వీరగల్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇవి రాతిపై చెక్కిన స్మారక శిలా రూపాలు. వీరుల త్యాగానికీ చిరస్మరణీయతకూ గుర్తుగా వీటిని నిర్మిస్తారు. యుద్ధంలో మరణించిన వీరులను గుర్తుచేసే స్మారకశిలలే వీరగల్లులు. మధ్యయుగ చారిత్రక వివరాలను తెలుసుకునేందుకు అపురూపమైన ఆధారాలు ఇవి. దండయాత్రలలో మరణించినవారి కన్నా గ్రామరక్షణకొరకు, ఆవులమందలను కాపాడడానికి, పులుల వంటి కౄరమైన జంతువులతో పోరాడి, ప్రాణాలు పోగొట్టుకున్న వీరులజ్ఞాపకంగా వేసిన శిలలే వీరగల్లులు. తర్వాత కాలాల్లో వీరశైవం వ్యాపిస్తున్నకాలంలో వీరశైవులు శివసాయుజ్యం కోరి ఆత్మాహుతి చేసుకున్నపుడు వేసిన శిలలు కూడా వీటిలో చేరి ఉన్నాయి.

ఆచారాలు పద్దతులూ[మార్చు]

వీరభద్ర, భైరవ తదితరరూపాల్లోని వీరులు మరణించిన తర్వాత కూడా తమ గ్రామాలను రక్షిస్తారనే నమ్మకంతో ప్రజలు ఈ వీరగల్లు విగ్రహాలకు నిత్యపూజలు అందజేస్తుంటారు.

వేర్వేరు భాష, సంస్కృతులలో[మార్చు]

తెలుగులో వీరగల్లులు అని పిలువబడే ఈ శిలావిగ్రహాలు కన్నడంలో వీర్గల్, తమిళంలో నటుకల్ ఆంగ్లంలో హీరో స్టోన్స్ (hero stones) అంటారు. జపాన్ దేశంలోని సమురాయ్ సంస్కృతిలో కనిపించే సెప్పుక్కు, హరాకిరీ సంస్కృతులను ఈ వీరగల్లులు తలపిస్తాయి. ప్రాచీన కాలంలో యుధ్ద సమయంలోో ఓడిన శత్రువుల తలలను బంతులుగా ఉపయోగించి ఆటాడుకునే ‘శిర: కందుక క్రీడా వినోదం’, తమ చేతుల్లో మరణించిన శత్రువీరుల రక్తమాంసాలతో ఉడికించిన అన్నాన్ని కావలి దేవతలకు ఊరిచుట్టూ పొలిజల్లటం అనే ‘రణం కుడుపు’ అనే సంస్కృతులు కూడా వీరగల్లులలో ప్రతిబింబిస్తాయి.

త్యాగం చేసిన వారు[మార్చు]

చెరువు కట్టలు తెగిపోతున్నప్పుడు తమ ప్రాణాలనే పణంగా పెట్టి ఆ గండిలో స్వయంగా పూడ్చుకుపోయిన వారు. బలిదానం కావించబడిన వారి జ్ఞాపకార్ధం కూడా కొన్ని వీరగల్లు విగ్రహాలు కనిపిస్తాయి. గ్రామరక్షణ కొరకు, ఆవులమందలను కాపాడడానికి, పులుల వంటి క్రూరమైన జంతువులతో పోరాడి, ప్రాణాలు పోగొట్టుకున్న వీరులజ్ఞాపకంగా కూడా ఈ వీరగల్లు విగ్రహాలు కనిపిస్తాయి. గండ కత్తెర వేసుకుని మరణించిన వారు, కొండ చరియలపై నుంచి దూకిన వారు. అగ్ని గుండాలలో ఆత్మాహుతి కావించుకున్నవారి విగ్రహాలను కూడా గమనించగలం

వీరశైవంలో భాగంగా[మార్చు]

వీరశైవం వ్యాపిస్తున్నకాలంలో వీరశైవులు శివసాయుజ్యం కోరి ఆత్మాహుతి చేసుకున్నపుడు వేసిన శిలలు కూడా వీటిలో చేరి ఉన్నాయి. తలపై ఉన్న ముడిని ఒక చేతితో పట్టుకుని మరోచేతిలోని చురకత్తితో తమ మెడలను తెగకోసుకుంటున్న విగ్రహాలు ఇటువంటి వర్గంలో కనిపిస్తాయి

తెలుగు రాష్ట్రాలలోని వీరగల్లుల చిత్రమాలిక[మార్చు]

పొరుగు రాష్ట్రాల వీరగల్లుల చిత్రమాలిక[మార్చు]

బయటి లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=వీరగల్లు&oldid=3499620" నుండి వెలికితీశారు