Jump to content

వీ.సీ. చందీర కుమార్

వికీపీడియా నుండి
వీ.సీ. చందీర కుమార్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2025 ఫిబ్రవరి 8
ముందు ఈ.వీ.కే.ఎస్. ఇళంగోవన్
పదవీ కాలం
2011 – 2016
తరువాత కె.ఎస్. తెన్నరసు
నియోజకవర్గం ఈరోడ్ ఈస్ట్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం
వృత్తి రాజకీయ నాయకుడు

వి.సి. చంద్రకుమార్ (జననం 1967) తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఈరోడ్ ఈస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

చందీర కుమార్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1987లో వార్డు సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత విజయకాంత్ స్థాపించిన దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగంలో చేరి 2011 తమిళనాడు శాసనసభ ఎన్నికలలో ఈరోడ్‌ తూర్పు నియోజకవర్గం నుండి డిఎండికె అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థి ఎస్. ముత్తుసామిపై ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీలో చేరి 2016 శాసనసభ ఎన్నికలలో డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అన్నాడీఎంకే అభ్యర్థి కె.ఎస్. తెన్నరసు చేతిలో 7,794 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2][3]

చందీర కుమార్ 2025లో ఈరోడ్‌ తూర్పు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో నుండి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌టికే అభ్యర్థి ఎం.కె. సీతాలక్ష్మిపై 91,558 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Erode (East) bypoll: DMK candidate Chandhirakumar's victory margin the third largest since 2009" (in Indian English). The Hindu. 9 February 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  2. "ఈరోడ్‌ ఈస్ట్‌ డీఎంకే అభ్యర్థిగా చంద్రకుమార్‌". 12 January 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  3. "Erode East bypoll: DMK fields senior leader VC Chandirakumar" (in ఇంగ్లీష్). The News Minute. 11 January 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  4. "2025 Erode East Assembly constituency By Poll Result" (in ఇంగ్లీష్). Election Commission of India. 8 February 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  5. "Landslide victory for DMK in Erode (East) Assembly seat by-election" (in ఇంగ్లీష్). India Today. 8 February 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.