వి. హనుమంత రాయ చౌదరి

వికీపీడియా నుండి
(వి. హ‌నుమంత రాయ చౌద‌రి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వి. హనుమంతరాయ చౌదరి
వి. హనుమంత రాయ చౌదరి


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - 2019
నియోజకవర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం జులై 23
యర్రంపల్లి, కళ్యాణదుర్గం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు వీరన్న
జీవిత భాగస్వామి లక్ష్మీదేవి
సంతానం వీరేష్ చౌదరి, మారుతి చౌదరి, ఉదయభాస్కర్ చౌదరి
వృత్తి రాజకీయ నాయకుడు

ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

వి. హనుమంతరాయ చౌదరి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి సర్పంచిగా, మండల అధ్యక్షుడిగా, సింగల్ విండో అధ్యక్షుడిగా, 1998 సెప్టెంబర్ 28 నుండి 2004 మార్చి 28 వరకు మార్కెఫెడ్ ఛైర్మన్‌గా, 2000 నుండి 2010 వరకు అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, టీడీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన ఆ తరువాత 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి,[2] 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరపున కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. హనుమంతరాయ చౌదరికు 2019లో టీడీపీ టికెట్ దక్కలేదు. ఆయన ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నాడు.[3]

మూలాలు[మార్చు]

  1. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  2. CEO Andrapradesh (2009). "Unnam Hanumantharaya Chowdary" (PDF). Archived from the original (PDF) on 6 June 2022. Retrieved 6 June 2022.
  3. Andhra Jyothy (26 April 2022). "జగన అసమర్థత వల్లే రాష్ట్రం చీకటిమయం" (in ఇంగ్లీష్). Retrieved 6 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)

బయటి లింకులు[మార్చు]