Jump to content

వి. పి. అప్పుకుట్ట పొదువల్

వికీపీడియా నుండి
వీ.పీ. అప్పుకుట్ట పొదువల్
జననం (1923-10-09) 1923 అక్టోబరు 9 (వయసు: 102)
జాతీయత భారతీయుడు
పాఠశాల/కళాశాలలు
  • లక్నో విశ్వవిద్యాలయం
  • మైసూర్ విశ్వవిద్యాలయం (ఎంఏ)
వృత్తిస్వాతంత్ర్య ఉద్యమకారుడు
Notable workగాంధేయ దర్శనతిలే ఆధ్యాత్మికత, భగవత్గీత: ఆత్మవికాసతింటే శాస్త్రం

వీపీ అప్పుకుట్ట పొదువల్ (జననం 9 అక్టోబర్ 1923) కేరళ రాష్ట్రానికి చెందిన భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త & గాంధేయ సామాజిక కార్యకర్త. ఆయన సామాజిక సేవకుగాను 2023 సంవత్సరానికి కేంద్రం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డును అందుకున్నాడు.[1]

ఉద్యమ జీవితం

[మార్చు]

అంటరానితనానికి వ్యతిరేకంగా గళం విప్పిన స్వామి ఆనంద తీర్థ ఆహ్వానం మేరకు గాంధీజీ పయ్యనూర్‌లో పర్యటించగా అప్పుకుట్ట పొదువాల్ 11 సంవత్సరాలు వయస్సులో జనవరి 12, 1934 పయ్యనూర్‌లో మహాత్మా గాంధీని కలవడంతో ఆయన జీవితంలో ఒక మలుపుగా మారింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో కోజికోడ్, కన్నూర్‌లలో విద్యార్థి సమావేశాలలో ఉపన్యాసాలు ఇచ్చినందుకు ఆయనను బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేయగా, కన్నూర్ సెంట్రల్ జైలులో రెండు వారాల పాటు జైలు శిక్ష అనుభవించాడు.

అప్పుకుట్ట పొదువాల్ 1944లో చరఖా సంఘ్ కేరళ శాఖలో చేరి 1947 నుండి మద్రాసు ప్రభుత్వంలో పయ్యనూర్‌లోని ఉర్జిత్ ఖాదీ కేంద్రానికి ఇన్‌చార్జిగా, 1962 నుండి అఖిల భారతీయ ఖాదీ గ్రామోద్యోగ కమిషన్‌లో సీనియర్ ఆడిటర్‌గా పని చేశాడు. ఆయన వినోబా భావే, జయప్రకాష్ నారాయణ్‌లతో కలిసి భూదాన ఉద్యమంలో పాల్గొన్నాడు. అప్పుకుట్ట పొదువాల్ గాంధీ స్మారక నిధి కార్యక్రమ కార్యనిర్వహణాధికారిగా, భారతీయ సంస్కృత ప్రచార సభ అధ్యక్షునిగా & సంస్కృత మహావిద్యాలయ ప్రిన్సిపాల్‌గా పని చేశాడు.[2]

అవార్డులు

[మార్చు]
  • 2013: G. కుమార పిళ్లై-IM వేలాయుధన్ అవార్డు, పూర్ణోదయ బుక్ ట్రస్ట్[3]
  • 2007: విశ్వాసంసరిత ప్రతిష్టానం అవార్డు- కేరళం - భారతి ద్వారా "సహృదయతిలకం"
  • 2023: పద్మశ్రీ[4][5][6]

మూలాలు

[మార్చు]
  1. "Full list of 2023 Padma awards" (in Indian English). The Hindu. 25 January 2023. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
  2. "Padma Shri for 4 Malayalis, including Gandhian VP Appukutta Poduval" (in ఇంగ్లీష్). 25 January 2023. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
  3. "Award for V.P. Appukuttan". The Hindu (in Indian English). 2013-08-22. ISSN 0971-751X. Retrieved 2016-10-02.
  4. "Gandhian V.P. Appukuttan Poduval conferred with Padma Shri" (in Indian English). The Hindu. 25 January 2023. Archived from the original on 26 January 2025.
  5. "Padma Shri honour for four Keralites" (in ఇంగ్లీష్). The New Indian Express. 26 January 2023. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
  6. "Padma Shri for four Keralites" (in Indian English). The Hindu. 25 January 2023. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.