వి.నారాయణన్
డాక్టర్. వి.నారాయణన్ | |
---|---|
11.వ చైర్మన్ ఆప్ ది ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ | |
Assumed office 14 January 2025 | |
అంతకు ముందు వారు | ఎస్. సోమనాథ్ |
సీనియర్ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ | |
In office 14 January 2025 – 13 January 2027 | |
అంతకు ముందు వారు | ఎస్. సోమనాథ్ |
డైరెక్టర్ ఆఫ్ లిక్విడ్ ప్రోపల్షన్ సిస్టమ్స్ సెంటర్ | |
In office 23 January 2018 – 13January 2025 | |
అంతకు ముందు వారు | ఎస్. సోమనాథ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | జూలై 1964 (age 60–61) నాగర్ కోయిల్ , మేలట్టువిలై కన్యాకుమారి జిల్లా, తమిళనాడు, ఇండియా |
జీవిత భాగస్వామి | కవితారాజ్ |
సంతానం | కుమార్తె దివ్య, కుమారుడు కాలేష్ |
కళాశాల | ఐఐటీ
ఖరగ్‌పూర్ పశ్చిమ బెంగాల్ లో క్రయోజెనిక్ ఇంజనీరింగ్ లో ఎంటెక్, ఐఐటీ ఖరగ్ పూర్ 2001లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పీహెచ్డీ |
డాక్టర్ వి. నారాయణన్ (జననం: మే 14, 1964) ఒక భారతీయ ఏరోస్పేస్ ఇంజనీర్, క్రయోజెనిక్ ఇంజనీరు, రాకెట్ శాస్త్రవేత్త.[1] ఆయన తిరువనంతపురం లోని వలయమాలలో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. అతను జనవరి 14, 2025 నుంచి అంతరిక్ష శాఖ కొత్త కార్యదర్శిగా, భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాడు.[2][3]డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సెక్రటరీ గా నియమితుడయ్యాడు. ఇస్రో లో సుమారు నాలుగు దశాబ్దాల పాటు కృషి చేశాడు. GSLV రాకెట్, చంద్రయాన్ మిషన్ కొరకు క్రయోజెనిక్ ప్రొపల్షన్ సిస్టమ్స్ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశాడు.[4][5]
బాల్యం విద్యాభ్యాసం
[మార్చు]వి.నారాయణన్ తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా మేల్కాట్టువిళై సమీపంలో నాగర్ కోయిల్ గ్రామంలో ఒక పేద కుటుంబంలో వన్నియ పెరుమాళ్, తంగమ్మాళ్ దంపతులకు మే 14, 1964 లో జన్మించాడు. ఈయన ఆరుమంది పిల్లల్లో పెద్దవాడు. వీరిది రైతు కూలీ కుటుంబం. కూలీ ద్వారా వచ్చే ఆదాయం సరిపోక తండ్రి కొబ్బరికాయలు అమ్మేవాడు. చదువుకుంటూనే తండ్రికి కొబ్బరికాయలు అమ్మడంలో సహాయం చేసేవాడు. కీళకట్టువిళైలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి వరకు చదివాడు. పదవ తరగతిలో మొదటి మొదటి ర్యాంకు ఉత్తీర్ణత సాధించాడు. అనంతరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల చేరాడు. 1989లో పశ్చిమ బెంగాల్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్ క్రయోజెనిక్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ డిగ్రీ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి, అదే సంస్థ నుంచి 2001లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పీహెచ్డీ పూర్తి చేశాడు.[6]
కెరీర్
[మార్చు]డాక్టర్ నారాయణన్ 1984లో ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో లో చేరాడు. ఇస్రో లో సాలిడ్ ప్రొపల్షన్ రంగంలో అతను సౌండింగ్ రాకెట్ కోసం ప్రొపల్షన్ సిస్టమ్స్ లను మరింత అభివృద్ధి చేయడంలో కృషి చేశాడు. ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అభివృద్ధిలో అతను చేసిన కృషి అమోఘమైనది. రెండు భారతదేశ ఉపగ్రహ ప్రయోగ సామర్థ్యాలలో ముఖ్య పాత్ర పోషించారు. సాలిడ్ ప్రొపల్షన్ నుండి క్రయోజెనిక్ ప్రొపల్షన్ కు మారుతూ మరింత క్లిష్టమైన సవాళ్ళను స్వీకరించి క్రయోజెనిక్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ముఖ్యంగా జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ లో అతను కీలక వ్యక్తిగా వ్యవహరించాడు. GSLV Mk-II కోసం క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ CUS పై అతను సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాడు. భూస్థిర కక్ష్యల కోసం ఇస్రో ఎక్కువ పేలోడ్ స్థామర్థ్యాలను సాధించడానికి వీలు కల్పిస్తుంది. GSLV Mk-III ప్రాజెక్ట్ లో అతని ప్రమేయం ద్వారా ప్రొపల్షన్ లో అతని నైపుణ్యం మరింత ప్రదర్శించడింది. ఇది చివరికి భారతదేశం యొక్క భారీ లిఫ్ట్ ప్రయోగ సామర్థ్యాలకు వెన్నెముకగా మారాడు.[7]
అవార్డులు
[మార్చు]డాక్టర్ నారాయణన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న ఐఐటీ ఖరగ్ పూర్ విశ్వవిద్యాలయం నుండి ఎంటెక్ డిగ్రీలో మొదటి ర్యాంకు సాధించి ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి రజత పతకం సాధించాడు. ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుండి బంగారు పతకం సాధించాడు. రాకెట్ కు సంబంధిత సాంకేతికతలకు ASI అవార్డులతో సహా అనేక ప్రశంసలు అందుకున్నాడు. ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇండియన్ క్రయోజెనిక్ కౌన్సిల్ ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఫెలోషిప్ సాధించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Who is V Narayanan? The rocket scientist ready to lead ISRO's next moon mission - The Economic Times". m.economictimes.com. Retrieved 2025-01-09.
- ↑ "ISRO Chairman: ఇస్రో ఛైర్మన్‌గా నారాయణన్ బాధ్యతల స్వీకరణ". EENADU. Retrieved 2025-01-16.
- ↑ Bureau, The Hindu (2025-01-07). "V. Narayanan appointed new Space Secretary and ISRO chief". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2025-01-09.
{{cite news}}
:|last=
has generic name (help) - ↑ "ISRO New Chief: ఇస్రో కొత్త ఛైర్మన్ గా నారాయణన్, ఎవరీ వ్యక్తి నేపధ్యమేంటి". Zee News Telugu. 2025-01-08. Retrieved 2025-01-09.
- ↑ Bharat, E. T. V. (2025-01-08). "ఇస్రో కొత్త చీఫ్ గా వి. నారాయణన్ - జనవరి 14న బాధ్యతల స్వీకరణ". ETV Bharat News. Retrieved 2025-01-09.
- ↑ "ISRO: ఆ చిరుద్యోగి... నేడు ఇస్రో ఛైర్మన్". EENADU. Retrieved 2025-01-27.
- ↑ mahesh.rajamoni. "రైతు కుటుంబం నుంచి ఇస్రో చీఫ్ వరకు.. ఎవరీ వీ.నారాయణన్?". Asianet News Telugu. Retrieved 2025-01-09.