలహా మండలి సభ్యుడిగా,పరిశ్రమల మంత్రిత్వ శాఖలో భారత ప్రభుత్వానికి సభ్యునిగా, ప్రణాళికా సంఘం సభ్యుడిగా, కార్యదర్శిగా పనిచేశాడు. ప్రధాన మంత్రి కౌన్సిల్ ఆన్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, ప్రైమ్ మినిస్టర్స్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ రిలేషన్స్ కమిటీ, ప్రైమ్ మినిస్టర్ ఎనర్జీ కో ఆర్డినేషన్ కమిటీ, మాన్యుఫాక్చరింగ్ పై ప్రధాన మంత్రి ఉన్నత స్థాయి కమిటీ, వాతావరణ మార్పులపై ఉన్నత స్థాయి సలహా బృందంలో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నాడు. భారతదేశంలో పౌర విమానాల రూపకల్పన, తయారీ కోసం ప్రధాన మంత్రి ఏర్పాటు చేసిన బృందానికి ఆయన చైర్మన్ గా ఉన్నాడు.[5]

అవార్డులు[మార్చు]

డాక్టర్ వి.కృష్ణమూర్తి విశిష్ట సేవలకు అవార్డులు, గుర్తింపు లభించాయి.[6]

  • భారత ప్రభుత్వం ప్రదానం చేసిన పౌర పురస్కారాలు 1973లో పద్మశ్రీ, 1986లో పద్మభూషణ్,
  • 2007 సంవత్సరంలో పద్మ విభూషణ్.
  • 1975 సంవత్సరంలో బిజినెస్ లీడర్ షిప్ అవార్డు
  • 1987 సంవత్సరం లో బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్
  • 1989 సంవత్సరంలో స్టీల్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్.
  • ఆల్ ఇండియా మేనేజ్ మెంట్ ద్వారా లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్ ఇన్ మేనేజ్ మెంట్ 2006లో అసోసియేషన్.
  • జపాన్ నుంచి క్వాలిటీ మేనేజ్ మెంట్కొ లో నకాజిమా అవార్డు
  • సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ 2009లో ఆటోమొబైల్ పరిశ్రమకు అసాధారణ సహకారం
  • 2009 సంవత్సరంలో జీవిత సాఫల్య పురస్కారం తో ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆయనను సత్కరించింది.
  • 2009 సంవత్సరంలో రైజింగ్ సన్ జపాన్ ప్రభుత్వంచే అత్యున్నత పురస్కారం గ్రాండ్ కార్డన్ ఆఫ్ ది ఆర్డర్ తో సత్కరించబడింది

మూలాలు[మార్చు]

  1. "Chairperson- Dr. V Krishnamurthy". Indian Institute of Management, Ahmedabad. 1 July 2022. Archived from the original on 2022-10-09. Retrieved 1 July 2022.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Livemint (2022-06-26). "Former SAIL, other PSUs leader V Krishnamurthy passes away at 97". mint (in ఇంగ్లీష్). Retrieved 2022-07-01.
  3. "V Krishnamurthy's contributions to India's story of growth". cnbctv18.com (in ఇంగ్లీష్). 2022-06-27. Retrieved 2022-07-01.
  4. "V Krishnamurthy's contributions to India's story of growth". cnbctv18.com (in ఇంగ్లీష్). 2022-06-27. Retrieved 2022-07-01.
  5. Admin. "V. Krishnamurthy". HarperCollins Publishers India. Retrieved 2022-07-01.
  6. "Dr. V. Krishnamurthy" (PDF). cutn.ac.in/. 1 July 2022. Retrieved 1 July 2022.