వెంకటరమణప్ప
| వెంకటరమణప్ప | |||
| నియోజకవర్గం | పావగడ | ||
|---|---|---|---|
| పదవీ కాలం 2018 – 2023 | |||
| ముందు | కె.ఎం. తిమ్మరాయప్ప | ||
| తరువాత | హెచ్. వి. వెంకటేష్ | ||
| పదవీ కాలం 2008 – 2013 | |||
| ముందు | కె.ఎం. తిమ్మరాయప్ప | ||
| తరువాత | కె.ఎం. తిమ్మరాయప్ప | ||
| పదవీ కాలం 1999 – 2004 | |||
| ముందు | కె.ఎం. తిమ్మరాయప్ప | ||
| తరువాత | సోమ్లా నాయక్ | ||
| పదవీ కాలం 1989 – 1994 | |||
| ముందు | సోమ్లా నాయక్ | ||
| తరువాత | సోమ్లా నాయక్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
వెంకటరమణప్ప కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు పావగడ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]వెంకటరమణప్ప భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1989 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో పావగడ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ (జెపి) అభ్యర్థి తిప్పేస్వామిపై 24763 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 1994 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ అభ్యర్థి సోమ్లానాయక్ చేతిలో 5196 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
వెంకటరమణప్ప 1999 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ (యునైటెడ్) అభ్యర్థి సోమ్లనాయక్ పై 21102 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2004 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి కె.ఎం. తిమ్మరాయప్ప చేతిలో 8078 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
వెంకటరమణప్ప 2008 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి కె.ఎం. తిమ్మరాయప్పపై 13047 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4] ఆయన 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి కె.ఎం. తిమ్మరాయప్పపై 409 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5]
మరణం
[మార్చు]వెంకటరమణప్ప 2026 మే 29 న గుండె పోటు తో మరణించాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Regional, caste calculations dominate as Kumaraswamy inducts 25 ministers" (in ఇంగ్లీష్). The Week. 6 June 2018. Archived from the original on 11 May 2025. Retrieved 11 May 2025.
- ↑ "Assembly Election Results in 1989, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-04.
- ↑ "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-04.
- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-04.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "గుండెపోటుతో మాజీ మంత్రి వెంకటరమణప్ప మృతి | - | Sakshi". www.sakshi.com. Retrieved 2026-05-30.