వీరభద్ర విజయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వీరభద్ర విజయము అనునది బమ్మెర పోతన రచించిన పద్య కావ్యము. ఇది వీరభద్రుని చరిత్రకు సంబంధించిన కావ్యము. వీరభద్రని జన్మ కారణము, దక్ష యజ్నము యొక్క కథాగమనముతో సాగే రచన. ఇది నాలుగు ఆశ్వాసాల ప్రబంధం. ఇందులోని వృత్తాంతం వాయు పురాణం నుండి గ్రహింపబడింది.[1]

కథాసంగ్రహం[మార్చు]

కైలాసంపైన పరమేశ్వరుడు పార్వతీదేవితో కొలువై వున్న సమయంలో దేవాసురులులందరూ అక్కడకేతెంచి శివుని స్తుతిస్తుండగా దక్షుడు అక్కడికి వస్తాడు. శివుడు వారినందరిని గౌరవించిన అనంతరం దక్షుణ్ని గౌరవించాడు. అందుకు దక్షుడు శివుడు తనని అవమానించినట్లు భావించి, కొపగించి ప్రతికారంగా ఒక యాగాన్ని చెయ్యడానికి నిశ్చయించుకొంటాడు. దేవతలు, మునులు అందరినీ ఆహ్వానించి శివుడు లేకుండా యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ వార్త నారదునివల్ల తెలుసుకొన్న దాక్షాయణి శివునికా వార్తను తెలిపింది. శివుని ఆజ్ఞ గైకొని యజ్ఞాన్ని చూడడానికి బయలుదేరింది. దక్షుడు ఆమెను పిలవని పేరంటానికి వచ్చినందుకు తిరస్కరించడమే కాకుండా శివుణ్ణి నిందిస్తాడు. అది భరించలేని దాక్షాయణి శివయోగాగ్నిలో దేహత్యాగం చేస్తుంది.

మూలాలు[మార్చు]

  1. వీరభద్ర విజయము, బమ్మెర పోతన, కావ్య సమీక్షలు, సంపాదకులు: డా. ఎం.వి.సత్యనారాయణ, ఆంధ్రా యూనివర్సిటీ ప్రెస్, విశాఖపట్నం, 1983, పేజీ: 71-80.
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:


బయటి లింకులు[మార్చు]