వీరేంద్ర సింగ్ కడియన్
| వీరేంద్ర సింగ్ కడియన్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2020 ఫిబ్రవరి 11 | |||
| ముందు | సురీందర్ సింగ్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | ఢిల్లీ కంటోన్మెంట్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1975 ఫిబ్రవరి 4 ఢిల్లీ, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
| నివాసం | ఢిల్లీ | ||
| పూర్వ విద్యార్థి | కురుక్షేత్ర విశ్వవిద్యాలయం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
| వెబ్‌సైటు | అధికారిక వెబ్‌సైట్ | ||
వీరేంద్ర సింగ్ కడియన్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుండి 2020, 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]వీరేంద్ర సింగ్ కడియన్ 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నాడు. ఆయన పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఢిల్లీ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సమనీష్ సింగ్‌పై 10,590 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2] ఆయన 2020 మే 14న న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్‌డిఎంసి) సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[3]
వీరేంద్ర సింగ్ కడియన్ 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఢిల్లీ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భువాన్ తన్వర్‌పై 2029 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
- ↑ Financialexpress (11 February 2020). "Delhi Election 2020: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
- ↑ "CM Kejriwal, Cantt MLA Virender Kadian take oath as NDMC members" (in ఇంగ్లీష్). The Tribune. 15 May 2020. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
- ↑ "Delhi Assembly Elections Results 2025 - Delhi Cantonment" (in ఇంగ్లీష్). Election Commission of India. 8 February 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.