వెంకటనరసింహాపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెంకటనరసింహాపురం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గన్నవరం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,404
 - పురుషులు 684
 - స్త్రీలు 720
 - గృహాల సంఖ్య 382
పిన్ కోడ్ 521101
ఎస్.టి.డి కోడ్

వెంకటనరసింహాపురం (వి.ఎన్.పురం), కృష్ణా జిల్లా, గన్నవరం మండలానికి చెందిన గ్రామము. ఇది మండల కేంద్రమైన గన్నవరం నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589244[1].

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామం, కేసరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామ ప్రముఖులు[మార్చు]

శ్రీ అన్నే నాగార్జున[మార్చు]

గన్నవరం సమీపంలోని వెంకటనరసింహాపురం కాలనీలో నివసించుచున్న ఈయన, భారీ ట్రక్కును నడపడంలో ఖ్యాతిపొందినారు. ఈ విషయంలో భారతదేశంలోనే తనకు తిరుగులేదని నిరూపించాడు. దేశంలోనే తొలిసారిగా, టాటా మోటార్స్ సంస్థ, గత సంవత్సరం భారతీయ డ్రైవర్లకు ట్రక్కు డ్రైవింగ్ పోటీలను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 500 మంది డ్రైవర్లు పోటీపడగా, నాగర్జున తొలిస్థానం సాధించి పది లక్షల రూపాయల నగదు బహుమతి అందుకున్నాడు. ఈ సంవత్సరం గూడా ఆ సంస్థవారు, 2017,మార్చి-19న ఢిల్లీ సమీపంలోని నోయిడా వద్ద అదే పోటీలు నిర్వహించగా, మళ్ళీ నాగార్జున విజయం సాధించి, విజేతగా నిలిచి, 12 లక్షల రూపాయల నగదు బహుమతిని, షీల్డునూ తన స్వంతం చేసుకున్నాడు. [1]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,404 - పురుషుల సంఖ్య 684 - స్త్రీల సంఖ్య 720 - గృహాల సంఖ్య 382

తాగు నీరు[మార్చు]

తాగునీటి కోసం చేతిపంపులు, బోరుబావులు, కాలువలు, చెరువులు వంటి సౌకర్యాలేమీ లేవు.

భూమి వినియోగం[మార్చు]

వెంకటనరసిమ్హాపురంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 9 హెక్టార్లు
  • బంజరు భూమి: 68 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 67 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 68 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 67 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

వెంకటనరసింహాపురంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • చెరువులు: 50 హెక్టార్లు
  • ఇతర వనరుల ద్వారా: 16 హెక్టార్లు

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011". Cite web requires |website= (help)

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు అమరావతి; 2017,మార్చి-21; 10వపేజీ.