వి. ఎస్. ఆర్. అరుణాచలం
వి. ఎస్. ఆర్. అరుణాచలం |
|---|
వళ్ళంపడుగై శ్రీనివాస రాఘవన్ అరుణాచలం (10 నవంబర్ 1935 – 16 ఆగస్టు 2023) భారతీయ శాస్త్రవేత్త, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డి.ఆర్,డి.వొ) మాజీ అధినేత. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ (CSTEP) అనే సైన్స్ అండ్ టెక్నాలజీ థింక్ ట్యాంక్ స్థాపకుడు, ఛైర్మన్.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]అరుణాచలం 1935 నవంబర్ 10న జన్మించారు.[1] సైన్స్‌లో బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీలు పొందారు. 1965లో వేల్స్ విశ్వవిద్యాలయం నుండి మెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో పిహెచ్‌డి పట్టా స్వీకరించారు. మైసూరులోని శారదా విలాస్ కాలేజీ పూర్వ విద్యార్థి.[మూలం అవసరం]
వృత్తి
[మార్చు]అరుణాచలం బాబా అణు పరిశోధనా కేంద్రం, బెంగళూరులోని నేషనల్ ఏరోనాటికల్ లాబొరేటరీ, హైదరాబాదులోని డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీలో శాస్త్రవేత్తగా పనిచేశారు. 1980లలో దాదాపు పదేళ్లపాటు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కు అధిపతిగా ఉన్నారు.[2] ఆయన హయాంలో DRDO బడ్జెట్ ఎనిమిది రెట్లు పెరిగింది. బ్యూరోక్రాటిక్, ఆర్థికపరమైన అడ్డంకులను అధిగమించడంలో ఆయనకు మంచి పేరుంది.[3] లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్స్ ప్రోగ్రామ్‌ల వంటి ప్రధాన రక్షణ ప్రాజెక్టులను ప్రారంభించారు.
అరుణాచలం 1982 నుండి 1992 మధ్య భారత రక్షణ మంత్రికి రక్షణ శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. పది మంది రక్షణ మంత్రులు, ఐదుగురు ప్రధానుల వద్ద పనిచేశారు.[4] భారత ప్రభుత్వ డిఫెన్స్ రీసెర్చ్ విభాగానికి కార్యదర్శిగా వ్యవహరించారు.[5] భారతదేశానికి ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్లు, స్వదేశీ ఇనుము, ఉక్కు సాంకేతికతల అభివృద్ధి, నిరక్షరాస్యత నిర్మూలనకు శాస్త్రీయ మిషన్లు, శిశు మరణాల నివారణ వంటి అనేక ప్రధాన సాంకేతిక, సామాజిక కార్యక్రమాల నిర్వచనం, అంచనా, సమీక్షలపై ప్రభుత్వానికి సలహాలు ఇచ్చారు. ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ విద్యారంగంలోనూ ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారు.[6]
అరుణాచలం కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్, పబ్లిక్ పాలసీ సహకార ప్రొఫెసర్‌గా, UK లోని వార్విక్ విశ్వవిద్యాలయంలో గౌరవ ప్రొఫెసర్‌గా ఉన్నారు. డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ సర్వీస్ (DRDS) సభ్యుడు.
పురస్కారాలు
[మార్చు]అరుణాచలం అనేక అవార్డులు, పతకాలు పొందారు. 1980లో ఇంజనీరింగ్ సైన్సెస్ విభాగంలో శాంతి స్వరూప్ భట్నాగర్ శాస్త్ర సాంకేతిక పురస్కారం అందుకున్నారు. UK లోని రాయల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్‌కు ఫెలోగా ఎన్నికైన మొదటి భారతీయుడు.[5]
భారతీయ విజ్ఞాన శాస్త్రానికి చేసిన సేవలకు గాను 1985లో పద్మభూషణ్, 1990లో పద్మవిభూషణ్ పురస్కారాలు లభించాయి.[7] శాస్త్రీయ పరిశోధన, సాంకేతిక రంగంలో అత్యుత్తమ సేవలకు గాను 2015లో DRDO లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు.[8]
మరణం
[మార్చు]అరుణాచలం 87 ఏళ్ల వయసులో 2023 ఆగస్టు 16న కాలిఫోర్నియాలో మరణించారు.[9][10]
మూలాలు
[మార్చు]- ↑ "Awardee Details: Shanti Swarup Bhatnagar Prize". ssbprize.gov.in. 18 August 2023. Retrieved 18 August 2023.
- ↑ RAMADAS P SHENOY. "DEFENCE RESEARCH & DEVELOPMENT ORGANISATION 1958–1982" (PDF). Retrieved 17 November 2015.
- ↑ WPS Siddhu (15 September 1992). "Off course DRDO's budget jumps, major projects get delayed". India Today. Retrieved 17 November 2015.
- ↑ Rajagopalan, Rajesh; Mishra, Atul (2014). Nuclear South Asia: Keywords and Concepts. Routledge India. pp. 69–70. ISBN 978-1138795730.
- ↑ 5.0 5.1 "Indian Fellow". Indian National Science Academy. Archived from the original on 12 August 2016. Retrieved 19 November 2015.
- ↑ "Dr. V. S. Arunachalam on IRGC". IRGC. Archived from the original on 19 నవంబర్ 2015. Retrieved 19 November 2015.
{{cite web}}: Check date values in:|archive-date=(help) - ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015.
- ↑ "V S Arunachalam gets DRDO lifetime achievement award". Business Standard. 23 September 2015. Retrieved 10 November 2015.
- ↑ "Former DRDO Chief V.S. Arunachalam no more". The Hindu (in Indian English). 2023-08-16. ISSN 0971-751X. Retrieved 2023-08-16.
- ↑ "Former defence research body chief VS Arunachalam passes away in America". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-08-16.