Jump to content

వీణ (మాసపత్రిక)

వికీపీడియా నుండి
వీణ
సంపాదకులుపాటిబండ మాధవశర్మ
తరచుదనంమాసపత్రిక
ముద్రణకర్తపాటిబండ మాధవశర్మ
స్థాపక కర్తపాటిబండ మాధవశర్మ
మొదటి సంచిక1936 మే
దేశంభారతదేశం
కేంద్రస్థానంతేలప్రోలు
భాషతెలుగు

వీణ సాహిత్య మాసపత్రిక 1936 మే నెలలో తొలి సంచిక వెలువడింది. కృష్ణా జిల్లా, తేలప్రోలు నుండి ఈ పత్రిక పాటిబండ మాధవశర్మ సంపాదకత్వంలో వచ్చింది. ఈ పత్రిక వెల పావలా కాగా వార్షిక చందా 2 రూపాయలు. ఈ పత్రిక ఉష ప్రెస్సులో ముద్రించబడింది.

రచనలు

[మార్చు]

ఈ పత్రికలో ప్రచురింపబడిన రచనలలో కొన్ని:

కథలు
  • అల్లాకే ఫకీర్
  • బహుమానము
  • ఎండమావులు
  • ఇంగిలీషు చదువు
  • ఏడోప్రేమలేఖ
  • చూపుల తడాఖా
  • నియోగీ వైదీకీ
  • పాపాయి
  • ప్రేమ సాఫల్యం
  • ప్రేమలేఖ
  • మట్టెల రవళి
  • మా సుబ్బు సంగీతం
  • మిస్టర్ నియమకుమార్
  • మేదర మంగి
  • సహగమనం
  • సాధన
  • సిల్కుసూటు
  • స్వేచ్ఛ
వ్యాసాలు
  • భావకవిత్వం
  • కళ - కళాభిజ్ఞత
  • హిందూ దేశము - జనసంఖ్య
  • ప్రాచీన రాష్ట్రతంత్రము
  • మన రక్షణ సమస్య - క్షాత్ర ధర్మములు
  • శిల్పి - వరదా వెంకటరత్నము
  • నాస్తికత
  • సాహిత్య ప్రయోజనము
  • ఆంధ్రభారత రచనోద్దేశ్యము
సంపాదకీయ వ్యాఖ్యలు
  • శ్రుతులు
కవితలు, పద్యఖండికలు
  • ఓదార్పు
  • బొట్టు
  • కవితాంజలి
  • చుక్కలు చుక్కలు
  • విరహిణి
  • చిట్టి చెల్లాయికి
  • సాగరతీరాన
  • ఆహుతి
  • ప్రేమభిక్షువు
  • గీతిక
ఇతర శీర్షికలు

రచయితలు

[మార్చు]

ఈ పత్రికలో రచనలు చేసిన కొందరు కవులు, రచయితలు:

ఈ పత్రికపై అభిప్రాయాలు

[మార్చు]

ప్రతిభ పత్రిక 1936, ఆగష్టు సంచికలో ఈ పత్రికను సమీక్షిస్తూ ఈ విధంగా పేర్కొంది.[1]

ఈ మధ్య కొన్ని మాసపత్రికలు బయలుదేరినవి. 'వీణ ' వాటి అన్నిటికంటే సర్వవిధాలా శ్రేష్టమయినది. అచ్చుకూర్పు మొదలుకొని అంశములదాకా చాలా విశిష్టముగా ఉన్నది.

'వీణ 'లో తర్జుమాలు పడుతున్నవి. సాధ్యమైనంతవరకు తగ్గిస్తే బాగుంటుంది. వివిధ విషయాలను ప్రచురించేటందుకు 'భారతి ' మొదలైన పత్రికలు ఉండగా ఇందులో సాహిత్య విషయాలు మాత్రమే ప్రకటిస్తే మేలని తలుస్తాము. అతినవీనుల రచనలకు తావిచ్చి, బాగా 'నవీనదృష్టి ' కలిగించి విశిష్ట సారస్వతసృష్టికే 'వీణ ' తోడ్పడితే పత్రిక సార్థకమవుతుంది.

మూలాలు

[మార్చు]
  1. తెలికిచెర్ల వెంకటరత్నం (1 August 1936). "గ్రంథ విమర్శనము - వీణ (సాహిత్య మాసపత్రిక)". ప్రతిభ. 1 (2): 204, 205. Retrieved 23 February 2025.


బయటి లింకులు

[మార్చు]