Jump to content

వీరగంధం వెంకట సుబ్బారావు

వికీపీడియా నుండి

వీరగంధం వెంకట సుబ్బారావు ప్రఖ్యాత హరికథ కథకులు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో, వినుకొండ పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి భీమవరం (ముండ్లమూరు) అను ఒక చిన్న పల్లెటూరిలో వ్యవసాయ కుటుంబంలో వీరగంధం పిచ్చయ్య, వీరగంధం వెంకమ్మ దంపతులకు మూడవ సంతానంగా జూలై 29, 1937 న జన్మించారు. అతని తాతగారు వీరగంథం సుబ్బయ్య. సుబ్బయ్య తండ్రి వీరగంథం పెంటయ్య వినుకొండకు చెందినవారు.[2] ఇతనికి చిన్నతనం నుంచే షుమారు 10వ ఏటనే కళ లందు ఆసక్తి కలిగింది. తన స్నేహితులతో కలిసి ఊరిలొ, పక్క ఊళ్ళలో చిన్న చిన్న నాటకాలు ప్రదర్శిస్తూ హనుమంతుడు, రాముడు, కృష్ణుడు, నారదుడు మెదలగు వేషాలు కట్టి తన కళాతృష్ణ ని పెంపొందించసాగాడు. ఇంటిలో ఒప్పుకొవటంలేదని, తన 13వ ఏట ఇల్లు వదిలి పారిపోయి, అప్పటికే కళల కు ప్రసిద్ధి గాంచిన తెనాలి పట్టణానికి చేరుకున్నాడు. అక్కడ అతనికి విద్యా దానకర్ణ తెల్లాకుల వెంకటేశ్వర గుప్త భాగవతార్ భోజనం పెట్టి ఆదరించి దగ్గరికి చేర్చుకున్నాడు. సుబ్బారావు ఉన్నటువంటి గాత్ర శుద్ధి, హావ భావ నటనా నైపుణ్యాన్ని చూచి, వారికి హరికథ అనే కళ ను అతనికి నేర్పించాలని సంకల్పించాడు.

వీరగంధం వెంకట సుబ్బారావు రెండవ తానా మహాసభల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రదర్శించిన హరికథ ఆహుతులను ఎంతో రంజింపచేసింది. అతను తానా సభలలో అనేక హరికథలను చెప్పాడు.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అతను లక్ష్మీ పార్వతిని వివాహమాడాడు.[4] అతనికి ఒక కొడుకు (కోటేశ్వర ప్రసాద్) ఉన్నాడు. లక్ష్మీపార్వతి మొదటి భర్త వీరగంధం వెంకట సుబ్బారావు నుండి ఏప్రిల్ 15, 1993న పల్నాడు జిల్లా, నరసరావుపేట కోర్టులో విడాకులు తీసుకుంది.

మూలాలు

[మార్చు]
  1. తెలుగువారి జానపద కళారూపాలు (1992) రచించినవారు మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి
  2. 013 - Interview of Sri Veeragandham Venkata Subbarao by Sri A B Anand, Hyderabad - Part 1 of 6
  3. "Hari Kathaa Kalaanidhi- Veeragandham Venkata Subbarao". Archived from the original on 2016-12-10. Retrieved 2016-05-29.
  4. "ఆవిడ [[హార్మోనియం]] వాయిస్తే ఏంటట? august 01 , 2015". Archived from the original on 2015-11-04. Retrieved 2016-05-29.

ఇతర లింకులు

[మార్చు]