Jump to content

వీణా భారతి

వికీపీడియా నుండి
వీణా భారతి
తరువాత వారుసోనమ్ రాణి సర్దార్
బీహార్ శాసనసభ
నియోజకవర్గంత్రివేణిగంజ్ శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
రాజకీయ పార్టీజనతాదళ్ (యునైటెడ్)
నివాసంబీహార్
వృత్తిరాజకీయవేత్త

వీణా భారతి (జననం 1970 ఫిబ్రవరి 2) బీహార్ కు చెందిన భారతీయ రాజకీయ నాయకురాలు. ఆమె సుపాల్ జిల్లా షెడ్యూల్డ్ కులానికి రిజర్వు చేసిన త్రివేణిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీహార్ శాసనసభకు ఎన్నికైన సభ్యురాలు. ఆమె జనతా దళ్ (యునైటెడ్) కు ప్రాతినిధ్యం వహిస్తుంది. 2020 బీహార్ శాసనసభ ఎన్నికల్లో గెలిచింది.[1][2][3]

ప్రారంభ జీవితం

[మార్చు]

భారతి బీహార్ సుపాల్ జిల్లాలోని త్రివేణిగంజ్ ప్రాంతానిఇ చెందినది. ఆమె దివంగత విశ్వమోహన్ భారతి భార్య. ఆమె 1986లో పాట్నాలో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి, తరువాత 1991లో ఇంటర్మీడియట్ చేసింది.[4]

కెరీర్

[మార్చు]

2020 బీహార్ శాసనసభ ఎన్నికల్లో జనతా దళ్ (యునైటెడ్) కు ప్రాతినిధ్యం వహిస్తూ త్రివేణిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆమె విజయం సాధించింది. ఆమె 79,458 ఓట్లతో తన సమీప ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి సంతోష్ కుమార్ ను 3,031 ఓట్ల తేడాతో ఓడించింది.

మూలాలు

[మార్చు]
  1. "Veena Bharti Election Result Triveniganj Live: Assembly (Vidhan Sabha) Election Results 2020 Veena Bharti Triveniganj Seat". News18. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-01-27.
  2. "Veena Bharti(Janata Dal (United)(JD(U))):Constituency- TRIVENIGANJ (SC)(SUPAUL) - Affidavit Information of Candidate". myneta.info. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-01-27.
  3. "Veena Bharti Election Results 2020: News, Votes, Results of Bihar Assembly". NDTV.com (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-01-27.
  4. "Veena Bharti(Janata Dal (United)(JD(U))):Constituency- TRIVENIGANJ (SC)(SUPAUL) - Affidavit Information of Candidate:". myneta.info. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-10-04.