వెంకట్రాజులపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వెంకట్రాజులపల్లె, కడప జిల్లా చిట్వేలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ ప్రముఖులు[మార్చు]

  • అంతటి నరసింహం :సంఘ సంస్కరణాభిలాష కలిగిన రచయిత[1].ఇతడు 1925లో వెంకట్రాజులపల్లెలో సుబ్బమ్మ, చెంచలయ్య దంపతులకు జన్మించాడు.1974లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి "ప్రబంధాలలో ప్రకృతి వర్ణన" అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందాడు. 1946 నుండి 1976ల మధ్య అనేక ప్రభుత్వ కళాశాలలో ఆంధ్రోపన్యాసకుడిగా పనిచేశాడు.1976 నుండి కొంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ ప్రత్యేకాధికారిగా పనిచేశాడు.

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామం వద్ద గుంజనేరు నదిపై రైల్వే వంతెన నిర్మాణం జరుగుతుంది. ఓబులవారిపల్లె నుండి నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం వరకు, 950 కోట్లవ్యయంతో, 118 కి.మీ. పొడవుతో నిర్మించుచున్న రైలు మార్గంలో భాగంగా ఈ వంతెన నిర్మించుచున్నారు. ఈ రైలు మార్గం పూర్తి అయినచో, బళ్ళారి, మంగంపేట నుండి ఇనుపఖనిజాన్ని, కృష్ణపట్నం ఓడరేవు ద్వారా విదేశాలకు ఎగుమతి చేసే వీలు కలుగుతుంది.

మూలాలు[మార్చు]

  1. కల్లూరు, అహోబలరావు (1986). రాయలసీమ రచయితల చరిత్ర - 4వ సంపుటి (1 ed.). హిందూపురం: శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల. pp. 97–102.

వెలుపలి లింకులు[మార్చు]