వూడీ అలెన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వూడీ అలెన్
2006లో వూడీ అలెన్
జననం
అలెన్ స్టీవార్ట్ కొనిగ్స్ బర్గ్[1]

(1935-12-01) 1935 డిసెంబరు 1 (వయసు 88)
బ్రోంక్స్, న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
ఇతర పేర్లుహేవుడ్ అలెన్
వృత్తినటుడు, రచయిత, దర్శకుడు, కమెడియన్, నాటకకర్త
క్రియాశీల సంవత్సరాలు1950–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
 • హార్లెన్ సుసాన్ రోజెన్ (1956–1962)
 • లూయీస్ లాజర్ (1966–1970)
 • సూన్-యి పర్వెన్ (1997–ప్రస్తుతం)
భాగస్వామి
 • డయానె కీటన్ (1970–1971)
 • మియా ఫారో (1980–1992)
పిల్లలు
 • మోజెస్ ఫారో (కొడుకు)
 • రోనన్ ఫారో (కొడుకు)
 • బెచెట్ డుమైన్ అలెన్ (కూతురు)
 • మాంజీ టియో అలెన్ (కూతురు)
బంధువులులెట్టీ ఆరోన్ సన్ (చెల్లెలు)
పురస్కారాలుఅకాడమీ అవార్డులు (ఆస్కార్)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే రచయితగా 3, ఉత్తమ దర్శకునిగా ఒకటి
బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డులు
స్క్రీన్ ప్లే రచయితగా 6, ఉత్తమ దర్శకునిగా 3
సంతకం

హేవుడ్ "వూడీ" అలెన్ (పుట్టుకతో పేరు అలన్ స్టీవార్డ్ కోనిగ్స్ బర్గ్,[1] డిసెంబర్ 1, 1935) అమెరికన్ నటుడు, రచయిత, దర్శకుడు, హాస్యనటుడు, నాటకకర్త, ఆయన కెరీర్ 50 సంవత్సరాలకు పైగా సాగుతోంది.

1950ల్లో హాస్యరచయితగా పనిచేశారు, ఆ సమయంలో టెలివిజన్ కు జోకులు, స్క్రిప్టులు రాశారు, చిన్న చిన్న హాస్యభాగాలు పుస్తకాలుగా ప్రచురించారు. 1960ల్లో, అలెన్ స్టాండ్-అప్ కమెడియన్ గా సంప్రదాయికమైన జోకులు కాకుండా స్వగతంగా మాట్లాడుకునే మాటల్లోంచే హాస్యం పుట్టించారు. హాస్యనటునిగా మేధావి, ఇన్సెక్యూర్, విసుగు కలిగిన ఓ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేశారు, నిజజీవిత వ్యక్తిత్వానికి అది చాలా భిన్నమైనది.[2] 2004లో, కామెడీ సెంట్రల్[3] 100 అతిగొప్ప స్టాండప్ కమెడియన్ల జాబితా వేస్తూ అలెన్ కి నాలుగో స్థానం ఇచ్చారు, మరోవైపు యూకే సర్వే అలెన్ ని మూడో అతిగొప్ప కమెడియన్ గా ర్యాంక్ ఇచ్చింది.[4]

1960 మధ్యనాళ్ళకు అలెన్ సినిమాలు వ్రాయడం, దర్శకత్వం వహించడం ప్రారంభించారు. మొదట్లో స్లాప్ స్టిక్ కామెడీలు రాయడంలో నైపుణ్యం సాధించినా, 1970ల్లో యూరోపియన్ ఆర్ట్ సినిమాల ప్రభావంతో డ్రమెటిక్ అంశాలకు ఆయన ఆసక్తులు తరలిపోయాయి. ఆపైన కామెడీలు, డ్రామాల మధ్య కొనసాగుతూ వచ్చారు. సాధారణంగా 1960ల మధ్యకాలం నుంచి 1970ల వరకూ వచ్చిన న్యూ హాలీవుడ్ వేవ్ కు చెందిన సినీ రూపకర్తల్లో ఒకనిగా ఆయనను గుర్తిస్తూంటారు.[4] అలెన్ తరచుగా ఆయన సినిమాల్లో నటిస్తూంటారు, ఆయన స్టాండప్ కమెడియన్ గా అభివృద్ధి చేసుకున్న పర్సనానే పాత్రలుగా కల్పించి నటించారు. ఆయన తీసిన 40 సినిమాల్లో అత్యుత్తమమైనవిగా అన్నే హాల్ (1977), మాన్ హట్టాన్ (1979), హన్నా అండ్ హర్ సిస్టర్స్ (1986), మిడ్ నైట్ ఇన్ పారిస్ (2011) సినిమాలు పేరుతెచ్చుకున్నాయి. అలెన్ ను సినీ విమర్శకుడు రోజెర్ ఎబెర్ట్ "సినిమాల ఖజానా"గా అభివర్ణించారు.[4]

అలెన్ అకాడమీ (ఆస్కార్) అవార్డులకు 24సార్లు నామినేషన్లు పొంది, 3 ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఒకసారి ఉత్తమ దర్శకుడు (అన్నీ హాల్ సినిమాకు) పురస్కారాలు పొందారు. స్క్రీన్ ప్లే రచయితగా అతిఎక్కువసార్లు ఆస్కార్ నామినేషన్లు పొందారు, బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్, టెలివిజన్ ఆర్ట్స్ అవార్డుల్లో 9 పురస్కారాలు పొందారు. అలెన్ తరచుగా మాన్ హట్టాన్ లోని చిన్న చిన్న వేదికలపై జాజ్ క్లారినెట్ వాయించి ప్రదర్శనలు ఇస్తూంటారు.[5] 2011లో, అమెరికన్ మాస్టర్స్ టీవీ సీరీస్ లో వూడీ అలెన్: ఎ డాక్యుమెంటరీ అన్న జీవిత చరిత్రాత్మక చలన చిత్రం పిబిఎస్ లో ప్రదర్శించారు.[6]

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 Lax, Eric (1991). "Woody Allen: A Biography". Woody Allen: A Biography. Retrieved February 3, 2014. Woody Allen was born in Brooklyn, New York, in the spring of 1952, When Allan Stewart Konigsberg, who was born in the Bronx on December 1, 1935, settled on the name as a suitable cover.[permanent dead link] ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "birth name" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 2. Gross, Terry (2009–12).
 3. Comedy Central's 100 Greatest Stand-Ups of all Time Archived 2012-07-15 at Archive.today.
 4. 4.0 4.1 4.2 Thorpe, Vanessa (January 2, 2005). "Cook tops poll of comedy greats". The Guardian. London.
 5. Kelly, Nathan (June 20, 2009). "An evening with Woody". Sydney Morning Herald. Archived from the original on 2014-05-22. Retrieved October 23, 2012.
 6. Weide, Robert B. (Director). Woody Allen: A Documentary (Television). PBS. Retrieved July 20, 2012.